Brahmamudi weekly roundup: కోయిలికి బుద్ది చెప్పిన రాజ్- కావ్య... హత్య కేసులో రాహుల్ అరెస్ట్

Photo Courtesy: JioHotstar

కోయిలి నుంచి రాహుల్‌ను కాపాడి స్వప్న జీవితం బాగు చేయాలని రాజ్ - కావ్యలు తాతయ్య బామ్మలుగా కోయిలి ఇంటికి వెళ్తారు. వీరిద్దరి టార్చర్ దెబ్బకి రాహుల్‌ మండిపడతాడు. వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి కావ్య - రాజ్‌లు నాకు అడ్డొస్తున్నారు, వీళ్లని ఇక్కడి నుంచి పంపేలా చేయమని అడుగుతాడు. దాంతో కంపెనీలోని ఇంపార్టెంట్ ఫైల్ డిలీట్ చేయిస్తుంది రుద్రాణి. క్లైంట్ మీటింగ్‌కి కావాల్సిన ఫైల్ కనిపించకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ, శృతి కంగారు పడి రాజ్‌- కావ్యలను వెంటనే వచ్చేయమని చెబుతారు. అయితే కావ్య తన దగ్గర మరో ఫైల్ ఉందని చెప్పి గండం గట్టెక్కిస్తుంది. గోల్డ్ బాబు కోసం ఇంట్లోనే పబ్ సెటప్ చేయించిన కోయిలి పీకలదాకా తాగుతుంది. ఆమె నిద్రలోకి జారుకున్నాక గోల్డ్ బాబు పక్కనే క్లోజ్‌గా పడుకుంటాడు.

ఉదయాన్నే వారిద్దరిని ఏకాంతంగా చూసిన రాహుల్ మండిపడతాడు. ఆమె నిజ స్వరూపం తెలిసిపోవడంతో చీ కొడతాడు. రాజ్, కావ్య, గోల్డ్ బాబులు ఎవరో తెలుసుకున్న రంజిత్.. లోపలికి వెళ్లి చూడగా కోయిలిని రాహుల్‌ కొడతాడు. ఇదంతా రంజిత్ వీడియో తీస్తాడు. రాహుల్‌ చేసిన తప్పుని మన్నించి ఓ అవకాశం ఇస్తుంది స్వప్న. ఉదయాన్నే ఇంటికి పోలీసులు వచ్చి కోయిలిని చంపిన నేరంపై రాహుల్‌ను అరెస్ట్ చేస్తారు. రాహుల్‌ హత్య చేసిన వీడియో నా దగ్గర ఉందని ఇది కావాలంటే 2 కోట్లు ఇవ్వాలని రుద్రాణిని రంజిత్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup November 3rd to November 8th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు .. 868వ ఎపిసోడ్ నుంచి 873 వరకు ఏం జరిగిందంటే?

నవంబర్ 3వ తేదీ 868వ ఎపిసోడ్‌లో..
హోటల్‌ నుంచి తెప్పించిన వంటకాలను చూసిన రాజ్- కావ్యలు.. వడ్డించేందుకు ఇంట్లో పనివాళ్లు లేరా అని కోయిలి గాలి తీసేస్తారు. మరి మాకు ఇప్పుడు ఎవరు వడ్డిస్తారని కావ్య అడగ్గా.. నేను వడ్డిస్తానని చెబుతుంది కోయిలి. ఈ పూటకి ఓకే కానీ ఇకపై మాకు ఈ హోటల్ ఫుడ్ వద్దని, నువ్వే వండాలని చెప్పడంతో కోయిలి షాక్ అవుతుంది. నాకు వంట రాదని అనడంతో నీకు నేను నేర్పిస్తానని అంటుంది కావ్య. వద్దు వద్దు అంటూనే హోటల్ ఫుడ్ మొత్తం లాగించేశారని ... ఈ ముసలివాళ్లుని ఒక్క పూట మేపడానికే మనకి 30 వేలు ఖర్చయ్యిందని నాలుగు రోజులు ఇక్కడే ఉంటే అప్పుల పాలు అవుతామని కోయిలితో అంటాడు రంజిత్. ఇంకో పది లక్షలు అప్పు చేసైనా సరే వాళ్లని భరించాల్సిందే.. రాహుల్‌తో పెళ్లయ్యాక, వాడి ఆస్తితో పాటు ఈ ముసలొళ్ల ఆస్తి కూడా కొట్టేద్దామని అంటుంది కోయిలి. వారి మాటలను విన్న కావ్య- రాజ్‌లకు మొత్తం ప్లాన్ అర్ధమైపోతుంది. కోయిలిని పనిమనిషిగా మార్చేసి ఇంటి పని, వంట పని చేయిస్తుంది కావ్య. అది చూసిన రాహుల్ షాక్ అవుతాడు.

నవంబర్ 4వ తేదీ 869వ ఎపిసోడ్‌లో..
ఈ రోజు రాహుల్ కజిన్ గోల్డ్ బాబు వస్తున్నాడని వాడికి ఇల్లు, నువ్వు ఇలా ఉంటే అస్సలు నచ్చదని చెబుతాడు రాజ్. ఇంతలో రాజ్ ఫ్రెండ్ గోల్డ్ బాబు ఒంటి నిండా బంగారంతో వచ్చి... దుబాయ్‌లో 1000 కోట్లు సంపాదించానని, ఇకపై ఇండియాలోనే వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. నాకు మంచి పార్ట్‌నర్స్ కావాలని.. వాళ్ల కంపెనీలో 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పడంతో కోయిలి- రాజ్‌లలో ఆశ కలుగుతుంది. మా కంపెనీలో మీ పెట్టుబడులు పెట్టమని చెబుతుంది కోయిలి. ఆమెను గది చూపించమని చెప్పి గోల్డ్ బాబు.. సూట్ కేసులో బంగారం ఉన్నట్లు నమ్మిస్తాడు. కోయిలితో నా పెళ్లి జరగకుండా, నేను అనుకున్నది కాకుండా రాజ్ - కావ్యలు అడ్డుపడుతున్నారని ఏదో ఒకటి చేయమని రుద్రాణికి ఫోన్ చేస్తాడు రాహుల్. దాంతో రాజ్ లాప్‌టాప్‌లో ఉన్న ఫైల్‌ను డిలీట్ చేయించి టెన్షన్ పెడుతుంది రుద్రాణి.

Photo Courtesy: JioHotstar

నవంబర్ 5వ తేదీ 870వ ఎపిసోడ్‌లో..
క్లైంట్స్‌తో మీటింగ్‌కి ముందు లాప్‌టాప్‌లో అన్ని చెక్ చేసుకుంటూ ఉండగా.. రాజ్ సార్ పంపిన ఫైల్ కనిపించడం లేదని శృతి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. దాంతో కంపెనీకి 50 కోట్ల నష్టం వచ్చేలా ఉందని వెంటనే రాజ్ - కావ్యలను వచ్చేయమని చెబుతాడు ప్రకాశం. కంపెనీ కోసం రాజ్ - కావ్యలు కూడా బయల్దేరబోతుండగా.. ఆ ఫైల్‌ని సేవ్ చేసిన విషయం కళావతికి గుర్తొచ్చి ప్రకాశంకు చెబుతుంది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నా కోడలు కావ్య చాలా తెలివైందని సుభాష్, అపర్ణలు మెచ్చుకుంటారు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి రగిలిపోతుంది. నా ఫ్రెండ్ నన్ను పబ్‌కి రమ్మని పిలిచాడని, అక్కడే నా ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడతానని కోయిలికి చెబుతాడు గోల్డ్ బాబు. దాంతో పబ్ సెటప్ అంతా ఇంట్లోనే ఏర్పాటు చేయిస్తుంది కోయిలి

నవంబర్ 6వ తేదీ 871వ ఎపిసోడ్‌లో..
తన కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టని కోయిలి.. ఆ గోల్డ్ బాబు కోసం ఇంట్లోనే పబ్ ఏర్పాటు చేయడంతో రాహుల్‌ మండిపడతాడు. అతని రాజ్- కావ్యలు మరింత రెచ్చగొడతారు. కోయిలితో నేను డ్యాన్స్ చేస్తానంటూ రాహుల్ ఆమె చేయి పట్టుకోగా.. మందు కలపమని గోల్డ్ బాబు అడుగుతాడు. రాహుల్ కలపకపోయేసరికి నేను వెళ్లిపోతానంటూ గోల్డ్ బాబు బెదిరించడంతో అతనిపై కోయిలి సీరియస్ అవుతుంది. ఇప్పటికైనా మా అక్క విలువ ఏంటో తెలిసిందా? దీనినే నమ్ముకుంటే నువ్వు చివరికి మందు కలుపుకుంటూ ఉండటమేనని భవిష్యత్ గురించి చెబుతుంది కావ్య. పీకలదాకా తాగిన కోయిలి, రాహుల్, గోల్డ్ బాబులు నిద్రపోతారు. ఉదయాన్నే రాహుల్‌ని నిద్రలేపిన రాజ్.. కోయిలి రూమ్‌లో గోల్డ్ బాబు ఉన్నాడని చెబుతాడు. రాహుల్ వెళ్లి చూడగా గోల్డ్ బాబు, కోయిలిలు వాటేసుకుని పడుకుంటారు. అది చూసిన రాహుల్ షాక్ అవుతాడు. డబ్బు కోసమే కోయిలి నిన్ను ట్రాప్ చేసిందని.. వీరిద్దరూ కేరాఫ్ ఫ్లాట్‌ఫాం అని రాజ్ చెప్పడంతో రాహుల్ మండిపడతాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup November 3rd to November 8th episode Story

Photo Courtesy: JioHotstar

నవంబర్ 7వ తేదీ 872వ ఎపిసోడ్‌లో..
కోయిలి - రంజిత్‌లు ఎవరో ఎలాంటి వారో పూర్తిగా తెలిసిందా? వాళ్లు నిన్నెందుకు ట్రాప్ చేశారో అర్థమైందా? అని కావ్య- రాజ్‌లు రాహుల్‌కు క్లాస్ పీకుతారు. రాహుల్ గాడికి కోయిలి గురించి కళ్లు తెరిపించి సేవ్ చేశామని రాజ్, కావ్య, గోల్డ్ బాబు సంబరాలు చేసుకుంటారు. వీరి మాటలు విన్న రంజిత్ లోపలికి వెళ్లి చూడగా.. రాహుల్ - కోయిలిలు గొడవపడతూ కనిపిస్తారు. నీ కారణంగా బంగారం లాంటి స్వప్నని, నా బిడ్డను వదిలేసి వచ్చానని అంటాడు రాహుల్. కానీ నువ్వు బజారుదానిలా బిహేవ్ చేశావని మండిపడతాడు. ఆ మాటలతో కోయిలికి కోపం వచ్చి.. నీలాంటి వాళ్లు నా చేతిలో చాలామంది ఔట్ అయ్యారని నువ్వు బతికిపోయావని అంటుంది. దాంతో కోప్పడిన రాహుల్ కోయిలిని కొట్టడంతో ఆమె తల నేలకు కొట్టుకుంటుంది. కోయిలి ఇంట్లో తాము ఏం చేశామో? ఎలా దాని బండారం బయటపెట్టామో దుగ్గిరాల కుటుంబానికి చెబుతారు రాజ్ - కావ్య. ఇంతలో రాహుల్ ఇంటికి రావడంతో అతనిని గుమ్మంలోనే ఆపుతుంది స్వప్న. నేను పూర్తిగా మారిపోయానని.. నాకొక అవకాశం ఇవ్వమని అడుగుతాడు. దుగ్గిరాల కుటుంబం కూడా నచ్చ చెప్పడంతో రాహుల్‌ను క్షమిస్తుంది స్వప్న. కొడుకుని లోపలికి తీసుకెళ్లి లాగిపెట్టి కొడుతుంది రుద్రాణి.

నవంబర్ 8వ తేదీ 873వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ ఆనందంగా ఉన్న సమయంలో రాహుల్ డల్‌గా కిందకి వస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై హ్యాపీగా ఉండమని రాహుల్‌కి చెబుతాడు రాజ్. కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి భార్యతో సరసాలు ఆడతాడు. ఇంతలో పోలీసులు ఇంటికి రావడంతో ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. కోయిలి అన్న అమ్మాయిని రాహుల్ హత్య చేశాడని అందుకే అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెబుతారు. నా కొడుకుని కాపాడమని రుద్రాణి ఇంట్లో వాళ్లని బతిమలాడుతుంది. ఇంతలో రుద్రాణికి కోయిలి భర్త రంజిత్ ఫోన్ చేసి మీ కొడుకు నా భార్యను చంపుతుండగా తీసిన వీడియో నా దగ్గర ఉందని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. ఇది కోర్టులో సాక్ష్యంగా ఇవ్వకూడదంటే నాకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ విషయాన్ని ఫ్యామిలీతో చెబుతుంది రుద్రాణి. మనం డబ్బులిస్తే రాహుల్ హత్య చేశాడని ఒప్పుకున్నట్లు అవుతుందని.. మనం రాహుల్ హత్య చేయలేదని నిరూపించాలని అంటాడు రాజ్. కోయిలి ఇంట్లో కావ్య కెమెరా పెట్టిందని అందులో ఏదో ఒక ఆధారం ఉంటుందని చెబుతాడు రాజ్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X