Brahmamudi Weekly Roundup : సమస్యలతో కావ్య సతమతం , రాజ్‌ను రౌండప్ చేసిన ఫ్యామిలీ
క్యాన్సర్ డ్రామా ఫెయిల్ కావడంతో అపర్ణ, కనకం, ఇందిరలు కొత్త ప్లాన్ వేస్తారు. ఏకంగా కావ్యని కంపెనీకి సీఈవోగా అపాయింట్ చేస్తారు. ఈ విషయంలో అడ్డుపడ్డ అనామికకి అపర్ణ షాకిస్తుంది. ఆఫీస్‌లో సీఈవోగా కావ్యని చూసిన రాజ్ రగిలిపోతూ తాతయ్యని నిలదీస్తాడు. కంపెనీ క్షేమం నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని సీతారామయ్య తెగేసి చెబుతాడు. ఆటోలో కళ్యాణ్ అద్భుతంగా పాట పాడి ప్రొడ్యూసర్‌ని, రైటర్ లక్ష్మీకాంత్‌ని మెప్పిస్తాడు. కొన్ని టెస్టులు పెట్టి నిన్ను అసిస్టెంట్‌గా పెట్టుకుంటానని చెప్పి కళ్యాణ్‌ని అవమానిస్తాడు రైటర్. జరిగిన దానికి కుమిలిపోతున్న కళ్యాణ్‌ని అప్పూ ఓదారుస్తుంది. ఆఫీస్ రహస్యాలను అనామికకు చేరవేస్తోన్న మేనేజర్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కావ్య.. అతనని సెక్యూరిటీ గార్డ్‌గా మార్చేస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉన్న రాజ్‌ని తిరిగి ఆఫీస్‌కి పంపాలని అపర్ణ, ఇందిరలు ప్లాన్ చేస్తుంటారు. రాజ్ అమాయకత్వం చూసి కూరగాయల బిల్లును రూ. 6 వేలు అని చెప్పిన దుకాణదారుడితో కనకం గొడవపడుతుంది. క్లయింట్స్ మీటింగ్‌కి ఎవరూ రాకపోవడంతో బాధపడుతున్న కావ్యకి అనామిక ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ చెబుతుంది.
అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు.. 546 ఎపిసోడ్ నుంచి 551 వరకు ఏం జరిగిందంటే?
అక్టోబర్ 21వ తేదీ 546వ ఎపిసోడ్‌లో క్యాన్సర్ డ్రామా ఫెయిల్ కావడంతో కావ్యని , రాజ్‌ని కలిపేందుకు ఇందిర, కనకంలతో కలిసి మరో ప్లాన్ వేస్తుంది అపర్ణ. దీని గురించి కావ్యకి చెప్పడంతో ఆమె ససేమిరా అంటుంది. కంపెనీలో నేను ఉద్యోగిగా చేరితే మీ అబ్బాయి నన్ను ఎప్పుడు పంపించేద్దామా అని చూస్తాడని చెబుతుంది. నువ్వు ఎంప్లాయ్ అయితే వాడు అలాగే చేస్తాడని కానీ సీఈవో అయితే అని అపర్ణ అనగానే కావ్య షాక్ అవుతుంది. ఇంతలో అనామిక అక్కడికి వచ్చి.. కావ్యను మీ కంపెనీలో చేర్చుకోవడం కుదరదని చెప్పి అగ్రిమెంట్ చూపిస్తుంది. అపర్ణ పేపర్లు క్షుణ్ణంగా చదివి రూ.50 లక్షల చెక్ ఆమె ముఖాన కొడుతుంది. కూతురికి అండగా నిలిచిన అపర్ణని చూసి కనకం చాలా సంతోషిస్తుంది. కంపెనీ కష్టాల్లో ఉందని తాతయ్య బాధపడుతున్నారని రాజ్‌తో కలిసి పరిస్ధితిని చక్కదిద్దమని ఇందిర, అపర్ణ చెబుతారు. ఆ మాటతో కావ్య మెత్తబడి సీఈవోగా బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఫేమస్ లిరిసిస్ట్ లక్ష్మీకాంత్ తన ప్రొడ్యూసర్‌తో కలిసి కళ్యాణ్ ఆటో ఎక్కుతారు. ప్రొడ్యూసర్ ఎంత బతిమలాడినా పాట రాయడానికి ఒప్పుకోడు లక్ష్మీకాంత్. మధ్యలో కళ్యాణ్ కలగజేసుకుని ఓ పాట పాడతాడు.

