Brahmamudi weekly roundup: రాహుల్‌ క్రూరమైన ప్లాన్... రాజ్‌తో కోరికలు తీర్చుకుంటోన్న కావ్య

Photo Courtesy: JioHotstar

కోయిలి ఇంట్లోకి దొంగతనంగా వెళ్లిన కావ్య, రాజ్‌లు ఓ చోట పెట్టిన సీక్రెట్ కెమెరాను తీసుకొచ్చి చెక్ చేయగా.. కోయిలిని రంజిత్ చంపినట్లుగా తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. రుద్రాణితో బేరాలు ఆడుతోన్న రంజిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. హత్య రాహుల్‌ చేయలేదని తెలుసుకున్న పోలీసులు... రంజిత్‌ని అరెస్ట్ చేసి రాహుల్‌ని విడుదల చేస్తారు. అందరూ చెప్పడంతో రాహుల్‌కి స్వప్న ఓ ఛాన్స్ ఇస్తుంది. నేను చనిపోయే లోపు కొన్ని కోరికలు తీర్చాలని రాజ్‌కి పెద్ద లిస్ట్ ఇస్తుంది కావ్య.

రాహుల్‌ని మార్చాలని ప్రయత్నిస్తోన్న రుద్రాణికి స్వప్న వార్నింగ్ ఇస్తుంది. రాజ్ మాదిరిగా మీరు కూడా మాకు ప్రేమ లేఖలు రాయాలని ధాన్యం, అపర్ణలు ఆర్డర్స్ వేయడంతో ప్రకాశం, సుభాష్‌లు కూడా లవ్ లెటర్స్ రాస్తారు. లత అనే అమ్మాయి పేరు లెటర్‌లో రాయడంతో ప్రకాశంను ధాన్యం చితకబాదుతుంది. రెస్టారెంట్‌కి వెళ్లేముందు కావ్యకి రాజ్ చీరకడతాడు. రెస్టారెంట్‌లో రాహుల్ బేరర్‌గా పనిచేస్తుండటంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. తన మొదటి జీతంతో రాహుల్ చీర కొని తీసుకురావడంతో స్వప్న చాలా సంతోషిస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup November 10th to November 15th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు .. 874వ ఎపిసోడ్ నుంచి 879 వరకు ఏం జరిగిందంటే?

నవంబర్ 10వ తేదీ 874వ ఎపిసోడ్‌లో..
కోయిలిని హత్య చేసిన కేసులో జైళ్లోకి వెళ్లిన రాహుల్‌ని స్వప్న, రుద్రాణిలు పరామర్శిస్తారు. నేను కోయిలి డబ్బు, ఆస్తి మీద ఆశపడ్డాను కానీ ఆమెను చంపలేదని రాహుల్ చెబుతాడు. అయినప్పటికీ అతని మాటలను స్వప్న పట్టించుకోదు. రంజిత్ ఇంట్లో తాము పెట్టిన సీక్రెట్ కెమెరాను తీసుకొచ్చేందుకు కావ్య - రాజ్ రాగా.. ఇంటి చుట్టూ పోలీసులు ఉండటంతో వారిద్దరూ దొంగతనంగా ఇంట్లో ప్రవేశించి కెమెరా సంపాదిస్తారు. రాహుల్ కొట్టి వెళ్లిపోయిన తర్వాత కోయిలిని రంజిత్ చంపినట్లు తెలుసుకున్న కావ్య - రాజ్‌లు నేరుగా పోలీస్ స్టేషన్‌కు బయల్దేరతారు. స్టేషన్ వద్దే రుద్రాణిని రంజిత్ కలిసి నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నా దగ్గరున్న వీడియోను పోలీసులకు ఇస్తానని అప్పుడు నీ కొడుకు జీవితంలో బయటికి రాడని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో రాజ్- కావ్యలు వచ్చి రంజిత్‌ను పోలీసులకు పట్టించి సాక్ష్యాన్ని చూపిస్తారు. దాంతో రాహుల్ నిర్దోషిగా విడుదలవుతాడు. ఇంటికొచ్చిన రాహుల్‌కు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా క్లాస్ పీకుతుంది.

