Brahmamudi Weekly Roundup : అత్తమామల్ని కలిపిన కావ్య .. అవమానంతో రగిలిపోతున్న అనామిక, కళావతికి కొత్త కష్టాలు
ఆఫీసుకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న రాజ్‌ని దుగ్గిరాల ఫ్యామిలీ టార్చర్ చేస్తాడు. వాళ్ల బాధ భరించలేక ఆఫీస్‌కి వెళ్లడానికి ఒప్పుకుంటాడు రాజ్. మీటింగ్‌లో దుగ్గిరాల కంపెనీతో వ్యాపారం చేయమని చేయమని తేల్చిచెబుతారు క్లయింట్స్. వ్యాపారం చేయడమంటే బొమ్మలకు రంగులు వేయడం కాదని భార్యను బాధపెడతాడు రాజ్. అరవింద్ అనే వ్యక్తి కావ్యను కలిసి తమ కంపెనీ నష్టాల్లో ఉందని మీరే ఆదుకోవాలని చెప్పడంతో వేలం పాటలో కంపెనీని కొంటానని కళావతి చెబుతుంది. స్వప్న ద్వారా రుద్రాణిని ట్రాప్ప చేసిన కావ్య.. అనామిక వేలం పాటకు వచ్చేలా చేస్తుంది. సామంత్ చెబుతున్నా వినకుండా వేలంలో రూ.40 కోట్లకు అరవింద్ కంపెనీని కొంటుంది. సుభాష్‌కి దూరం జరుగుతున్న అపర్ణని మార్చి తిరిగి అత్తమామలు ఒక్కటయ్యేలా చేస్తుంది కావ్య. కళావతి చేతిలో మోసపోయానని తెలుసుకున్న అనామిక దెబ్బకు దెబ్బ తీస్తానని శపథం చేస్తుంది. కావ్య టాలెంట్ చూసిన పాత క్లయింట్స్ తిరిగి దుగ్గిరాల కంపెనీతో వ్యాపారం చేయడానికి ముందుకొస్తారు. ఇందుకు కావ్య అపాయింట్‌మెంట్ ఇప్పించాలని రాజ్‌ను అడుగుతారు.
అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు.. 552 ఎపిసోడ్ నుంచి 557 వరకు ఏం జరిగిందంటే?
అక్టోబర్ 28వ తేదీ 552వ ఎపిసోడ్‌లో ఒంటి నిండా కూరగాయలు వేసుకుని ఇంటికొచ్చిన రాజ్‌ను చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రుద్రాణి అయితే నా అల్లుడిని ఇంటికి పనిమనిషిని చేసేశారంటూ హడావుడి చేస్తుంది.. అయితే వాడికి బదులుగా నువ్వు పనులు చేయ్ అంటూ ఇందిర కౌంటరిస్తుంది. ఇంతలో ప్రకాశం వచ్చి టేబుల్ ఫ్యాన్ సరిగా పనిచేయడం లేదు రిపేర్ చేయమని రాజ్‌తో చెబుతాడు . దీంతో రాజ్ నట్లు, బోట్లు సరిచేసి రిపేర్ పూర్తి చేస్తాడు. కావ్య , శృతి మాట్లాడుకుంటూ ఉండగా.. ఇద్దరు క్లయింట్స్ వస్తారు. నేను పిలిస్తే రానని చెప్పారు ఎలా వచ్చారని శృతి అడగ్గా చెప్పే విధంగా చెబితే ఎవరైనా వస్తారని కావ్య అంటుంది. ఏం చేసినా రాజ్ మనసు మారకపోవడంతో అపర్ణ బాధపడుతుండటం చూసి సుభాష్ ఆమె దగ్గరకొచ్చి ఓదారుస్తాడు. ఓదార్పు వంకతో నాకు దగ్గర అవ్వాలని చూడొద్దని అపర్ణ మండిపడుతుంది. రాజ్‌ని ఎలాగైనా ఆఫీస్‌కి పంపాలని మాస్టర్ ప్లాన్ వేసిన దుగ్గిరాల ఫ్యామిలీ అతనిని రౌండప్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తుంది.

