Brahmamudi Weekly Roundup : ఆస్తి కోసం ధాన్యలక్ష్మీ గొడవ.. రాజ్ - కావ్యల మధ్య వార్, అనామిక ప్లాన్ ఫెయిల్
కళ్యాణ్ ఆటో నడుపుకుంటూ పేదరికం అనుభవిస్తుండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన ధాన్యలక్ష్మీ.. ఆస్తి పంపకాలు చేయాలని గొడవ చేస్తుంది. పనిలో పనిగా తనకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వమని రుద్రాణి అడిగేసరికి అంతా చీవాట్లు పెడతాడు. దీంతో సీతారామయ్య తనకు కొంచెం టైం ఇవ్వమని అడుగుతాడు. దుగ్గిరాల కుటుంబంలో గొడవల గురించి తెలుసుకున్న అనామిక - సామంత్‌లు సంతోషిస్తారు. కావ్యని జగదీష్ చంద్ర ప్రసాద్ అనే బిజినెస్‌మెన్ కలిసి తమ గ్రామంలో ఆలయానికి కావాల్సిన విగ్రహాల తయారీ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆఫీసులో ఫైల్ తీసుకుని ఇంటికొచ్చేసిన రాజ్‌పై సీతారామయ్యకి కంప్లయంట్ చేస్తుంది కావ్య.
జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ ఎవరు తీసుకొస్తే వారిని సీఈవోని చేస్తానని చెబుతాడు సీతారామయ్య. ఈ పందెంలో రాజ్ ఓడిపోతే కావ్యని భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకురావాలని అంటాడు. కావ్య ఓడిపోతే శాశ్వతంగా కంపెనీకి దూరం కావాలని చెబుతాడు రాజ్. జగదీష్ చంద్ర ప్రసాద్‌ని అనామిక కలిసి రాజ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వొద్దని చెబుతుంది. నిలదీయడానికి ఆఫీసుకొచ్చిన జగదీష్ చంద్ర ప్రసాద్‌ని నమ్మించేలా కావ్య నడుముని టచ్ చేస్తాడు రాజ్. ఆఫీసులో జరిగిన విషయాన్ని సీతారామయ్యకి చెబుతాడు జగదీష్ చంద్ర ప్రసాద్. మూడేళ్లు తన దగ్గరే పనిచేస్తానని అగ్రిమెంట్ రాసివ్వాలని కళ్యాణ్‌కు చెబుతాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి అప్పూతో తనకు అసిస్టెంట్‌గా ఛాన్స్ వచ్చిందని అప్పూకి చెబుతాడు కళ్యాణ్.

నవంబర్ 11వ తేదీ 564వ ఎపిసోడ్‌లో అప్పూని ధాన్యలక్ష్మీ అవమానించడంతో జీవితంలో దుగ్గిరాల వారి ఇంటికి రానని చెప్పి వెళ్లిపోతాడు కళ్యాణ్. యువరాజు లాగా బతకాల్సిన నా బిడ్డ పేదరికం అనుభవించకూడదని , ఆస్తిని ముక్కలు చేయమని గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మీ. ఈ ఇంటి ఆడబిడ్డగా నాకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వమని రుద్రాణి అడగటంతో ఇందిర, ప్రకాశంలు చీవాట్లు పెడతారు. ఆస్తిని పంచకుంటే తాను కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతానని ధాన్యలక్ష్మీ బెదిరించడంతో సీతారామయ్య తనకు కొంచెం టైం ఇవ్వమంటాడు. డాక్యుమెంటరీ గ్రాండ్ సక్సెస్ అయి దుగ్గిరాల కుటుంబంలో గొడవలు జరగడంతో అది చూసి సామంత్- అనామికలు ఎంజాయ్ చేస్తుంటారు. అత్తారింట్లో వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కావ్య బాధపడుతుంది. ఇకనైనా ఆటో నడపటం మానేసి రైటర్‌గా ట్రై చేయమని కళ్యాణ్‌కి సలహా ఇస్తుంది అప్పూ. ఇక్కడి దాకా వచ్చాక మధ్యలో వదిలేయ కూడదని ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొట్టి ఆస్తిని కొట్టేయాలని చూస్తుంది రుద్రాణి.