నవంబర్ 11వ తేదీ 875వ ఎపిసోడ్‌లో..
ఇంట్లో వాళ్లంతా చెప్పినా రాహుల్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి స్వప్న ఆలోచిస్తుంది. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు.. ఇకపై ఎలాంటి తప్పు చేయనని భార్యకు చెప్పుకుంటాడు రాహుల్. కావ్య సూచన మేరకు ఓ ఛాన్స్ ఇస్తుంది స్వప్న. నువ్వు నిజంగానే మారిపోయావా? అంటూ రాహుల్‌ని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇకనైనా నన్ను మనిషిగా మారనివ్వు.. లేదంటే నన్ను పురుగు కంటే హీనంగా చూస్తారని అంటాడు రాహుల్. అత్తగారితో భర్త మాటలు విన్న స్వప్న ఎమోషనల్ అవుతుంది. కావ్య అతికించిన బాబు ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటాడు రాజ్. కళావతి ఈ ఇంటి సంతోషం కోసం ఇదంతా చేస్తోంది ...కానీ తన ఆయుష్షు రోజురోజుకు కరిగిపోతోందని ఎమోషనల్ అవుతాడు. ఇంతలో కావ్య వచ్చి నా కోరికల చిట్టా అని, వీటిని మీరు తీర్చాలని చెబుతుంది. ముందుగా చికెన్ మంచూరియా చేయాలని అందులో ఉండటంతో ఎవ్వరికీ కనిపించకుండా కిచెన్‌లో మంచూరియా చేస్తూ దుగ్గిరాల ఫ్యామిలీకి దొరికిపోతాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup November 10th to November 15th episode Story

Photo Courtesy: JioHotstar

నవంబర్ 12వ తేదీ 876వ ఎపిసోడ్‌లో..
నన్ను మా ఫ్యామిలీకి ఇరికించేస్తావా అంటూ కావ్యపై మండిపడతాడు రాజ్. మా కోసం ఏం చేయని నువ్వు.. నీ పెళ్లాం కోసం వంట చేస్తావా అంటూ అపర్ణ, ఇందిర, ప్రకాశం, ధాన్యలక్ష్మీలు రాజ్‌ను హేళన చేస్తారు. మా ఆయనకి నేనంటే ఇష్టం కాబట్టి నాకోసం వంట చేశాడని కావ్య చెబుతుంది. మావయ్యలకి కూడా మీరంటే ఇష్టముంటే మీకోసం వంట చేయాలని సవాల్ విసురుతుంది కావ్య. దాంతో ధాన్యలక్ష్మీ, అపర్ణలు వారి భర్తలను కూడా వంట చేయమంటారు. ప్రకాశం, సుభాష్‌‌‌లు చేసిన ఉప్మాను టేస్ట్ చూసిన ధాన్యం, అపర్ణలు వాంతులు చేసుకుంటారు. రాహుల్‌తో డీల్ మాట్లాడటానికి ఓ వ్యక్తి ఇంటికి వస్తాడు ఓ వ్యక్తి. ఫారిన్ నుంచి దొంగ బంగారం తెప్పించామని దానిని మీ కంపెనీలోనే పెట్టాలని ఇందుకు 20 లక్షల రూపాయలు ఇస్తానని చెబుతాడు. ఇకపై నేను అలాంటి పనులు చేయనని తేల్చి చెబుతాడు రాహుల్. వీరి మాటల్ని విన్న స్వప్న ఎమోషనల్ అవుతుంది. కొడుకు రోజు రోజుకు తన చేయి దాటిపోతూ ఉండటంతో రాహుల్‌ని మార్చాలని చూస్తుంది రుద్రాణి.

నవంబర్ 13వ తేదీ 877వ ఎపిసోడ్‌లో..
మంచివాడిగా మారుతోన్న రాహుల్ మనసుని మార్చొద్దని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది స్వప్న. మీ అబ్బాయి దారికి నువ్వు అడ్డొస్తే నీ దారికి నేను అడ్డొస్తానని.. నేను అడ్డొస్తే త ఆమె వెళ్లిపోగానే.. ఎలా ఉంది నా నటన అని తల్లిని అడుగుతాడు రాహుల్. స్వప్నకి ఎదురెళ్లడం కంటే తన దారికి మనం వెళ్లినట్లుగా నటించి తనని మన దారికి తెచ్చుకోవడం మంచిదని చెబుతాడు రాహుల్. టైం చూసి ఈ కుటుంబాన్ని రాహువు మింగినట్లుగా మింగేస్తానని అంటాడు. నువ్వు ఎక్కడ రాజ్ మాటలకి కరిగిపోయి మారిపోయావోనని టెన్షన్ పడ్డానని చెబుతుంది రుద్రాణి. ఉదయాన్నే శృతిపై మండిపడ్డ రాజ్.. కొటేషన్ త్వరగా పంపించాలని ఆర్డర్ వేస్తాడు. ఇంతలో కావ్య వచ్చి మీరు నాకు రాసిస్తానన్న ప్రేమలేఖ ఇప్పుడే కావాలని చెబుతుంది. దాంతో రాజ్ బయటికి వెళ్లగా అప్పటికే ప్రకాశం, సుభాష్‌లు కూడా ప్రేమలేఖలు రాస్తుంటారు. నీ పెళ్లాం పెట్టిన ఫిటింగ్ వల్ల మాకు ఇన్ని కష్టాలు వచ్చాయని మండిపడతాడు సుభాష్. ముగ్గురూ కలిసి కిందా మీద పడి ప్రేమలేఖను పూర్తి చేస్తారు. అది చదివిన కావ్య, అపర్ణ, ధాన్యంలు తమ భర్తలపై మండిపడతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup November 10th to November 15th episode Story

