Brahmamudi Weekly Roundup : కావ్యకి షాకిచ్చిన రాజ్.. దుగ్గిరాల ఫ్యామిలీలోకి కొత్త అమ్మాయి

కావ్య ఇంటికి వచ్చిన అపర్ణ కోసం రాజ్ వస్తాడు. కావ్యని తీసుకెళ్తే ఆమెతో పాటు నేను కూడా వచ్చేస్తానని అంటుంది అపర్ణ. అపర్ణ లేకపోవడంతో పెద్దవాళ్లను పట్టించుకునేవాళ్లు ఉండరు. ఇదే సమయంలో పనిమనిషిని రుద్రాణి గెంటేయడంతో ఇందిర వంట చేస్తూ చేయి కాల్చుకుంటుంది. ఇంట్లో పరిస్ధితులు దిగజారిపోతుండటంతో కావ్యకి రాజ్ ఫోన్ చేసి మా అమ్మను పంపించేయమని అడుగుతాడు. సీతారామయ్య - ఇందిరలు భోజనానికి ఇబ్బంది పడుతుండటంతో కావ్య స్వయంగా క్యారియర్ తీసుకెళ్తుంది. భార్య తెచ్చిన ఫుడ్‌ తినకుండా రాజ్ బిర్యానీ ఆర్డర్ చేసి అందరికీ పెడతాడు. కారం దెబ్బకి ఎవ్వరూ బిర్యానీ తినలేక కావ్య భోజనం తింటారు. కళ్యాణ్ స్వశక్తితో సంపాదించిన చెక్‌ని తీసుకెళ్లి అనామిక ముఖం మీద కొడుతుంది అప్పూ. రాత్రి అంతా పడుకున్నాకా దొంగచాటుగా వచ్చి భోజనం చేస్తుండగా పెద్దవాళ్లకి దొరికిపోతాడు రాజ్. ఇంట్లో వంట మనిషిగా స్టెల్లా అనే చెఫ్‌ను అపాయింట్ చేస్తాడు రాజ్. ఆమె కారు దిగి స్టైల్‌గా ఇంట్లోకి వస్తుంది.

నవంబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు.. 576 ఎపిసోడ్ నుంచి 581 వరకు ఏం జరిగిందంటే?

నవంబర్ 25వ తేదీ 576వ ఎపిసోడ్‌లో ఇంట్లో వాళ్లంతా ఒత్తిడి చేయడంతో అపర్ణ కోసం కనకం ఇంటికి బయల్దేరతాడు రాజ్. కావ్య వస్తే ఆస్తి పంపకాలను ఆపేస్తుందని భయపడ్డ రుద్రాణి - రాహుల్‌లు కొత్త స్కెచ్ వేస్తారు. రాజ్ వెళ్లేసరికి కావ్య ఎదురొస్తుంది. ప్లాన్ చేసి మా అమ్మని మీ ఇంటికి రప్పించుకుంటావా అంటూ నానా మాటలు అంటాడు. నేనేమీ మీ అమ్మని రమ్మని చెప్పలేదని.. ఆవిడకి ఇష్టమైతే తీసుకెళ్లమని కౌంటర్ ఇస్తుంది కళావతి. రాజ్ లోపలికి వెళ్లేసరికి అపర్ణ కూరగాయాలు కోస్తూ .. కనకం కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ కనిపిస్తారు. మహారాణి లాంటి తల్లి పరిస్థితి చూసిన రాజ్ ఎమోషనల్ అవుతాడు. మన ఇంటికి వెళ్లిపోదాం రమ్మని బతిమలాడగా... కావ్యని తీసుకొస్తేనే నేను ఇంటికి వస్తానని తేల్చి చెబుతుంది అపర్ణ. కావ్య, అపర్ణల కోసం వెయిట్ చేస్తున్న దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్ ఒక్కడే ఇంటికి రావడంతో షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup November 25th to November 30th episode Story

నవంబర్ 26వ తేదీ 577వ ఎపిసోడ్‌లో అపర్ణ వెళ్లిపోవడంతో ఇంటి బాధ్యతలు ఎవరు చూసుకుంటారని దుగ్గిరాల కుటుంబ సభ్యులు చర్చించుకుంటారు. ఆస్తి పంచకపోవడంతో ఒంటరిగా బాధపడుతున్న ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి ఆమెను మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి. రోడ్డుపై పానీపూరీ తింటున్న కళ్యాణ్ - అప్పూలను చూసిన అనామిక వారిద్దరినీ నానా మాటలు అంటుంది. మరోవైపు ఇల్లు వదిలి వచ్చేయడం కరెక్ట్ కాదని అత్తగారికి నచ్చచెబుతుంది కావ్య. పనిమనిషి శాంతను రెచ్చగొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తుంది రుద్రాణి. అర్ధరాత్రి రాజ్ గదిలోకి వచ్చి పడుకుంటాడు సుభాష్. ఆస్తి పంపకాల గురించి తనకు సపోర్ట్ చేయకపోవడంతో ప్రకాష్‌ని బయటికి గెంటేస్తుంది ధాన్యలక్ష్మీ.

నవంబర్ 27వ తేదీ 578వ ఎపిసోడ్‌లో సుభాష్, ప్రకాష్‌ గురక దెబ్బకి రాజ్‌కి నిద్రపట్టక కింద నేలపై పడుకుంటాడు. కావ్య- అపర్ణ మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందిర ఫోన్ చేసి మీ ఇద్దరూ లేకపోవడంతో మమ్మల్ని పట్టించుకునేవారు లేరని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉదయాన్నే సీతారామయ్యకి పాలు ఎవ్వరూ ఇవ్వకపోవడంతో ఇందిర వంట గదిలోకి వెళ్లి చూస్తుంది. ధాన్యలక్ష్మీ పాలు కలుపుకుంటూ ఉండటంతో వాటిని తీసుకోబోతుండగా అత్తగారిని పక్కకు తోసేస్తుంది ధాన్యం. రాజ్ వచ్చి నానమ్మతో అలాగేనా మాట్లాడేది అని పిన్నిపై మండిపడతాడు. పనిమనిషి శాంత ఎక్కడ అని అడగ్గా.. మా అత్తయ్య ధాటికి భయపడి ఆమె వెళ్లిపోయిందని చెబుతుంది స్వప్న. రైటర్ లక్ష్మీకాంత్ ఇచ్చిన చెక్‌ని అప్పూకి కళ్యాణ్‌ చూపించడంతో ఆమె చాలా సంతోషిస్తుంది.

నవంబర్ 28వ తేదీ 579వ ఎపిసోడ్‌లో ఇంట్లో పట్టించుకునే దిక్కు లేకపోవడంతో ఇందిర తానే వంట చేసుకుంటుంది. ఇంతలో ఆమె చేయి కాలడంతో రాజ్ వచ్చి మందు రాసి రుద్రాణి, ఇందిరలపై మండిపడతాడు . ఇంట్లో పరిస్ధితులు రోజు రోజుకు దిగజారడం చూసి కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్.. మా అమ్మని ఇంటికి పంపించేయమని అంటాడు. ఇంతలో అపర్ణ ఫోన్ అందుకుని ఏ అధికారంతో చెబుతున్నావని కొడుక్కి క్లాస్ పీకుతుంది. కళ్యాణ్‌ని తీసుకుని అనామిక దగ్గరికి వచ్చిన అప్పూ.. లక్ష్మీకాంత్ ఇచ్చిన చెక్కుని చూపించి మాకు మంచి రోజులు వచ్చాయని అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీలో ఆకలి కేకల గురించి తెలుసుకున్న కావ్య బాధపడుతుంది. ఇంట్లో వాళ్లందరికీ భోజనం తీసుకుని వచ్చిన కావ్యని చూసిన రాజ్ అవమానించాలని చూస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup November 25th to November 30th episode Story

నవంబర్ 29వ తేదీ 580వ ఎపిసోడ్‌లో కావ్య తాను తీసుకొచ్చిన భోజనాన్ని ఇందిర - సీతారామయ్యలకి వడ్డిస్తుంది. రాజ్ అందరినీ భోజనానికి పిలిచి తాను బిర్యానీ ఆర్డర్ చేశానని చెప్పి అందరికీ పెడతాడు. ముద్ద నోట్లో పెట్టుకోగానే కారం దెబ్బకు అంతా అల్లాడిపోతారు. స్వప్న, రాహుల్, సుభాష్, ప్రకాష్‌లు తమ వల్ల కావడం లేదని చెప్పడంతో వాళ్లకి కావ్య తన భోజనం పెడుతుంది. కారం దెబ్బకి రాజ్, రుద్రాణిలు వంటగదిలోకి పరుగులు తీస్తారు. భోజనం పెట్టి అందరినీ నీ వైపు తిప్పుకున్నది చాలని.. ఇంట్లో నుంచి వెళ్లిపోమని కావ్యతో చెబుతాడు రాజ్. నేను ఇప్పుడే కాదు రోజూ వస్తానని తేల్చిచెబుతుంది కళావతి. రాత్రికి కూడా ఇంట్లో వాళ్లకి భోజనం సిద్ధం చేసి కావ్య ఇంటికి వెళ్లిపోతుండగా రాజ్ ఆమెను పిలిచి డబ్బులు ఇస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు.

నవంబర్ 30వ తేదీ 581వ ఎపిసోడ్‌లో కళావతికి ఇక ఇంటికి రావాల్సిన పనిలేదని తాను స్టెల్లా అనే చెఫ్‌ని వంట మనిషిగా అపాయింట్ చేశానని చెబుతాడు. తనను నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అప్పూకి థ్యాంక్స్ చెబుతాడు కళ్యాణ్. కావ్య ఇంటికి తిరిగి వస్తే మన ఆటలు సాగవని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి తన చెల్లి మొండిఘటమని ఇంటికి వచ్చి తీరుతుందని చెబుతుంది. అందరూ పడుకున్నాక దొంగచాటుగా వచ్చి రాజ్ భోజనం చేస్తుండగా ఇందిర - సీతారామయ్యలు పట్టుకుంటారు. ఉదయాన్నే అంతా మాట్లాడుకుంటూ ఉండగా కారులో నుంచి చెఫ్ స్టెల్లా దిగుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X