Brahmamudi Weekly Roundup : కనకం ఆశలు ఆవిరి .. అపర్ణ కొత్త స్కెచ్, రాజ్‌ను ఢీకొట్టనున్న కావ్య

క్యాన్సర్ డ్రామాతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని తన ఇంటికి రప్పిస్తుంది కనకం. రాజ్ ఫంక్షన్ హడావుడిలో ఉంటే మేనేజర్ నుంచి ఫోన్ రావడంతో అతను ఆఫీసుకి వెళ్తాడు. కంపెనీలో ఏం జరిగింది, నన్నెందుకు రమ్మన్నావని రాజ్ అడగ్గా నేను అసలు ఫోన్ చేయలేదని మేనేజర్ చెబుతాడు. ఇంటికొచ్చిన కొడుకుతో అపర్ణ మాట్లాడుతూ నీకొచ్చిన ఫోన్ నేను చేయించినదేనని చెబుతుంది. కావ్య కూడా కంపెనీ కోసం ఇలాగే వెళ్లిందని చెప్పి కళ్లు తెరిపిస్తుంది. పూల దండ వేస్తున్న భార్యని రాజ్ ఎత్తుకుంటాడు. వారిద్దరిని చూసి కనకం, ఇందిర, అపర్ణ సంతోషిస్తారు. దాంపత్య వ్రతంలో కూర్చొనన్న కావ్యని రాజ్ ఒప్పిస్తాడు. కనకం ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్న రుద్రాణి.. బంటి ద్వారా క్యాన్సర్ డ్రామా తెలుసుకుని అందరి ముందు బయటపెడుతుంది. తనను అంతా ఫూల్‌ని చేశారని రాజ్ అత్తగారిపై మండిపడుతూ జీవితంలో మీ ముఖం చూడనని చెప్పి వెళ్లిపోతాడు. తాను ఒంటరిగానే బతుకుతానని , కావ్యని నన్ను కలపాలని చూడొద్దని రాజ్ ఇంట్లో వాళ్లకి తేల్చిచెబుతాడు. రుద్రాణి వల్ల తమ పథకం ఫెయిల్ కావడంతో అపర్ణ మరో కొత్త ప్లాన్ వేస్తుంది.

అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు.. 540 ఎపిసోడ్ నుంచి 545 వరకు ఏం జరిగిందంటే?

అక్టోబర్ 14వ తేదీ 540 ఎపిసోడ్‌లో .. దుగ్గిరాల వారి రాకతో కనకం ఇల్లంతా కళకళలాడుతుంది. కిచెన్‌లో వంట చేస్తున్న ఇందిర, అపర్ణలని కనకం ఆపుతుంది. నువ్వు క్యాన్సర్ పేషెంట్‌వని.. పిచ్చి వేషాలు వేస్తే రాజ్‌కి తెలిసిపోతుందని , ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అంటూ అత్తాకోడళ్లు మండిపడతారు. ఇంతలో అత్తగారిని రాజ్ పిలిచి తన ఫ్రెండ్స్‌లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడని.. ఎలాంటి క్యాన్సర్‌నైనా వాడు తగ్గిస్తాడని చెబుతాడు. మీ రిపోర్ట్స్ ఇస్తే వాడికి చూపిస్తానని రాజ్ అంటాడు. అల్లుడుగారు రిపోర్ట్స్ అడిగేసరికి కనకం షాక్ అవుతుంది. అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వస్తుండగా కావ్య ఎదురుపడి నీ మీద నాకు డౌట్ కొడుతుందని అంటుంది. ఆమెకు ఏం చెప్పాలో తెలియక కనకం దిక్కలు చూస్తుంది. ఇంతలో అపర్ణ, ఇందిరలు వచ్చి ఆమెను కాపాడతారు. రాజ్ తప్పు తెలుసుకునేలా తాను ప్లాన్ చేశానని.. ఇప్పుడు వాడికి మేనేజర్ ఫోన్ చేస్తాడని ఇందిరతో చెబుతుంది అపర్ణ. మేనేజర్ నుంచి ఫోన్ రావడంతో రాజ్ హడావుడిగా బయల్దేరతాడు. అపర్ణ, ఇందిరలు అడ్డుపడి కార్యక్రమం మధ్యలో నువ్వు బయటికి వెళ్లడం బాగోదని చెప్పినా వినకుండా రాజ్ వెళ్లిపోతాడు. ఇంటికొచ్చిన కళ్యాణ్, అప్పూలకి ధాన్యలక్ష్మీ ఎదురుపడి నానా మాటలు అంటుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup October 14th to October 19th episode Story