Photo Courtesy: JioHotstar

నవంబర్ 14వ తేదీ 878వ ఎపిసోడ్‌లో..
ప్రకాశం రాసిన ప్రేమలేఖలో లత అనే అమ్మాయి పేరు ఉండటంతో ఆమె ఎవరు? అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. చీపురుకట్టతో చితకబాదుతుంది. తను నా చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్పడంతో ఆమెతో ఫోన్ చేయిస్తేనే నమ్ముతానని అంటుంది ధాన్యం. అది చూసి కళ్యాణ్ - అప్పూ నవ్వుకుంటారు. ఉదయాన్నే రాహుల్ ఎక్కడికో బయల్దేరడంతో ఎక్కడికి అని అడుగుతుంది రుద్రాణి. ఆ స్వప్నని, ఇంట్లో వాళ్లని నేను మంచివాడినని నమ్మించాలని చెబుతాడు రాహుల్. అందుకోసం బయట చిన్న ఉద్యోగం వెతుక్కున్నానని అంటాడు. నువ్వు ఇలాగే చేస్తే నీకు సపోర్ట్‌గా నేను ఉన్నానని చెబుతుంది రుద్రాణి. రాహుల్‌ను అంత గుడ్డిగా నమ్మొద్దని హితవు పలుకుతుంది ఇందిర. నా బకెట్ లిస్ట్ ప్రకారం మీరు నాకు చీర కట్టాలని కావ్య చెప్పగా... రాజ్ తన భార్యకు చీర కడతాడు. ఇద్దరూ కలిసి కారులో రెస్టారెంట్‌కి వెళ్తుండగా నా కోరిక ఇంకోకటి మీరు తీర్చాలని .. మీరు రౌడీలో ఫైట్ చేయాలని అంటుంది. ఇంతలో భార్యను క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకుని వస్తాడు రాజ్.

నవంబర్ 15వ తేదీ 879వ ఎపిసోడ్‌లో..
కావ్యని క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకుని వస్తాడు రాజ్.. తనకు కావాల్సిన ఐటెమ్స్ ఆర్డర్ చేస్తుండగా బేరర్‌గా రాహుల్ కనిపించడంతో కావ్య, రాజ్ షాక్ అవుతారు. నువ్వు ఎలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తివి, ఇలాంటి పనులు చేసి ఇంటి పరువు బజారున పడేస్తావా? అని మండిపడతారు. నేను మారానంటే నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు, నాకు ఉద్యోగం ఎవరిస్తారు? అందుకే నాకు దొరికిన చిన్న ఉద్యోగంలో చేరానని చెబుతాడు రాహుల్. ఇంతలో కావ్యని రౌడీలు ఏడిపిస్తుండటంతో వాళ్లతో ఫైట్ చేసి భార్య కోరికను తీరుస్తాడు రాజ్. ఇద్దరూ కారులో వెళ్తూ రాహుల్‌కి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతుంది కావ్య. తను సంపాదించిన డబ్బుతో చీర కొని రాహుల్ ఇవ్వడంతో స్వప్న సంతోషిస్తుంది. స్వప్న పూర్తిగా తన ట్రాప్‌లో పడటంతో రాహుల్ మరో ప్లాన్ వేస్తాడు. ఉదయాన్నే రాహుల్ తీసుకొచ్చిన తక్కువ రకం చీర కట్టుకుని స్వప్న రావడంతో అంతా షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X