నవంబర్ 12వ తేదీ 565వ ఎపిసోడ్‌లో ఆస్తి ముక్కలు కాకుండా ముసలివాళ్లను కావ్య మేనేజ్ చేసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండమని ధాన్యలక్ష్మీని హెచ్చరిస్తుంది రుద్రాణి. ఉదయాన్నే ఆస్తిని పంచుతారా? లేదా? అని అందరి ముందు సీతారామయ్యని ధాన్యలక్ష్మీ నిలదీయడంతో ఇందిర రగిలిపోతుంది. మీ మామయ్య గారి మనసు నొచ్చుకునేలా చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది. దీనంతటికీ కారణం నువ్వేనని, ముందు నీ పెళ్లాన్ని నువ్వు ఇంటికి తీసుకురమ్మని రాజ్‌కి చీవాట్లు పెడుతుంది ఇందిర. ఆఫీసులో ఓ ముఖ్యమైన ఫైలుపై సంతకం చేయకుండా వీడియో గేమ్స్ ఆడుకుంటున్న రాజ్‌పై కావ్య మండిపడుతుంది . ఇంట్లో గొడవలతో ఒంటరిగా బాధపడుతున్న సీతారామయ్యని నానా మాటలు అంటాడు రాజ్. తాను ఎంతో ప్లాన్ చేసి ధాన్యలక్ష్మీ ద్వారా ఆస్తిని కొట్టేయాలని అనుకున్నానని , కానీ ఈ ముసలోడు ఆస్తి పంచేలా కనిపించడం లేదని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి నేనుండగా ఆస్తి ముక్కలు కానివ్వనని చెబుతుంది.

నవంబర్ 13వ తేదీ 566వ ఎపిసోడ్‌లో ఆఫీసులో జగదీష్ చంద్ర ప్రసాద్ అనే ఓ బిజినెస్‌మెన్ కావ్యను కలుస్తాడు. తమ గ్రామంలో పురాతన ఆలయానికి కావాల్సిన విగ్రహం, ఆభరణాలను మీ కంపెనీయే చేయాలని చెబుతాడు. దీనికి చాలా సంతోషించిన కావ్య తప్పకుండా మంచి డిజైన్లు చేసి చూపిస్తానని అంటుంది. అయితే ముందుగా కొన్ని శాంపిల్స్ తనకు చూపించాలని జగదీష్ చంద్ర ప్రసాద్ చెబుతాడు. ఫైలును రాజ్ తీసుకెళ్లిన విషయం తెలుసుకున్న కావ్య నేరుగా ఇంటికెళ్లి సీతారామయ్యని కలిసి భర్తపై కంప్లయింట్ చేస్తుంది. కావ్య కింద పనిచేయడం తనకు ఇష్టం లేదని రాజ్ తేల్చి చెబుతాడు. అయితే జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ మన కంపెనీకి ఎవరైతే తీసుకొస్తారే వారినే సీఈవోగా చేస్తానని సీతారామయ్య ఓ పందెం పెడతాడు. నువ్వు ఓడిపోతే కావ్యని భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకురావాలని చెబుతాడు. దీనికి ఓకే చెప్పిన రాజ్.. కావ్య ఓడిపోతే మాత్రం శాశ్వతంగా కంపెనీ వైపు చూడకూడదని కండీషన్ పెడతాడు. పెద్దవాళ్లంతా బలవంతం చేయడంతో ఈ పందానికి ఒప్పుకుంటుంది కావ్య.