అక్టోబర్ 15వ తేదీ 541 ఎపిసోడ్‌లో.. ఆఫీసులో ప్రత్యక్షమైన రాజ్‌ని చూసి మేనేజర్ కంగారు పడతాడు . కంపెనీలో ఏం జరిగింది, నన్నెందుకు రమ్మన్నావని రాజ్ అడగ్గా నేను అసలు ఫోన్ చేయలేదని మేనేజర్ చెబుతాడు. ఆ మాటలతో రాజ్ షాకై శృతిని పిలించి కంపెనీలో అంతా పర్ఫెక్ట్‌గానే ఉందా అని అడుగుతాడు. ఆమె ఎక్కడా ఏ ఇబ్బంది లేదని చెప్పడంతో రాజ్ అక్కడి నుంచి అత్తగారింటికి వచ్చేస్తాడు. కొడుక్కి ఎదురుపడిన అపర్ణ.. నీకొచ్చిన ఫోన్ నేను చేయించినదేనని చెబుతుంది. కంపెనీ కష్టాల్లో ఉందని తెలిసే ఆ రోజు కావ్య .. నన్ను వదిలి వెళ్లిందని రాజ్‌కు కనువిప్పు కలిగిస్తుంది. భార్యను అలా చూస్తూ ఉండిపోయిన రాజ్ తాను కావ్యతో అన్న మాటలను గుర్తుచేసుకుంటాడు. ఆ వెంటనే ఆమెను గుమ్మం దగ్గర ఎత్తుకుని పూల దండలు కట్టిస్తాడు. రాజ్‌లో వచ్చిన మార్పుతో అపర్ణ, కనకం, ఇందిర సంతోషపడతారు. రాజ్ - కావ్యల రొమాన్స్ చూసి రుద్రాణి కుళ్లుకుంటూ ఉంటుంది. రాజ్‌లో ఇంత మార్పు ఎందుకొచ్చిందో తెలియక జుట్టు పీక్కుంటుంది. పెళ్లిరోజు సందర్భంగా కనకం - కృష్ణమూర్తిలు దండలు మార్చుకుని , కేక్ కట్ చేస్తారు.

అక్టోబర్ 16వ తేదీ 542 ఎపిసోడ్‌లో.. కనకం ఇంట్లో పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాజ్- కావ్యలు కనకం, కృష్ణమూర్తిలకు కేక్ తినిపిస్తారు. అందరూ ఒకచోట కూర్చొని తమ పెళ్లి , వైవాహిక బంధం గురించి గొప్పగా చెబుతారు. అందరి వంతు పూర్తయిన తర్వాత చివరిలో కావ్య మాట్లాడుతుంది. తన భర్తకు తనపై నమ్మకం లేదని.. నేను ఏ తప్పు చేయకపోయినా ఆయన నమ్మడని అంటుంది. ఆ మాటలతో రాజ్ మనసు విరిగిపోతుంది. అంతా షాక్‌లో ఉండగా పంతులు గారు వచ్చి దాంపత్య వ్రతం గురించి చెప్పి.. ఎవరెవరు పూజలో కూర్చొంటారని అడుగుతాడు. అపర్ణ, కనకం మధ్యలో కలగజేసుకుని కావ్య - రాజ్, కళ్యాణ్ - అప్పూ, రాహుల్ - స్వప్నలు వ్రతంలో కూర్చొంటారని చెబుతారు. కానీ కావ్య మాత్రం ససేమిరా అని లేచి వెళ్లిపోతుంది. ఆమె మాటలతో అంతా షాక్ అవుతారు. కూతురిని ఎలాగైనా పూజలో కూర్చోబెట్టాలని అనుకున్న కనకం కొత్త డ్రామా మొదలుపెడుతోంది. అల్లుడు చూస్తుండగా పెద్దగా దగ్గుతుంది. అది విని రాజ్ ఆమె దగ్గరికి వస్తాడు. కావ్యని ఎలాగైనా వ్రతంలో కూర్చొనేలా చేయాలని అడుగుతుంది. తాను ఆమెతో కలిసి పూజ చేస్తానని.. కానీ మీ అమ్మాయి కొండ మీద ఉందని అంటాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup October 14th to October 19th episode Story

