Brahmamudi weekly roundup : కావ్య ప్లాన్ ఫెయిల్ .. ఐసీయూలో రాజ్, రుద్రాణికి షాకిచ్చిన అపర్ణ
రాజ్‌తో గడిపి అతనికి గతం గుర్తుచేయాలని రిసార్ట్‌కు తీసుకొచ్చిన కావ్య.. అక్కడ కళ్యాణ్ - అప్పూలను పరిచయం చేస్తుంది. రాజ్ ఫ్రెండ్స్ కూడా వీళ్లకి హెల్ప్ చేస్తారు. రాజ్‌కి కనిపించేలా కొన్ని నగల డిజైన్లను బెడ్‌రూంలో పెట్టిస్తుంది కావ్య. రాజ్ కోసం యామిని రిసార్ట్‌కి వస్తుంది. ఆమెను చూసిన రాజ్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడగటంతో నువ్వు మేసేజ్ పెడితేనే వచ్చానని ఫోన్ చూపిస్తుంది యామిని. రుద్రాణి- రాహుల్‌కు ఇచ్చిన పాప ధాన్యలక్ష్మీ దగ్గర కనిపించడంతో కంగారుపడిన స్వప్న ఈ విషయాన్ని అప్పూకి ఫోన్ చేసి చెబుతుంది. వెయిటర్స్‌గా మారువేషంలో రిసార్ట్‌లోకి ప్రవేశిస్తారు రుద్రాణి - రాహుల్. సీతారామయ్యతో రాజ్‌ని వీడియో కాల్ మాట్లాడిస్తుంది కావ్య.
వెయిటర్స్‌గా ఉన్న రాహుల్ - రుద్రాణిలను రాజ్ ఫ్రెండ్స్ ఆడుకుంటుండగా అప్పూ పకపక నవ్వుతుంది. రాజ్‌కు మరో అమ్మాయి భోజనం తీసుకురావడంతో కావ్య అలిగి వెళ్లిపోతుంది. ఆమె వెనకాలే వెళ్లిన రాజ్ తన మనసులోని మాటను చెబుతుండగా యామిని అడ్డుపడుతుంది. రాత్రి పార్టీలో రాజ్ - కావ్యల ప్రేమకథను తమ లవ్ స్టోరీగా చెబుతారు కళ్యాణ్ - అప్పూ. దాంతో రాజ్‌కు గతం గుర్తొస్తూ ఉంటుంది. పార్టీని చెడగొట్టేందుకు యామిని, రాహుల్, రుద్రాణిలు పవర్ కట్ చేస్తారు.
కళ్యాణ్ చెబుతున్న కథ తను ఎక్కడో విన్నట్లు, తనకే జరిగినట్లుగా గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తాడు రాజ్. ఈ దెబ్బతో మైండ్‌పై ప్రెజర్ పడి కుప్పకూలిపోవడంతో కావ్య వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుంది. రాజ్ కళ్లు తెరిచి చూసేసరికి కావ్య కనిపించకపోవడంతో ఆమె గురించి ఉన్నది లేనిది చెబుతుంది యామిని. ఇంటికి వచ్చేసరికి రిసార్ట్‌లో ఏం చేశావు? ఎవరితో తిరిగావని? కావ్యని నిలదీస్తుంది రుద్రాణి. రాజ్ బతికే ఉన్నాడని, గతం మరిచిపోయాడని మాకు తెలుసని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఆసుపత్రికి కావ్య రాకపోవడంతో ఏం జరిగిందోనని ఆమెకు రాజ్ ఫోన్ చేస్తాడు. అయినా కావ్య ఫోన్ లిప్ట్ చేయదు.

బ్రహ్మముడి మే 5వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు .. 713 ఎపిసోడ్ నుంచి 718 వరకు ఏం జరిగిందంటే?
