Brahmamudi Weekly Roundup రాజ్ తెచ్చిన బిడ్డ ఎవరో తెలుసుకొన్న కావ్య.. నిజం తెలిసినా చెప్పలేనంటూ దేవుడితో ఆవేదన
బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ తీసుకొచ్చి బిడ్డ ఎవరనే విషయంపై ఇంట్లో రకరకాల గొడవలు మొదలవుతాయి. అయితే రాజ్ బిడ్డ ఎవరనే విషయాన్ని కావ్య తెలుసుకొంటుంది. అయితే చేయని తప్పుకు రాజ్ బలి కావడమే కాకుండా ఇంటి పరువు, తల్లి గుండె పగులుతుందనే విషయంతో రాజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాలని అనుకొంటాడు. మే 6వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
మే 6వ తేదీ ఎపిసోడ్ 402 లో
మాయతో రాజ్ రోజు మాట్లాడుతుంటాడు. ఆ ఇంటికి వారసుడు అవుతాడని మాయ నుంచి బిడ్డను తీసుకొన్నాడు. అయితే ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదని ఇప్పుడే తెలిసిందని ఓ వ్యక్తి చెబుతాడు. దాంతో వారు ఆఫీస్‌కు నిజం తెలుసు కోవాలని అనుకొంటారు. అయితే సెక్యూరిటీతో మాట్లాడుతూ.. మా పెళ్లి రోజు గుర్తుందా అని కావ్య అంటే.. తెలుసు. ఆ రోజు రాజ్ సార్ నాకు బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు అని సెక్యూరిటీ చెబుతాడు. ఆ రోజు ఎవరైనా ఆఫీస్‌కు వచ్చారా? అంటే.. ఆ సమయంలో నేను క్యాంటీన్‌కు వెళ్లాను. కావాలంటే సీసీటీవీలో చూడు అంటే.. చెక్ చేస్తే.. విజువల్స్ డిలీట్ చేసి ఉంటాయి. దాంతో హార్డ్ డిస్క్ తీసుకొంటారు.

మే 7వ తేదీ ఎపిసోడ్ 403 లో
ఓ వీడియోలో సుభాష్ ఉరి వేసుకొనే ప్రయత్నం చూసి షాక్ అవుతుంది. తన తండ్రి పరిస్థితి చూసి రాజ్ షాక్ అవుతాడు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే.. నా వల్ల మీ అమ్మకి అన్యాయం జరిగింది. వైజాగ్ బ్రాంచ్‌లో మాయ అనే అమ్మాయితో సంబంధం పెట్టుకొన్నాడు. నా వల్ల బాబు పుట్టాడు. ఆ చిన్నారిని మన ఇంటికి వారసుడిగా ప్రకటించమని ఒత్తిడి చేసింది. నేను ప్రయత్నించాను. కానీ ఒప్పుకోలేదు. ఈ విషయం తెలిస్తే మీ అమ్మ గుండె పగులుతుంది చెప్పడం, రాజ్ వెంటనే.. ఆ బిడ్డను నా బిడ్డగా ఇంటికి తీసుకొస్తానని చెప్పడాన్ని వీడియోలో చూసి కావ్య షాక్ తింటుంది.