అక్టోబర్ 17వ తేదీ 543 ఎపిసోడ్‌లో.. వ్రతంలో కూర్చోనని కావ్య చెప్పడంతో అంతా బాధపడతారు. కూతురిని ఎలాగైనా అల్లుడు పక్కన పూజలో కూర్చోబెట్టాలని కనకం ప్లాన్ వేస్తోంది. అత్తగారికి ఏం జరిగిందోనని రాజ్ కంగారుపడతాడు. నా ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు అల్లుళ్లు కలిసి దాంపత్య వ్రతం చేసుకుంటుంటే కళ్లారా చూడాలని ఉందని అంటుంది. మీ అమ్మాయి కొండ మీద కూర్చొందని ఆ కోతిని కిందకి తీసుకురాలేనని అంటాడు. మీ అమ్మాయిని ఒప్పిస్తానని చెప్పి కనకంతో మాట్లాడుతున్న కావ్యని పక్కకి లాక్కెళ్లి మనస్పూర్తిగా నా భార్య స్థానం నీకివ్వాలని అనుకుంటున్నానని .. నీ కోసం పీటల దగ్గర వెయిట్ చేస్తానని చెప్పి వెళ్లిపోతాడు. పెద్దమ్మ మామూలుది కాదు.. రాజ్ బావని దారికి తీసుకొచ్చేసిందని బంటి అంటుండగా అప్పూ, రుద్రాణి వింటారు. ఏం జరిగిందని అప్పూ నిలదీయగా బంటి క్యాన్సర్ డ్రామా మొత్తం బయటపడతాడు. క్యాన్సర్ అని అబద్ధం చెప్పి కనకం ఇదంతా చేస్తుందని తెలుసుకున్న రుద్రాణి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంది. కావ్య కోసం అందరూ వెయిట్ చేస్తుండగా ఆమె తలుపు తీసి రాజ్ పక్కన వచ్చి కూర్చొంటుంది. దాంపత్య వ్రతం పూర్తయి కావ్య చేతికి రాజ్ కంకణం కట్టబోతుండగా రుద్రాణి చప్పట్లు కొట్టడంతో అంతా షాక్ అవుతారు.

అక్టోబర్ 18వ తేదీ 544 ఎపిసోడ్‌లో.. కావ్య - రాజ్‌లను కలపడానికి కనకం ఆడుతున్న క్యాన్సర్ డ్రామాని అందరి ముందు బయటపెడుతుంది రుద్రాణి. దాంతో రాజ్ సహా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కుటుంబానికి లేనిపోని తలవంపులు తీసుకొచ్చావని భార్యపై కృష్ణమూర్తి మండిపడతాడు, కావ్య కూడా తల్లిని నిలదీస్తుంది. త్వరలో చనిపోతారని, నాలుగు రోజులు హ్యాపీగా ఉంటారని తాను ఇంత కష్టపడితే నన్ను ఫూల్‌ని చేశారంటూ రాజ్ అత్తగారితో అంటాడు. ఇంతలో ఇందిర, అపర్ణ కలగజేసుకుని.. కనకానికి ఏమీ తెలియదని దీనికి సూత్రధారులం మేమేనని అంటుంది. ఆ మాటలతో రాజ్ సహా అందరూ షాక్ అవుతారు. మీరు కూడా నన్ను మోసం చేస్తారా అంటూ తల్లిని రాజ్ ప్రశ్నించగా.. వేరే దారి లేదని అపర్ణ అంటుంది. కళావతి తన తల్లితో కలిసి అద్భుతంగా నటించిందని , ఇక జీవితంలో ఈ కుటుంబాన్ని నమ్మనని రాజ్ వెళ్లిపోతాడు. ఆ వెంటనే రుద్రాణి చెంప పగులగొడుతుంది ఇందిర. మీ అమ్మని అపార్ధం చేసుకోవద్దని కావ్యకి చెప్పి ఇందిర, అపర్ణలు ఇంటికి వచ్చేస్తారు . కోపంతో రగిలిపోతున్న రాజ్‌కు వారిద్దరూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు.

Brahmamudi Telugu Serial Weekly roundup October 14th to October 19th episode Story

అక్టోబర్ 19వ తేదీ 544 ఎపిసోడ్‌లో.. నన్ను కావ్యని కలపడానికి ఎవరూ కష్టపడొద్దని ఇకపై నేను ఒంటరిగానే బతుకుతానని తెగేసి చెబుతాడు రాజ్. ఆ మాటతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. కనకం డ్రామాని బయటిపెట్టి రాజ్- కావ్యలని శాశ్వతంగా విడగొట్టడంతో రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. ఇంతలో స్వప్న వచ్చి మీరు రాక్షసుల కంటే డేంజర్ అంటూ మండిపడుతుంది. బాధతో కుమిలిపోతున్న తల్లిని కావ్య ఓదారుస్తుంది. కూతురి కాపురం కోసం ఎంతో సాహసం చేశావంటూ కృష్ణమూర్తి కూడా భార్యను మెచ్చుకుంటాడు. మీ అల్లుడుగారు మారతారన్న నమ్మకం నాకు లేదని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. కనకం, అపర్ణ, ఇందిరలు ఓ చోట కలుసుకుని కావ్య - రాజ్‌లను కలపడానికి కొత్త ప్లాన్ వేస్తారు. వెంటనే ఇంటికి వచ్చి కావ్యని కలుస్తారు. నువ్వు ఆఫీస్‌లో రాజ్ దగ్గర ఉంటేనే వాడు మారతాడని అపర్ణ తన కోడలితో చెబుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X