మే 5వ తేదీ 713వ ఎపిసోడ్‌లో ... రాజ్‌కి గతం గుర్తొచ్చేలా చేసేందుకు కావ్యకి అండగా నిలబడుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ. రిసార్ట్‌లో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను కళ్యాణ్ చేస్తాడు. రాజ్- కావ్యలు రిసార్ట్‌కు రాగానే కళ్యాణ్ - అప్పూలని రాజ్‌కి పరిచయం చేస్తుంది కావ్య. మీరు మా అన్నయ్యలా ఉన్నారని చెప్పడంతో నన్ను మీ అన్నయ్యగానే అనుకోమని చెబుతాడు రాజ్. దాంతో రాజ్‌ని హత్తుకుంటాడు కళ్యాణ్. శ్వేత అనే అమ్మాయితో కలిసి కళ్యాణ్ - అప్పూలు డ్రామా ఆడగా రాజ్‌కు ఏదో గతం గుర్తొస్తుంది. రిసార్ట్‌లో కళ్యాణ్ - రాజ్‌లు ఒక గదిలో.. అప్పూ - కావ్యలు ఒక గదిలో ఉంటారు. కావ్యని కలిసి తన మనసులో ఏముందో కనుక్కోవడంతో పాటు.. తన మనసులోని మాటను చెప్పాలని రాజ్ విశ్వప్రయత్నాలు చేస్తాడు. శృతితో ఆఫీస్ నుంచి కొన్ని డిజైన్లు తీసుకొచ్చి రాజ్‌కి కనిపించేలా పెడుతుంది కావ్య. కళ్యాణ్‌తో వాళ్ల రూమ్‌లో వాటర్ రాకుండా చేసి రాజ్‌ను తన రూమ్‌లోకి వచ్చేలా చేస్తుంది.
మే 6వ తేదీ 714వ ఎపిసోడ్‌లో ... కావ్య ప్లాన్‌ను తిప్పి కొట్టాలని రిసార్ట్‌లో అడుగుపెడుతుంది యామిని. ఆమెను గమనించిన కావ్య దొంగ దొంగ అని గట్టిగా కేకలు పెడుతుంది. నువ్వేం చేసినా నేను రాజ్‌ను వదిలిపెట్టనని, మీ ఇద్దరి మధ్యలోకి అడుగుపెడతానని చెబుతుంది యామిని. రిసార్ట్‌లో యామినిని చూసిన రాజ్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు. నువ్వు మెసేజ్ పెడితేనే వచ్చానని యామిని ఫోన్ చూపించడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. రుద్రాణి చేతుల్లో ఉండాల్సిన పాప ధాన్యలక్ష్మీ చేతుల్లో ఉండటంతో షాక్ అవుతుంది స్వప్న. మనం అనుకున్న విషయం మరిచిపోయానని రుద్రాణి పాపని ఇస్తే తీసుకున్నానని చెబుతుంది ధాన్యలక్ష్మీ. కావ్య- రాజ్‌లు ఉన్న రిసార్ట్‌లోకి వెళ్తుండగా రుద్రాణి, రాహుల్‌లను ఆపుతాడు సెక్యూరిటీ గార్డ్. దాంతో వెయిటర్స్‌కి డబ్బులు ఎరవేసి వాళ్ల డ్రెస్‌లో లోపలికి వెళ్తారు తల్లీకొడుకులు.
మే 7వ తేదీ 715వ ఎపిసోడ్‌లో ... కావ్య- రాజ్‌లను ఫాలో అవుతూ రుద్రాణి - రాహుల్‌లు రిసార్ట్‌కి వచ్చారని అప్పూకి ఫోన్ చేసి చెబుతుంది స్వప్న. వాళ్ల సంగతి నేను చూసుకుంటానని చెబుతుంది అప్పూ. ఇంట్లో నా మాటకు ఎవ్వరూ విలువ ఇవ్వడం లేదని, నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సీతారామయ్య బాధపడతాడు. అసలేం జరిగిందని అపర్ణ అడగ్గా రాజ్‌ను చూస్తేనే కానీ భోజనం చేయనని పట్టుబట్టడతాడు. దాంతో వెంటనే కావ్యకి ఫోన్ చేసి రాజ్‌తో వీడియో కాల్ మాట్లాడించమని చెబుతుంది అపర్ణ. యామినితో మాట్లాడతున్న రాజ్‌కి సైగలు చేసి మా ఇంట్లో వాళ్లు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పడంతో రాజ్ ఎగిరిగంతేస్తాడు. సీతారామయ్యతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ అందరితో ఫోన్‌లో మాట్లాడతాడు రాజ్. వెయిటర్స్ వేషంలో ఉన్న రాహుల్ - రుద్రాణిలను రాజ్ ఫ్రెండ్స్ ఓ ఆట ఆడుకుంటారు. వారి బాధల్ని చూసిన అప్పూ తనలో తాను నవ్వుకుంటుంది.

