Brahmamudi weekly roundup: రాహుల్ చేతికి కొత్త కంపెనీ... మళ్లీ డ్యూటీలోకి అప్పూ, చిక్కుల్లో కావ్య
Photo Courtesy: JioHotstar
రాజ ఫోన్‌లో ఉన్న ఆర్ కంపెనీ రహస్యాన్ని కనుగొనడానికి రాజ్ ఫోన్ కొట్టేస్తుంది స్వప్న. అందులో ఆర్ కంపెనీకి సంబంధించిన వివరాలు ఉండటంతో స్వప్న పెద్ద గొడవ చేస్తుంది. ఆర్ అంటే రాజ్ కాదని, రాహుల్ అని ఆ కంపెనీ వాడి కోసమే పెట్టానని రాజ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. వాడికి బాధ్యత తెలియాలని ఇలా సొంత కంపెనీని పెట్టించానని చెబుతాడు రాజ్. దుగ్గరాల కుటుంబం ఎప్పటికీ ఉమ్మడిగానే ఉండాలని అనుకున్నానని నువ్వు చేసిన పని వల్ల కుటుంబం ముక్కలైతే తట్టుకోలేనని రాజ్ దగ్గర బాధపడతాడు సీతారామయ్య. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అప్పూకి ఓ పాప మిస్సింగ్ కేసు తెలియడంతో ఆ తల్లికి న్యాయం చేయడానికి తిరిగి యూనిఫాం వేసుకోవాలని అనుకుంటుంది. మళ్లీ డ్యూటీలో జాయిన్ అయితే ఊరుకోనని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇవ్వడంతో కళ్యాణ్, రాజ్ సాయం చేయడంతో తిరిగి బాధ్యతలు తీసుకుంటుంది. రాజ్ కంపెనీకి చెందిన సతీష్ అనే మేనేజర్ రాహుల్ కంపెనీలో చేరినట్లు తెలియడంతో కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు.
బ్రహ్మముడి నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు .. 886వ ఎపిసోడ్ నుంచి 891 వరకు ఏం జరిగిందంటే?
నవంబర్ 24వ తేదీ 886వ ఎపిసోడ్‌లో..
సుభాష్- అపర్ణల పెళ్లి రోజు కావడంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం సెలబ్రేట్ చేస్తుంది. అందరూ వారిద్దరికీ గిఫ్ట్‌లు ఇవ్వగా.. కావ్య మాత్రం అపర్ణ చిన్నప్పటి ఫోటోలు ఉన్న ఆల్బమ్‌ను ఇవ్వడంతో ఆమె ఎమోషనల్ అవుతుంది. సుభాష్‌కు రాజ్.. వాళ్ల తాతయ్య ఇచ్చిన తొలి వాచ్‌ని గిఫ్ట్‌గా ఇస్తాడు. కావ్య గదిలోకి దొంగతనంగా వెళ్లిన స్వప్న.... రాజ్ పర్సనల్ లాప్‌టాప్‌ను కొట్టేసి రాహుల్ చేతిలో పెడుతుంది స్వప్న. దాని పాస్‌వర్డ్‌గా కావ్య పుట్టినరోజే ఉంటుందని చెబుతుంది. అయితే లాప్‌టాప్ ఓపెన్ చేసిన రాహుల్‌కి అందులో ఆర్ కంపెనీకి సంబంధించిన వివరాలు లేకపోవడంతో భార్యభర్తలిద్దరూ షాక్ అవుతాడు. ఖచ్చితంగా ఆ కంపెనీ వివరాలన్నీ రాజ్ ఫోన్‌లోనే ఉంటాయని భావించిన రాహుల్, స్వప్నలు .. ఆ ఫోన్ కొట్టేయాలని ప్లాన్ వేస్తారు. రాజ్ దగ్గరికి వెళ్లి మాయమాటలు చెప్పి ఫోన్ తీసుకొస్తుంది స్వప్న.
నవంబర్ 25వ తేదీ 887వ ఎపిసోడ్‌లో..
స్వప్న తీసుకొచ్చిన రాజ్ ఫోన్‌లో ఆర్ కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని రాహుల్ చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. వెంటనే కిందకి వెళ్లి పెద్ద గొడవ చేసి పార్టీ మూడ్‌ను డిస్ట్రబ్ చేస్తుంది. ఏం జరిగిందని రాజ్ అడగ్గా.. ఫోన్ చూపించి ఆర్ కంపెనీని సీక్రెట్‌గా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? ఎవరి కోసం స్టార్ట్ చేస్తున్నావని నిలదీస్తుంది స్వప్న. కోట్ల రూపాయల డబ్బు కేజీల కొద్దీ బంగారాన్ని సీక్రెట్‌గా ఎందుకు తరలిస్తున్నారని అడుగుతుంది. స్వప్న మాటలతో సీతారామయ్యతో పాటు ఇంట్లో వాళ్లంతా కూడా రాజ్‌ను నిలదీయడంతో కావ్య సీరియస్ అవుతుంది. ఆర్ అంటే రాజ్ కాదని, రాహుల్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రాహుల్ తన కాళ్ల మీద తను నిలబడాలని, ఎవరి కిందా బతకకూడదని ఇదంతా చేశానని చెబుతాడు. దాంతో రాహుల్, స్వప్నలు బాధపడతారు. వెంటనే భార్యాభర్తలిద్దరూ రాజ్, కావ్యలకు క్షమాపణలు చెబుతారు. ఇప్పటికైనా నా కొడుకు, కోడలంటే ఏంటో తెలుసుకోమని అపర్ణ మండిపడుతుంది.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 26వ తేదీ 888వ ఎపిసోడ్‌లో..
ఆర్ కంపెనీకి తనను ఛైర్మన్‌ను చేయడంతో రాజ్, కావ్యలకు రాహుల్ థ్యాంక్స్ చెబుతాడు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అంటాడు. అయితే రాహుల్‌తో కంపెనీని పెట్టించడంతో రాజ్, కావ్యలు తీసుకున్న నిర్ణయాన్ని సీతారామయ్య తప్పుబడతాడు. దుగ్గిరాల కుటుంబం ఎప్పటికీ ఉమ్మడిగా ఉండాలన్నది నా కల.. కానీ మీరు రాహుల్‌ను బయటికి పంపారని మండిపడతాడు పెద్దాయన. ఈ నిర్ణయం వల్ల ఏదైనా సమస్య వచ్చి, కుటుంబం ముక్కలైతే నేను తట్టుకోలేనని చెబుతాడు సీతారామయ్య. ధాన్యలక్ష్మీ నగలు సర్దుకుంటుండగా రుద్రాణి వచ్చి కేజీ బంగారం ఎంత అని అడుగుతుంది. రాహుల్ ఓ కంపెనీకి ఛైర్మన్ అయ్యాడు కాబట్టి.. నేను కూడా ఇకపై మీతో సమానం అయ్యానని అంటుంది రుద్రాణి. ఈ ఆస్తికి ఎప్పటికైనా రాజ్, కళ్యాణ్‌లే వారసులని.. నువ్వు, నీ కొడుకు బయటివాళ్లేనని ధాన్యం అనడంతో రుద్రాణి రగిలిపోతుంది. వెంటనే వెళ్లి జరిగినదంతా రాహుల్‌కి చెబుతుంది రుద్రాణి. రాజ్ నా చేత పెట్టించిన కంపెనీ సాయంతో స్వరాజ్ కంపెనీని ముక్కలు చేస్తానని, ఈ కుటుంబాన్ని నడివీధిలో నిలబెడతానని చెబుతాడు రాహుల్.
నవంబర్ 27వ తేదీ 889వ ఎపిసోడ్‌లో..
ఐస్‌క్రీమ్ తినడానికి కళ్యాణ్‌ను ఊరంతా తిప్పుతుంది అప్పూ. బావగారు అయితే మా అక్క బకెట్ లిస్ట్ పేరుతో ఎన్ని కోరికలు అడిగితే అన్ని కోరికలు తీర్చారని ఆయన గ్రేట్ అని పొగుడుతుంది దాంతో భార్యకు ఐస్‌క్రీమ్ ఇప్పిస్తాడు కళ్యాణ్. ఐస్‌క్రీమ్ తింటుండగా అప్పూకి పోలీస్ స్టేషన్ కనిపించడంతో లోపలికి వెళ్లి చాలా రోజులైందని ఒకసారి అందరినీ పలకరించి వస్తానని కళ్యాణ్‌కి చెప్పి వెళ్తుంది. ఆమె లోపలికి వెళ్తుండగా ఓ తల్లి తన బిడ్డ కనిపించడం లేదని, ఏడాదిగా నన్ను తిప్పుతున్నారని కానిస్టేబుల్‌తో గొడవపడుతూ కనిపిస్తుంది. దాంతో ఏం జరిగిందో తెలుసుకుని తాను సీఐతో పర్సనల్‌గా మాట్లాడతానని చెబుతుంది. ఆవిడ బిడ్డ చనిపోయిందని, ఎంత చెబుతున్నా వినిపించుకోవడం లేదని అప్పూకి జరిగింది చెబుతాడు సీఐ. మళ్లీ కేసును రీ ఓపెన్ చేద్దామని అప్పూ అనగా.. అంత జాలి, దయ ఉంటే నువ్వే లీవ్ క్యాన్సిల్ చేసుకుని డ్యూటీలో తిరిగి జాయిన్ అవ్వమని సీఐ సీరియస్ అవుతాడు. అప్పూ నిద్రపోతుండగా స్టేషన్‌లో కనిపించిన ఆమె బిడ్డ చనిపోయినట్లు, ఆ తల్లి ఏడుస్తున్నట్లు కల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 28వ తేదీ 890వ ఎపిసోడ్‌లో..
ఇకపై నువ్వు నీ కంపెనీ వ్యవహారాలు చూసుకుని డెవలప్ చేయమని రాహుల్‌కు చెబుతారు ప్రకాశం, సుభాష్. అలాగే స్వరాజ కంపెనీ బాధ్యతల్ని నువ్వే చూసుకోవాలని రాజ్‌కు చెబుతాడు సుభాష్. నాతో పాటు కళావతి కూడా ఆఫీస్‌కి వస్తుందని రాజ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇదే సమయంలో నేను రైటింగ్ మొదలుపెడతాను, అప్పూ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతుందని చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ సీరియస్ అవుతుంది డెలివరీ అయ్యే వరకు ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చేస్తుంది. తమ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో అప్పూ, కళ్యాణ్‌లు బాధపడతారు. వారి మాటల్ని విన్న రాజ్, కావ్యలు అక్కడికి వస్తారు. ఆ పాపకి, ఆ తల్లికి న్యాయం చేయమని మీకు అండగా ఉంటామని రాజ్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. అప్పూ పోలీస్ స్టేషన్‌కి వెళితే చిన్నత్తయ్య ఊరుకోదని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఉదయాన్నే అప్పూ, కళ్యాణ్‌లు గుడికి వెళ్తున్నామని అబద్ధం చెబుతారు. అయితే చేతిలో బ్యాగ్ కనిపించడంతో ధాన్యానికి డౌట్ వస్తుంది.
నవంబర్ 30వ తేదీ 891వ ఎపిసోడ్‌లో..
కళ్యాణ్ బ్యాగ్ ఎత్తుగా ఉంది? అందులో ఏమున్నాయో చూపించమని ధాన్యం చెప్పడంతో కళ్యాణ్, అప్పలకి చెమటలు పోస్తాయి. ఇందులో నా రైటింగ్ పేపర్స్ ఉన్నాయి దేవుడి దగ్గర పెడితే పాట బాగా వస్తుందని తీసుకెళ్తున్నానని అంటాడు. పేపర్స్ అంత ఎత్తుగా ఉండవని ధాన్యలక్ష్మీ అడగ్గా.. అందులో దేవుడికి పెట్టడానికి పట్టుబట్టలు ఉన్నాయని ప్రకాశం అనడంతో అవును అంటారు కళ్యాణ్, అప్పూ. రాజ్, కావ్యలు ఆఫీసుకు రావడంతో స్టాఫ్ అంతా సంతోషిస్తారు. అయితే మేనేజర్ సతీష్ కనిపించకపోవడంతో అతను ఏమయ్యాడని అడుగుతాడని రాజ్. మేనేజర్ గారు... ఆర్ కంపెనీలో చేరాడని శృతి చెప్పడంతో రాజ్, కావ్యలు ఉలిక్కిపడతారు. తిరిగి డ్యూటీలో చేరిన అప్పూ.. నేరుగా రేణుక ఇంటికి వెళ్లి పాప గురించి ఎంక్వయిరీ చేస్తుంది. మార్కెట్‌లో రాజ్ కంపెనీ డిజైన్లకు డిమాండ్ తగ్గుతుండటంతో దానిని మార్చాలని అనుకుంటారు రాజ్, కావ్య. తన దగ్గర పనిలో చేరిన మేనేజర్‌ని స్వరాజ్ కంపెనీ క్లయింట్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేయమని చెబుతాడు రాహుల్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications










