Brahmamudi Weekly Roundup : రాజ్ - కావ్య గిల్లి కజ్జాలు, బయటపడ్డ కళ్యాణ్ జీవితం .. దుగ్గిరాల ఫ్యామిలీలో చీలిక?
వేలం పాటలో కావ్య స్ట్రాటజీలు చూసిన క్లయింట్స్.. అనామిక కంపెనీతో కట్ చేసుకుని తిరిగి రాజ్ కంపెనీ ముందు క్యూకడతారు. కావ్య అపాయింట్‌మెంట్ కోసం రాజ్‌ని విసిగిస్తారు. క్లయింట్స్‌తో మీటింగ్ పెట్టిన కావ్య.. వారితో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆటో నడుపుతున్న కల్యాణ్‌ను చూసిన అనామిక- సామంత్‌లు అతనిని అవమానిస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు తీయడానికి గాను కళ్యాణ్‌పై ఓ డాక్యుమెంటరీ తయారు చేయిస్తుంది అనామిక. దీపావళికి కావ్య చేతుల మీదుగా ఉద్యోగులకి బోనస్ ఇప్పించాలనుకున్న సీతారామయ్య భార్యను పంపి కళావతిని ఆహ్వానిస్తాడు. దీపావళికి ఇంటికి రావాల్సిందిగా కళ్యాణ్‌ని, అప్పూని ధాన్యలక్ష్మీ - ప్రకాశంలు ఆహ్వానిస్తారు. ఇంటికొచ్చిన కావ్యని చూసి నానా మాటలు అంటాడు రాజ్. భర్త చేతుల మీదుగా ఉద్యోగులకు బోనస్ ఇప్పించాలని అనుకుంటుంది కావ్య.. కానీ రాజ్ పట్టించుకోడు. దుగ్గిరాల ఫ్యామిలీ కోరిక మేరకు ఉద్యోగులకి బోనస్‌లు ఇస్తుంది కావ్య . అయితే భార్యకు చెక్ ఇస్తాడు రాజ్. పండుగ వేళ అంతా క్రాకర్స్ కలుస్తుండగా రుద్రాణి అందరినీ లోపలికి పిలిచి కళ్యాణ్ జీవితాన్ని చూపిస్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. ఎంతో కొంత ఇచ్చి అప్పూని వదిలించుకోమని కళ్యాణ్‌కు చెబుతుంది.
నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు.. 558 ఎపిసోడ్ నుంచి 563 వరకు ఏం జరిగిందంటే?
నవంబర్ 4వ తేదీ 558వ ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీసుకి వచ్చేసరికి క్లయింట్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. ఈ విషయాన్ని శృతి వచ్చి రాజ్‌కు చెప్పడంతో ఆమెపై విరుచుకుపడతాడు . కానీ తాత గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి సైలెంట్‌గా సీఈవో రూమ్‌కి వెళ్లి కళావతికి విషయం చెబుతాడు. క్లయింట్స్ అంతా మీతోనే బిజినెస్ చేస్తామని కావ్యని బతిమలాడతారు. వాళ్లు వస్తారని ముందే ఊహించిన కావ్య అందుకు తగినట్లుగా అగ్రిమెంట్లు తయారు చేస్తుంది. బిజినెస్‌లో రాజ్‌ను మించిపోయారని వాళ్లంతా ప్రశంసించగా.. ఇదంతా నా భర్త వల్లేనని కావ్య చెబుతుంది. ఆటో నడుపుతున్న కళ్యాణ్‌ని చూసిన అనామిక - సామంత్‌లు అతనిని సూటిపోటి మాటలతో హింసిస్తారు. కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా అనామిక దూరం నుంచి ఫోటో తీస్తుంది. అనంతరం ఓ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌ని పిలిపించి కళ్యాణ్‌పై డాక్యుమెంటరీ తీయాలని చెబుతుంది.

నవంబర్ 5వ తేదీ 559వ ఎపిసోడ్‌లో కళ్యాణ్‌పై డాక్యుమెంటరీ ఎందుకు తీయిస్తున్నావని అనామికని సామంత్ అడుగుతాడు . దుగ్గిరాల వారి నుంచి సామ్రాజ్యాన్ని లాక్కోవాలంటే యుద్దం చేయాలని ఆమె ఆన్సర్ ఇస్తుంది. ఇందిర సలహా మేరకు దీపావళికి ఉద్యోగులందరికీ తనకు బదులుగా కావ్య చేతుల మీదుగా బోనస్ ఇప్పించాలని అనుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేస్తాడు సీతారామయ్య. రుద్రాణి, ధాన్యలక్ష్మీ తప్పించి అందరూ సంతోషిస్తారు. కావ్యని ఒప్పించడానికి అందరూ కలిసి కనకం ఇంటికి ఇందిరను పంపిస్తారు. నేను అక్కడికొస్తే మీ మనవడు నాపై రంకెలు వేస్తాడని ఇందిరతో కళావతి చెబుతుంది. నువ్వు సీఈవో హోదాలో వస్తే ఎవరూ ఏం చేయలేరని నచ్చచెబుతుంది. కృష్ణమూర్తి, కనకంలు కూడా కూతురిని ఒప్పిస్తారు. దీపావళి పండక్కి కొడుకు, కోడల్ని ఇంటికి ఆహ్వానించాలని స్వయంగా ధాన్యలక్ష్మీ - ప్రకాశంలు కళ్యాణ్ ఇంటికి వెళ్తారు.
నవంబర్ 6వ తేదీ 560వ ఎపిసోడ్‌లో దీపావళికి కళ్యాణ్‌ని , అప్పూని ఇంటికి ఆహ్వానిస్తారు ప్రకాశం - ధాన్యలక్ష్మీ. రాజ్ ముఖంపై ఇందిర నీళ్లు కొట్టి.. డెకరేషన్ పనులు చేయమని ఆర్డర్స్ వేస్తుంది. గత దీపావళికి కావ్యతో చేసిన అల్లరి రాజ్‌కి గుర్తుస్తుంది. ఇంతలో ఆటో దిగి ఇంటికి వస్తున్న కావ్యని చూసి రాజ్ ఆమెను ఆపి నానా మాటలు అంటాడు. రుద్రాణికి అనామిక ఫోన్ చేసి కళ్యాణ్ డాక్యుమెంటరీ గురించి చెప్పి ప్లాన్ అమలు చేయాల్సిందిగా చెబుతుంది. దీపావళి సెలబ్రేషన్స్‌కి ముస్తాబవుతున్న సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి.. పాయసం తినిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ పాయసం తింటుండగా కావ్య వచ్చి అత్తమామల్ని ఫోటో తీస్తుంది. కావ్య శాశ్వతంగా ఇంటికి వస్తే బాగుంటుందని సుభాష్, అపర్ణ అనుకుంటారు. ఇంతల ఉద్యోగులకి ఇవ్వాల్సిన బోనస్ చెక్కులు, లిస్ట్‌ను కావ్యకి ఇస్తుంది ఇందిర.
నవంబర్ 7వ తేదీ 561వ ఎపిసోడ్‌లో దీపావళి సందర్భంగా స్టాఫ్ మొత్తానికి బోనస్‌లు మీ చేతుల మీదుగా ఇప్పించాలని అనుకుంటున్నట్లుగా రాజ్‌తో కావ్య చెబుతుంది. ఎప్పటికైనా కంపెనీ నాదేనని, దానమిస్తే రాజ్ తీసుకోడని దేన్నైనా సాధించుకుంటాడని చెబుతాడు రాజ్. అప్పూతో కలిసి వచ్చిన కళ్యాణ్ ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడతాడు. అది చూసిన ధాన్యలక్ష్మీ, రుద్రాణిలు వారిద్దరిని లోపలికి రమ్మంటారు. తర్వాత అమ్మానాన్నల కోసం బట్టలు తీసుకొచ్చిన కళ్యాణ్ వారిద్దరికీ ఇవ్వడంతో ధాన్యలక్ష్మీ, ప్రకాశం ఎమోషనల్ అవుతారు. కొడుకు కోసం బట్టలు కొన్న ధాన్యలక్ష్మీ.. అప్పూను పట్టించుకోదు. ఇంతలో ప్రకాశం వచ్చి కోడలి కోసం కొన్న చీరను ధాన్యలక్ష్మీ చేతుల మీదుగా అప్పూకి ఇప్పిస్తాడు. దుగ్గిరాల కుటుంబం ఆనందంగా ఉండటం చూసి వెంటనే అనామికకు ఫోన్ చేసి డాక్యుమెంటరీ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని అడుగుతుంది రుద్రాణి. కావ్య, స్వప్న, అప్పూల చేతుల మీదుగా ఇంట్లో దీపావళి పూజ జరిపిస్తారు.