మే 8వ తేదీ 716వ ఎపిసోడ్‌లో ... రాజ్‌కు వేరే అమ్మాయి భోజనం ప్లేట్ తీసుకొచ్చి ఇవ్వడంతో కావ్య అలిగి కోపంతో ప్లేట్ కింద విసిరి కొడుతుంది. కళావతి మిమ్మల్ని ఇష్టపడుతోందని.. అందుకే నేను మీతో మాట్లాడుతుంటే అసూయ పడుతుందని రాజ్‌కి ఆ అమ్మాయి చెబుతుంది. దాంతో కళావతితో తన మనసులో మాటను చెప్పాల్సిందేనని డిసైడ్ అయిన రాజ్‌ను యామిని గమనిస్తుంది. అలా జరగకుండా రాజ్‌కు అడ్డుపడి అతనిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నైట్ మనం అనుకున్నది చేయాల్సిందేనని అప్పూ- కళ్యాణ్‌లతో కావ్య అంటుంది. రాత్రి అందరూ కలిసి ఓ చోట హాయిగా కూర్చొని ఉండగా సందీప్‌ను మీ లవ్ స్టోరీ చెప్పాలని అడుగుతుంది శృతి. నా కంటే కళ్యాణ్ - అప్పూల ప్రేమకథ బాగుంటుందని సందీప్ చెప్పడంతో వాళ్లిద్దరూ స్టేజ్ మీదకి వెళ్లి రాజ్ - కావ్యల ప్రేమకథను చెబుతారు. ఇదంతా తన జీవితంలో జరిగినట్లే ఉందని రాజ్ ఆలోచిస్తుంటాడు. అది గమనించిన యామిని, రాహుల్, రుద్రాణిలు కంగారుపడతారు. పార్టీని చెడగొట్టడానికి, రాజ్‌కి గతం గుర్తు రాకుండా చేయడానికి పవర్ కట్ చేస్తారు.
మే 9వ తేదీ 717వ ఎపిసోడ్‌లో ... రాజ్‌కు గతం గుర్తొస్తే తమ జీవితాలు మారిపోతాయని భయపడ్డ రాహుల్, యామిని, రుద్రాణిలు పవర్ కట్ చేయాలని అనుకుంటారు. ముగ్గురు కలిసి మెయిన్ దగ్గరికి వెళ్లి ఒకరికొకరు ఎదురుపడతారు. శత్రువుకు శత్రువు మిత్రుడని చెప్పి ఇద్దరూ కలిసి పవర్ కట్ చేస్తారు. కరెంట్ పోవడంతో మేనేజర్‌పై రాజ్ మండిపడతాడు. నా ముందు నీ ఆటలు సాగవని కావ్యకి యామిని వార్నింగ్ ఇస్తుంది. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియదు, ఇక్కడ ఉండటం ఎందుకని చెప్పి రాజ్‌ను తీసుకెళ్లిపోతుంది యామిని. నేను ఈ పార్టీలో ఉండటం, కళ్యాణ్ చెప్పేది వినడం చాలా ముఖ్యమని అందరినీ ఫోన్ లైట్స్ ఆన్ చేయమని చెబుతాడు. కళ్యాణ్ మిగిలిన కథ చెప్పడంతో దాని గురించే ఆలోచిస్తూ రాజ్ కళ్లు తిరిగి పడిపోవడంతో అంతా టెన్షన్ పడతారు. రాజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తుంది కావ్య. ఆయనకి గతం గుర్తుచేయొద్దని మీకు చెప్పాను కదా అని కావ్యపై డాక్టర్ కోప్పడతాడు.
మే 10వ తేదీ 718వ ఎపిసోడ్‌లో ... కావ్య గురించి ఉన్నది లేనిది చెప్పి రాజ్ మనసు విరిచేస్తుంది యామిని. నీ గురించి యామిని చెడుగా చెబుతోందని కావ్యతో కళ్యాణ్ అంటాడు. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అది చాలని అంటుంది కావ్య. మనం ఇక్కడ ఉండకూడదని కళ్యాణ్, అప్పూలని తీసుకుని కావ్య వెళ్లిపోతుంది. ఇంటికొచ్చేసరికి ఎక్కడికి వెళ్లి వస్తున్నావని కావ్యపై మండిపడుతుంది రుద్రాణి. మీ కోడలు రాజ్‌లాగే ఉన్న మరో వ్యక్తితో తిరుగుతుందని చెప్పడంతో అపర్ణ ఫైర్ అవుతుంది. రాజ్ వేరు రామ్ వేరు కాదని .. ఇద్దరూ ఒకటేనని, అసలు కావ్యను రిసార్ట్‌కు పంపిందే మేం అని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో రుద్రాణికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇకపై నేను ఆయనతో మాట్లాడనని కావ్య చెప్పడంతో కుటుంబం షాక్ అవుతుంది. కళావతి నా కోసం ఎందుకు ఆసుపత్రికి రాలేదని రాజ్ ఆలోచిస్తూ ఆమెకు ఫోన్ చేయగా కావ్య కట్ చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications










