Brahmamudi weekly roundup: ఇందూ ఎత్తులకు రేఖ చిత్తు... దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన రాజ్..

Photo Courtesy: JioHotstar

రాజ్ పుట్టుక గురించి నిజం ఎవ్వరికీ చెప్పొద్దని లక్ష్మీ- చలపతిలకు హెచ్చరిస్తుంది పీఏ శృతి. ఆస్తి పేపర్ల మీద ఇందూ వేలిముద్రలు వేయడంతో అపర్ణ, సుభాష్‌లు బాధపడతారు. ఇందూ వేసిన వేలిముద్రలు చెల్లవని, ఆమెకు పెళ్లి జరిగే వరకు ఆస్తి మీద హక్కు రాదని లాయర్ చెప్పడంతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. దాంతో తన కొడుకు మదన్‌ని పిలిపించి ఇందూతో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది రేఖ. మదన్‌ని స్వాతికిచ్చి పెళ్లి చేస్తానని అన్నావు కదా అని భ్రమరాంబ అడగ్గా.. ఆమెను అవమానిస్తుంది రేఖ. మదన్‌ని ప్రేమించిన స్వాతి ఏడుస్తుండగా ఆమెకు ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరగదని చెబుతుంది ఇందూ. రాజ్ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇష్టమొచ్చినట్లుగా తిడుతుంది ఐశ్వర్య. తనను పెళ్లి చేసుకున్నట్లు నాటకమాడితే డబ్బులు ఇస్తానని ఇందూ చెప్పడంతో రాజ్ డీల్‌కు ఒప్పుకుంటాడు. గుడికి వెళ్తున్న ఇందూని రాజ్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని దుగ్గిరాల వారింటికి వస్తాడు. తన కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ని చూసి సుభాష్, అపర్ణలు షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup May 4th to May 9th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి మే 4వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు .. 1023వ ఎపిసోడ్ నుంచి 1028వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

మే 4వ తేదీ 1023వ ఎపిసోడ్‌లో ..
మీ పెద్ద కొడుకుగా ఉన్న రాజ్.. దుగ్గిరాల కుటుంబానికి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వారసుడని చలపతి- లక్ష్మీలకు చెబుతుంది పీఏ శృతి. కొన్నేళ్ల క్రితం దుగ్గిరాల కుటుంబం మొత్తం శ్రీశైలం వెళ్తుండగా వ్యాన్ పేలిపోయి అందరూ చనిపోయారు. కానీ ఈ పిల్లాడు మాత్రం వ్యాన్‌లో నుంచి కిందపడిపోయినట్లుగా ఉన్నాడు. ఇతను బతికున్నాడని ఆ రేఖకి తెలిస్తే రాజ్‌ని చంపేస్తుంది. అందుకే ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వొద్దని, రాజ్‌ని జాగ్రత్తగా కాపాడమని చెప్పి వెళ్లిపోతుంది పీఏ శృతి. ఆమె మాటలతో చలపతి- లక్ష్మీలకు చెమటలు పడతాయి. నా డబ్బులు నాకు ఇవ్వాలంటూ రాజ్ దగ్గర ఐశ్వర్య గొడవ చేస్తుంది. నేను వాటిని నా పర్సనల్ ఖర్చులకు వాడుకున్నాను, త్వరలోనే ఇస్తానని చెబుతాడు రాజ్. ఇందూతో రేఖ ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు వేయించడంతో మనవరాలిపై అపర్ణ మండిపడుతుంది. ఆస్తి ఆ రేఖ పేరు మీదకి రాలేదు, ఇంకా నా పేరు మీదే ఉందని చెబుతుంది ఇందూ. ఆమె ఏం చెబుతున్నది అర్ధం కాక సుభాష్, అపర్ణ, స్వాతిలు కంగారుపడతారు. ఆస్తి పేపర్లు మొత్తం చూసిన లాయర్ ఆస్తి మీ పేరు మీదకి రాదని చెప్పడంతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. ఇందూకి పెళ్లయిన తర్వాతే ఆస్తి తన పేరు మీదకి వచ్చేలా రాజ్- కావ్యలు రాయించిన వీలునామాను లాయర్ బయటపెట్టడంతో రేఖ షాక్ అవుతుంది.

మే 5వ తేదీ 1024వ ఎపిసోడ్‌లో..
ఆస్తి పేపర్ల మీద నేను వేసిన వేలిముద్రలు చెల్లవని నాకు ముందే తెలుసు.. నాకు పెళ్లయితేనే ఈ ఆస్తి మీద హక్కు వస్తుందని ఇందూ చెప్పడంతో సుభాష్, అపర్ణ, స్వాతిలు సంతోషిస్తారు. ఆస్తి మొత్తం చేజారిపోయే పరిస్ధితులు రావడంతో రేఖ, భ్రమరాంబ, భూషణ్‌లు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఆ వెంటనే తన కొడుకు మదన్‌కి ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెబుతుంది రేఖ. ఉదయాన్నే తన కొడుకు మదన్ రావడంతో ఆస్తి మన చేతికి రావాలంటే నువ్వు ఇందూని పెళ్లి చేసుకోవాలని రేఖ ఒప్పిస్తుంది. మదన్‌కి, నా కూతురు స్వాతికి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా అని రేఖని అడుగుతుంది భ్రమరాంబ. నీ దగ్గర ఏం ఉందని నా కొడుక్కి నీ కూతురినిచ్చి పెళ్లి చేస్తానని రేఖ ప్లేట్ తిప్పేయడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. డబ్బు వసూలు చేసుకోవడం ఇంటికొస్తున్న రాకేష్‌ని చూసిన ఐశ్వర్య అతనిని గుమ్మం దగ్గరే ఆపేస్తుంది ఐశ్వర్య. మంచంపై నిద్రపోతున్న రాజ్‌ని చూసిన లక్ష్మీ- చలపతిలకు శృతి చెప్పిన విషయాలు గుర్తొస్తాయి. రాజ్ పుట్టుక గురించి నిజం ఎప్పటికీ బయటపెట్టకూడదని ఇద్దరూ అనుకుంటారు.

Brahmamudi Telugu Serial Weekly roundup May 4th to May 9th episode Story

Photo Courtesy: JioHotstar

మే 6వ తేదీ 1025వ ఎపిసోడ్‌లో..
నీతో మాట్లాడి మాట్లాడి విసిగిపోయాను.. నా డబ్బులు నాకు ఇస్తావా? లేక మీ ఆంటీతో తేల్చుకోమంటావా అని ఐశ్వర్యని నిలదీస్తాడు రాకేష్. నువ్వు వెళ్లి మా ఆంటీని అడిగి.. ఈ విషయంతో నాకు సంబంధం లేదని మా ఆంటీ చెబితే మాత్రం నీకు ఒక్క పైసా కూడా ఇవ్వనని ఐశ్వర్య. దాంతో వారం గడువిస్తాడు రాకేష్. ఆ వెంటనే రాజ్‌కి ఫోన్ చేసి నోటికొచ్చినట్లు తిడుతుంది ఐశ్వర్య. దాంతో రాజ్ కూడా సీరియస్ అవుతాడు. ఐశ్వర్యతో నా రిలేషన్ చెడగొట్టావని రాజ్‌పై లక్కీ అలిగి వెళ్లిపోతాడు. నీ పెళ్లి అయ్యే వరకు రేఖ ఆంటీ ఏం చేయలేదని ఇందూ, స్వాతిలు నవ్వుకుంటూ ఉండగా రేఖ పిలుస్తుంది. హాల్‌లో పంతులుగారు ఉండటంతో అపర్ణ, ఇందూ, స్వాతి షాక్ అవుతారు. నా కొడుకు మదన్‌తో ఇందూ పెళ్లి చేయబోతున్నానని రేఖ చెప్పడంతో సుభాష్, అపర్ణలు మండిపడతారు. ఇందూ కంటే మదన్ మూడేళ్లు చిన్నవాడని అపర్ణ చెబుతుంది. మీకు ఇష్టం ఉన్నా.. లేకున్నా ఈ పెళ్లి జరిగి తీరుతుందని తేల్చిచెబుతుంది. అర్ధరాత్రి భోజనం చేయకుండా స్వాతి గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అది చూసిన ఇందూ.. ఏం జరిగిందని అడుగుతుంది. నేను ప్రేమించిన మదన్‌ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది.

మే 7వ తేదీ 1026వ ఎపిసోడ్‌లో..
స్వాతిని ఓదార్చి మదన్‌తో నా పెళ్లి జరగదని మాటిస్తుంది ఇందూ. అసలు ఇందూ ఫ్యామిలీ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నువ్వేం చేశావు? పంజాగుట్ట ఆసుపత్రికి ఎందుకు వెళ్లావని రాజ్‌ని లక్కీ ప్రశ్నిస్తాడు. ఆ 10 లక్షలు ఐశ్వర్యకి ఇచ్చి నా లైఫ్‌ని సెట్ చేసుకుందామనుకుంటే మొత్తం పాడు చేశావని బాధపడతూ వెళ్లిపోతాడు. రాజ్‌కి ఇందూ ఫోన్ చేసి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, దానిని ఆపితే డబ్బులు ఇస్తానని డీల్ మాట్లాడటంతో రాజ్ ఒప్పుకుంటాడు. ఉదయాన్నే పెళ్లి కోసం ఇందూ రెడీ అవ్వగా.. పెళ్లి గుడిలో కాదు రిజిస్ట్రార్ ఆఫీసులో అని రేఖ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. నా మనవరాలికి గుడిలో గౌరీ పూజ చేయించాలని అనుకుంటున్నానని అపర్ణ అడుగుతుంది. దానికి రేఖ ఒప్పుకోదు.. అయితే ఇందూ ప్రాదేయపడటంతో సరేనని అంటుంది. కానీ భ్రమరాంబని తోడుగా పంపుతుంది రేఖ. ఇందూని తీసుకుని వెళ్తుండగా ఆ కారుకి డ్రైవర్‌గా ఉన్న రాజ్.. భ్రమరాంబని కత్తితో బెదిరించి ఇందూని కిడ్నాప్ చేస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup May 4th to May 9th episode Story

Photo Courtesy: JioHotstar

మే 8వ తేదీ 1027వ ఎపిసోడ్‌లో..
రాజ్ దెబ్బకు పరిగెత్తుకుంటూ ఇంటికి పారిపోతుంది భ్రమరాంబ. మదన్‌ని పెళ్లికొడుకుని చేసి మురిసిపోతారు రేఖ, భూషణ్. అయితే మదన్ బాధగా ఉండటంతో నీకోసమే ఇదంతా చేస్తున్నాను.. రేపు ఆస్తి నా పేరు మీదకి వచ్చిన తర్వాత ఇందూని వదిలేయ్, నీ ఇష్టమొచ్చినట్లు బతకమని చెబుతుంది రేఖ. ఇంతలో స్వాతి వచ్చి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావా బావా అని అడుగుతుంది మదన్. ఆమెపై సీరియస్ అయిన రేఖ.. ఇందూ గురించి అడుగుతుంది. ఇందూ ఇంకా రాకపోవడంతో అపర్ణ మీద అరుస్తుంది. ఇంతలో భ్రమరాంబ కంగారుగా ఇంటికి వచ్చి ఇందూని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వే నీ మనవరాలిని ప్లాన్ చేసి తప్పించావా అంటూ అపర్ణపై భగ్గుమంటుంది రేఖ. నిజం చెబుతావా? లేక కాల్చిపారేయనా అని గన్‌తో బెదిరిస్తుండగా ఇందూ- రాజ్‌లు పెళ్లి చేసుకుని రావడంతో రేఖ ఖంగు తింటుంది. తన కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ను చూసి మురిసిపోతుంది అపర్ణ. ఇతను నీ కొడుకు కాదు.. ఈ ఇంటికి ఏమాత్రం సంబంధం లేదని అపర్ణ నోరు మూసేస్తుంది రేఖ.

మే 9వ తేదీ 1028వ ఎపిసోడ్‌లో..
మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది.. మీ దగ్గర 20 లక్షల రూపాయలు కొట్టేసింది నేనే అని రాజ్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. కిడ్నాప్ తర్వాత నా దగ్గరే ఉన్న ఇందూపై నాకు ఇష్టం పెరిగిపోయింది. ఒక ఉరుము ఉరిమిన రాత్రి మేమిద్దరం ఒక్కటయ్యామని కట్టుకథ చెబుతాడు రాజ్. ఇందూని కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి కట్టానని ఫోటోలు చూపిస్తాడు. ఈ పెళ్లి చెల్లదు, దీనికి నేను ఒప్పుకోనని ఇందూ మెడలోని తాళిని రేఖ తెంచేస్తుండగా రాజ్ అడ్డుకుంటాడు. నా భార్య జోలికి, నేను కట్టిన తాళి జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. చేసేదేం లేక రాజ్- ఇందూలను లోపలికి తీసుకురమ్మని చెబుతుంది రేఖ. మదన్‌తో ఇందూ పెళ్లి ఆగిపోవడంతో భ్రమరాంబ చాలా సంతోషించి.. రాజ్- ఇందూలకు హారతిచ్చి లోపలికి పిలుస్తుంది. అచ్చం తన కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ని చూసి అపర్ణ, సుభాష్‌లు మురిసిపోతారు. నువ్వెవరు? నీ తల్లిదండ్రులెవరు? అని ఆరా తీస్తుంది అపర్ణ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X