అక్టోబర్ 22వ తేదీ 547వ ఎపిసోడ్‌లో కళ్యాణ్ పాటను మెచ్చుకున్న ప్రొడ్యూసర్ దానిని తన సినిమాలో వాడుకుంటానని చెప్పి నజరానా ఇస్తాడు. ఇంతలో ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బును అతని దగ్గరి నుంచి లాక్కొని ఏదో కొంత కళ్యాణ్‌కి ఇస్తాడు లక్ష్మీకాంత్. నీకు కొన్ని టెస్టులు పెడతానని పాసైతే అసిస్టెంట్‌గా పెట్టుకుంటానని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు లక్ష్మీకాంత్. జరిగినదంతా ఇంటి దగ్గర అప్పూకి చెబుతాడు కళ్యాణ్. మనకి మంచి రోజులు వచ్చాయని త్వరలోనే నువ్వు అనుకున్నది సాధిస్తావని అప్పూ భర్తను మెచ్చుకుంటుంది. ఆఫీస్‌లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించే ముందు తండ్రి ఆశీస్సులు తీసుకుంటుంది కావ్య. ఆఫీసులో రాజ్ తన గదిలోకి వెళ్లబోతుండగా శృతి ఆపుతుంది. మీ ఛాంబర్ వేరే చోటికి మార్చామని, ఇది కొత్త బాస్‌దని చెబుతుంది. ఆమె మాటలతో కోప్పడిన రాజ్.. డోర్ తీసి చూడగా సీఈవో చైర్‌లో కావ్య కనిపిస్తుంది.
అక్టోబర్ 23వ తేదీ 548వ ఎపిసోడ్‌లో తనకు తెలియకుండా కావ్యను కంపెనీకి సీఈవోగా నియమించడంతో ఇంటికొచ్చి తాత సీతారామయ్యని నిలదీస్తాడు రాజ్. ఈ ఇంట్లో నాకు సపోర్ట్‌గా ఎవరూ మాట్లాడరా అని అడుగుతాడు. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీలు కూడా సీతారామయ్య నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ఇందిర మండిపడుతుంది. అనామిక, అప్పూ, కావ్య వెళ్లిపోయారని.. ఇలాగే వదిలేస్తే ఇంట్లోని మహాలక్ష్మీ కూడా వెళ్లిపోతుందనే సీతారామయ్య బాధపడతాడు. అలా జరగకూడదనే కళావతిని సీఈవోగా అపాయింట్ చేశానని అంటాడు . మరోవైపు.. రాజ్ కంపెనీలోని ఉద్యోగితో అనామిక ఫోన్‌లో మాట్లాడుతుంది, కావ్యని ఆఫీస్ నుంచి వెళ్లగొట్టడానికి సాయం చేయాలని అడుగుతుంది. దీనిని కళావతి పసిగడుతుంది. వెంటనే ఆ వ్యక్తిని స్టాఫ్ అందరి ముందు నిలబెట్టి ప్రశ్నిస్తుంది. అతనిని సెక్షన్ ఆఫీసర్ నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా డిమోట్ చేస్తున్నట్లు కావ్య ఆర్డర్స్ పాస్ చేస్తుంది.

అక్టోబర్ 24వ తేదీ 549వ ఎపిసోడ్‌లో ఆఫీసు రహస్యాలను అనామికకు చేరవేస్తున్న ఉద్యోగికి కావ్య ఇచ్చిన స్ట్రోక్‌తో స్టాఫ్ మొత్తం వణికిపోతారు. ఆఫీస్‌కి వెళ్లకపోవడంతో రాజ్ ఆలస్యంగా నిద్రలేచి వస్తాడు. హాల్లో మాట్లాడుకుంటున్న ఇందిర, అపర్ , రుద్రాణిలు అది చూసి షాక్ అవుతారు. ఇంతలో రాజ్‌కి కావ్య ఫోన్ చేసి ఆఫీస్ లాప్‌టాప్ పాస్‌వర్డ్ అడుగుతుంది. నేను చెప్పను నువ్వే కనుక్కో అంటూ తేల్చిచెబుతాడు . దీంతో కావ్య తనే పాస్‌వర్డ్ కనుక్కుని కొత్తది సెట్ చేస్తుంది. పనిపాటా లేకపోవడంతో ఇంట్లో రాజ్‌కు ఏం తోచదు. కిచెన్‌లో వంట చేస్తున్న తల్లి దగ్గరికి వచ్చి వంటలు టేస్ట్ చేస్తాడు. దీంతో పనిమనిషి శాంత పడిపడి నవ్వుతుంది. అవమానంగా ఫీలైన రాజ్ ఆమెను పిలిచి ఆవాలు లెక్కపెట్టమని పనిష్మెంట్ ఇస్తాడు. ఆ మాటను ఏడుస్తూ అపర్ణకి చెబుతుంది శాంత. ఆమె ఇచ్చిన సలహా ప్రకారం ఆవాలు లెక్కపెట్టేశానని రాజ్‌తో ఓ నెంబర్ చెబుతుంది. అప్పుడే లెక్క పెట్టేశావా అని రాజ్ అడగ్గా.. కావాలంటే మీరే చెక్ చేసుకోండి అంటుంది.
అక్టోబర్ 25వ తేదీ 550వ ఎపిసోడ్‌లో ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన కావ్యని సీఈవోగా తొలి రోజు ఎలా జరిగిందని కావ్య అడుగుతుంది. ఆమె తనపై కారాలు మిరియాలు నూరుతూ డల్‌గా కనిపించడంతో వెంటనే అపర్ణకి ఫోన్ చేస్తుంది కనకం. ఇద్దరూ ఒక చోట ఉండాలని మనం ఈ ప్లాన్ వేస్తే మీ అబ్బాయి ఇంట్లో ఉంటో ఎలా అని అడుగుతుంది. దీంతో వాడిని ఆఫీస్‌కి పంపుతానని కనకానికి అపర్ణ చెబుతుంది. ఇంట్లో తనకు తెలియకుండా అత్తాకోడళ్లు ఏదో కుట్ర చేస్తున్నారని గ్రహించిన రుద్రాణి అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. రైటర్ లక్ష్మీకాంత్ చేతుల్లో అవమానం జరగడంతో కళ్యాణ్ బాధపడుతుండగా అప్పూ వచ్చి అతనిని ఓదారుస్తుంది. ఇంతలో కళ్యాణ్‌కి రైటర్ ఫోన్ చేసి పొద్దున జరిగిన దానికి ఫీల్ కావొద్దని చెబుతాడు. తాను కొన్ని టెస్టులు పెడతానని వాటిలో నువ్వు పాసైతే తన దగ్గర అసిస్టెంట్‌గా చేర్చుకుంటానని లక్ష్మీకాంత్ ఆఫర్ ఇస్తాడు.

అక్టోబర్ 26వ తేదీ 551వ ఎపిసోడ్‌లో ఆఫీస్ లాప్‌టాప్ పాస్‌వర్డ్‌ని కావ్య మార్చేయడంతో ఆమెకు రాజ్ ఫోన్ చేసి పాస్‌వర్డ్ చెప్పమంటాడు. నేను కనుక్కున్నట్లుగానే నువ్వు కూడా కనుక్కో అంటుంది కావ్య. కానీ ఎంత ట్రై చేసినా పాస్‌వర్డ్ మాత్రం కనుక్కోలేకపోతాడు రాజ్. ఉదయాన్నే అంతా తనను ఆఫీస్‌కి వెళ్లమని బతిమలాడతారని రాజ్ అనుకుంటాడు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి పలకరించినా అతనిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇంతలో అపర్ణ వచ్చి పనిపాటా లేకుండా ఉన్నావ్ వెళ్లి కూరగాయలు తీసుకురమ్మని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. తిట్టుకుంటూనే మార్కెట్‌కి బయల్దేరగా.. ఈ విషయాన్ని కనకానికి చెబుతుంది. రాజ్ అమాయకత్వం చూసి కూరగాయల దుకాణం ఓనర్ 6 వేల బిల్లు వేస్తాడు. దీనిని గమనించిన కనకం మధ్యలో దూరి దుకాణదారుడిని తిట్టేస్తుంది. కనకం చెబుతున్నా వినకుండా అడిగినంత ఇచ్చేసి కోపంగా ఇంటికి బయల్దేరతాడు రాజ్. మీటింగ్‌కి క్లయింట్స్ ఎవరూ రాకపోవడంతో కావ్య బాధపడుతుండగా అనామిక ఫోన్ చేసి వాళ్లని నా వైపుకు తిప్పుకున్నానని చెబుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