నవంబర్ 14వ తేదీ 567వ ఎపిసోడ్‌లో రాజ్ - కావ్యల మధ్య తాతయ్య పందెం పెట్టాడని కళ్యాణ్‌కి చెబుతుంది అప్పూ. ఖచ్చితంగా మా వదినే గెలిచి, ఇంటికి తిరిగి వెళ్తుందని కళ్యాణ్ ధీమాగా చెబుతాడు. ఈ పందెం గురించి తెలుసుకున్న కనకం.. త్వరలో కూతురు అత్తారింటికి వెళ్లిపోతుందని సంబరపడుతుంది. మరోవైపు ధాన్యలక్ష్మీలో వేడి చల్లారకుండా ఆమెను రెచ్చగొడుతుంది రుద్రాణి. కావ్య - రాజ్‌ల పందెం గురించి అనామికకు చేరవేస్తుంది. ఆ జగదీష్ చంద్ర ప్రసాద్‌ని కలిసి కాంట్రాక్ట్ రాజ్ గ్రూప్‌కి రాకుండా చేస్తే అసలు పందెం ఉండదని చెబుతుంది. ఆఫీస్‌కి వెళ్తున్న రాజ్‌కి ఇంటి సభ్యులు కనీసం ఆల్ ది బెస్ట్ చెప్పకపోగా.. అంతా కావ్య గెలవాలని కోరుకుంటారు. ఆఫీసుకి డ్రాయింగ్ బోర్డ్స్, పేపర్స్‌తో వస్తున్న రాజ్‌ని చూసి శృతి షాక్ అవుతుంది.
నవంబర్ 15వ తేదీ 568వ ఎపిసోడ్‌లో సీఈవో రూమ్‌లోకి వెళ్తున్న కావ్యని రాజ్ అడ్డుకుంటాడు. తాతయ్య పెట్టిన పందెంలో గెలిచిన వారే ఈ ఛాంబర్‌లోకి వెళ్లాలని చెప్పగా.. పోటీ జరిగే వరకు నేనే సీఈవోగా ఉంటానని అంటుంది కావ్య. తన కోసం వర్క్ చేయడానికి స్టాఫ్ ముందుకు రాకపోవడంతో లక్కీ డ్రా ద్వారా ఉద్యోగులను లాగేస్తాడు రాజ్. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు, ఇల్లు కట్టిస్తానని చెప్పి వారిలో జోష్ తీసుకొస్తాడు. జగదీష్ చంద్ర ప్రసాద్‌ని కలిసిన అనామిక.. దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని వారికి కాంట్రాక్ట్ ఇస్తే మంచి డిజైన్లు ఇవ్వలేరని చెప్పి ఆయనను డైలామాలో పడేస్తుంది. మూడేళ్లు అగ్రిమెంట్ రాసిస్తేనే కళ్యాణ్‌ని అసిస్టెంట్‌గా పెట్టుకోవడానికి రైటర్ లక్ష్మీకాంత్ అంగీకరిస్తాడు. దీనికి కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా అగ్రిమెంట్ మీద సంతకం చేసేస్తాడు. ఇంట్లో అంతా భోజనం చేస్తుండగా ధాన్యలక్ష్మీ కనిపించకపోవడంతో దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు.
నవంబర్ 16వ తేదీ 569వ ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీ భోజనానికి రాకపోవడంతో ఆమెను భోజనానికి పిలవాలని సీతారామయ్య చెబుతాడు. కానీ ఎవ్వరూ ఆయన మాటలని పట్టించుకోరు. ఆఫీసులో మీటింగ్ హాల్ కోసం కొట్టుకుంటున్న రాజ్ - కావ్యలని చూసి జగదీష్ చంద్ర ప్రసాద్ కోప్పడతాడు. దీంతో ఆయనను నమ్మించడానికి కావ్య నడుము గిల్లి, ఆమెను బాగా చూసుకుంటున్నట్లుగా నటిస్తాడు రాజ్. ఆయన వెళ్లిపోగానే భర్తపై మండిపడుతుంది కావ్య. తర్వాత ఆఫీసులో జరిగిన విషయాన్ని సీతారామయ్యకు చెబుతాడు జగదీష్ చంద్ర ప్రసాద్. నా మనవడు - మనవరాలు ఒక్కటైపోతే కంపెనీని టచ్ చేయడం ఎవరి వల్ల కాదని చెబుతాడు సీతారామయ్య. తనకు లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చిందని అప్పూకి కళ్యాణ్ చెబుతాడు. ఇంత తేలిగ్గా అతను ఛాన్స్ ఇవ్వడని నువ్వు అగ్రిమెంట్ ఏమైనా చేశావా అని ప్రశ్నిస్తుంది అప్పూ. ఆ మాటలతో కళ్యాణ్ షాక్ అవుతాడు. పందెంలో గెలవాలనే ఉద్దేశంతో రాత్రంతా కూర్చొని డిజైన్లు వేస్తూ ఉంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