నవంబర్ 8వ తేదీ 562వ ఎపిసోడ్‌లో నా చేతుల మీదుగా బోనస్‌లు ఇవ్వనని కావ్య చెబుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంత చెప్పినా ఆమె పట్టించుకోదు. ఇంతలో రాజ్ జోక్యం చేసుకుని చెప్పడంతో కావ్య అందరికీ చెక్కులు ఇస్తుంది. చివరిలో మేనేజర్ పేరిట ఉన్న కవర్‌ని రాజ్‌కి ఇస్తుంది కావ్య.. దీనికి షాకైన రాజ్ సీఈవో కూడా స్టాఫ్ మెంబర్స్‌లో ఒకరని చెప్పి ఆమెకు బోనస్ , స్వీట్ బాక్స్ ఇస్తాడు. ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉండటంతో వెంటనే అనామికకు ఫోన్ చేసి డాక్యుమెంటరీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారని మండిపడుతుంది రుద్రాణి. భార్య కనిపించకపోవడంతో ఆమె కోసం ఇళ్లంతా వెతుకుతాడు రాజ్. దీంతో వెనుక నుంచి వచ్చి రాజ్‌ని పట్టుకుంటుంది కావ్య. ముగ్గురు కోడళ్లకి దీపావళి సందర్భంగా బంగారు నెక్లెస్‌లను ఇస్తుంది ఇందిర. ఎవరి భార్య మెడలో వాళ్లు వేయాలని చెప్పగా.. రాజ్ వేయనని మొండికేసే సరికి , భర్తను పక్కకి తీసుకెళ్లి బొద్దింకి భయపడిన సంగతిని చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది కావ్య.

నవంబర్ 9వ తేదీ 563వ ఎపిసోడ్‌లో భార్య బ్లాక్ మెయిల్ చేయడంతో కావ్య మెడలో హారం వేస్తాడు రాజ్. అనంతరం కళ్యాణ్‌కి ఓ పెన్నుని గిఫ్ట్‌గా ఇస్తుంది కావ్య. నువ్వు ఇంకా మంచి పాటలు రాయాలని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కుటుంబం మొత్తం బలవంతం చేయడంతో కళ్యాణ్ పాట పడి వినిపిస్తాడు. అది విని ధాన్యలక్ష్మీ కొడుకుని మెచ్చుకుంటుంది. తర్వాత ఫ్యామిలీ మొత్తం క్రాకర్స్ కాలుస్తుంది. రాజ్ భయంతో కావ్యని వెనుక నుంచి గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో రుద్రాణికి అనామిక నుంచి ఫోన్ రాగా.. ఆమె టీవీలో పెద్ద బాంబు పేలుతోందని అందరినీ పిలుస్తుంది. స్క్రీన్‌పై కళ్యాణ్ ఆటో నడుపుతున్న దృశ్యం కనిపించడంతో అంతా షాక్ అవుతారు. ధాన్యలక్ష్మీ మహాకాళీలా కళ్యాణ్, అప్పూలపై ఎగిరిపడుతుంది. ఎంతో కొంత ఇచ్చి అప్పూని వదిలించుకోమంటూ ధాన్యలక్ష్మీ చెప్పిన మాటలకు అంతా షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