మే 8వ తేదీ ఎపిసోడ్ 404 లో
వీడియోలో సుభాష్, రాజ్ మధ్య జరిగిన సన్నివేశం చూసి కావ్య దిగ్బ్రాంతికి గురి అయింది. రాజ్ తీసుకొచ్చి ఎవరి బిడ్డ అని తెలిసినా చెప్పలేని స్థితిలోకి నెట్టావు. నిజం తెలిస్తే అత్తగారు భరిస్తారా? ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించు భగవంతుడా అనే వేడుకొంటుంది. ఇక ఇంట్లో డాక్యుమెంట్లు మాయం కావడం.. వాటిని రాహుల్ కుదువ పెట్టి కోటి రూపాయలు సేట్ నుంచి తెచ్చుకొన్న విషయం రుద్రాణి కనిపెట్టడం.. ఆ తర్వాత ఆ విషయంలో డ్రామా కొనసాగడం ప్రధానంగా సీరియల్‌లో కనిపిస్తుంది.
మే 9వ తేదీ ఎపిసోడ్ 405 లో
బిడ్డ వ్యవహారం ఇంటిలో రకరకాల వివాదాలకు దారి తిసింది. ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానని చెప్పు లేదా నిజం చెప్పండి అంటూ అపర్ణ నిలదీసింది. బిడ్డ తీసుకొచ్చి కావ్యకు అన్యాయం చేశావని స్వప్న నిలదీస్తుంది. రాజ్‌ను పంపించమని చెప్పలేదు. ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడవద్దు. ఇది కుటుంబ సమస్య అని అపర్ణ అంటుంది. దాంతో అమ్మను ఏమీ అనొద్దు.. నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనే హక్కు ఆమెకు ఉంది అని రాజ్ అంటాడు. అపర్ణ వద్దకు వచ్చి నీవు తీసుకొన్న నిర్ణయం బాగాలేదు అని సుభాష్ అంటాడు. అయితే తన బిడ్డను తీసుకొని రాజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయం తీసుకొంటాడు.

మే 10వ తేదీ 406 ఎపిసోడ్‌లో
రాజ్ చేసిన పనికి కావ్యపై అపర్ణ జాలి పడుతుంది. అతడిని పెళ్లి చేసుకొని కావ్య ఏం సుఖపడింది. భార్యను ఉంచుకొని మరో వ్యక్తితో బిడ్డను కన్నాడు. అలాంటి వాడితో ఎవరైనా సంసారం చేస్తాడా? అని అపర్ణ అంటే.. రాజ్ నిజం చెప్పడం లేదు. రేపటి వరకు నిజం చెప్పకపోతే.. నేనే ఇంటి నుంచి వెళ్లిపోతాను అంటూ అపర్ణ షాకింగ్‌గా అంటుంది. అయితే ఏదో ఒకటి చేసి అత్తయ్యను వెళ్లకుండా ఆపుతాను అని కావ్య అంటుంది. ఇక స్వప్న లాకర్‌లో ఉన్న కోటి రూపాయలు కొట్టేయాలని రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేస్తారు.
మే 11వ తేదీ 407 ఎపిసోడ్‌లో
ఇక అపర్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రెడీ అయి వస్తుంది. అంతలోనే రాజ్ కూడా బిడ్డను ఎత్తుకొని.. మరో చేతిలో బ్యాగ్ పట్టుకొని ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతాడు. అయితే తల్లిని ఆపి.. నీవు ఇంటిని వెళ్లితే.. సుఖంగా ఉండలేవు.. నేను వెళ్తాను అంటే.. ఈ త్యాగాలను భరించలేనని అపర్ణ అంటుంది. అయితే అపర్ణ ఇంటి నుంచి వెళ్లడానికి సిద్దమవుతుంటే.. సుభాష్ గట్టిగా అరిచి .. రాజ్ ఎందుకు నిజం చెప్పడం లేదని అనుకొంటున్నావా? నేను నిజం చెబుతాను అంటూ ఏదో చెప్పబోతే.. ఆగండి మామయ్య అంటూ కావ్య అరిచింది. మీరు ఇంటి నుంచి వెళ్లోద్దు. మీరు వెళితే ఇల్లు ముక్కలవుతుంది. అసమర్ధులే రాజ్యం ఏలుతారు అని అంటే.. రుద్రాణి ఏదో చెప్పబోతే.. రుద్రాణి అంటూ కావ్య ఏకవచనంతో పిలువడంతో అందరూ షాక్ తింటారు. ఇంటి సభ్యుల మధ్య గట్టిగానే వాదనలు జరుగుతాయి.


Click it and Unblock the Notifications