అక్టోబర్ 29వ తేదీ 553వ ఎపిసోడ్‌లో ఇంట్లో వాళ్ల టార్చర్ భరించలేక రాజ్ ఆఫీస్‌కి వెళ్లడానికి ఓకే చెబుతాడు. వాళ్ల మాటల్ని విన్న రాహుల్ వెంటనే ఈ విషయాన్ని తల్లితో చెబుతాడు. రుద్రాణి వెంటనే ఆఫీసులో ఉన్న మేనేజర్‌కి ఫోన్ చేయమని చెబుతుంది. నన్ను కావ్య మేడం మేనేజర్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ గార్డ్ డిమోట్ చేసిందని చెబుతాడు. ఆఫీసు గేటు వద్ద మేనేజర్‌ని చూసిన రాజ్.. అతనిని తీసుకుని కావ్య దగ్గరికి వెళ్లి ఇలా ఎందుకు చేశావని నిలదీస్తాడు. క్లయింట్స్ వచ్చిన విషయాన్ని ఫోటో తీసి అనామికకు పంపుతుంది కావ్య. రాహుల్ తమను చాలా ఇబ్బందులకు గురిచేశాడని క్లయింట్స్ చెబుతారు. ఎండీ చైర్‌లో ఎప్పుడెవరు ఉంటారో తెలియడం లేదని మేం మీతో బిజినెస్ చేయలేమని చెప్పి వెళ్లిపోతారు. దీంతో కావ్య బాధపడుతుంది.
కంపెనీని నడపటమంటే మట్టి బొమ్మలకి రంగులు వేయడం కాదని భార్య సూటిపోటి మాటలు అంటాడు రాజ్. ఇంతలో అరవింద్ అనే వ్యక్తి వచ్చి కావ్యని కలుస్తాడు. తన కంపెనీని వేలం వేస్తున్నారని .. అలా జరిగితే తాను నష్టపోతానని చెప్పడంతో అతని కంపెనీని కొనడానికి కావ్య సరే అంటుంది.
అక్టోబర్ 30వ తేదీ 554వ ఎపిసోడ్‌లో అరవింద్ కంపెనీ వేలం పాటలో కొంటున్నట్లు కావ్య చెప్పడంతో రాజ్ మండిపడతాడు. సీఈవోగా నాదే ఫైనల్ డెసిషన్ అని తేల్చేస్తుంది. రుద్రాణిని ఉపయోగించి అనామికను చావు దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన కావ్య స్వప్న ద్వారా దానిని అమలు పరుస్తుంది. స్వప్న మాటలు నమ్మిన రుద్రాణి వేలం పాట విషయాన్ని అనామికకు చేరవేస్తుంది. అరవింద్ కంపెనీ నష్టాల్లో ఉందని సామంత్ వద్దన్నా వినకుండా వేలం పాటకు రెడీ అవుతుంది అనామిక. వేలం పాట విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెబుతాడు రాజ్. కానీ ఎవ్వరూ అతని మాటలను పట్టించుకోరు. కావ్య కంపెనీకి సీఈవో అని ఆమె నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఇంట్లో ఎవ్వరికీ లేదని సీతారామయ్య తేల్చిచెబుతాడు. అనంతరం కావ్యకి సీతారామయ్య ఫోన్ చేసి వేలం పాట గురించి అడుగుతాడు.

అక్టోబర్ 31వ తేదీ 555వ ఎపిసోడ్‌లో నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీని కావ్య ఎందుకు కొనాలని అనుకుంటుందో తెలుసుకోవాలని శృతికి రాజ్ ఫోన్ చేస్తాడు. ఆమె తిక్క తిక్కగా ఆన్సర్ ఇవ్వడంతో రాజ్ మండిపడతాడు. ఎంత పొద్దెక్కినా సుభాష్ ఇంకా నిద్రలేవకపోవడంతో అపర్ణని అడుగుతుంది ఇందిర. నాకేం తెలియదని అపర్ణ కోపంగా ఆన్సర్ ఇస్తుంది. లోపల జ్వరంతో బాధపడుతూ దుప్పటి కప్పుకుని వణికిపోతున్న కొడుకుని చూసి ఇందిర బాధపడుతుంది. హాల్లోకి వచ్చి నువ్వు రోజురోజుకు దిగజారిపోతున్నావని అపర్ణపై మండిపడుతుంది. వేలం పాటకు కనకంతో కలిసి వచ్చిన కావ్యకు అనామిక ఎదురై సూటి పోటీ మాటలు అంటుంది. ఇంతలో రుద్రాణితో కలిసి రాజ్ అక్కడికి వస్తాడు. ఇవాళ్టీతో ఈ సీఈవో సంగతేంటో తెలిసిపోతుందని భార్యను ఉద్దేశించి సెటైర్లు వేస్తాడు. వేలం పాట మొదలవ్వగానే కనకం ఇష్టమొచ్చినట్లుగా పాడేస్తుంది. చివరికి రూ.40 కోట్లకు అరవింద్ కంపెనీని వేలంలో అనామిక దక్కించుకుంటుంది. ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో కావ్య - కనకంలకు అనామిక, రుద్రాణి, రాజ్ ఎదురుపడతారు.
నవంబర్ 1వ తేదీ 556వ ఎపిసోడ్‌లో వేలం పాటలో గెలిచి హ్యాపీగా బయటకొస్తున్న అనామికకు సామంత్ ఎదురవుతాడు. వేలంలో రూ.40 కోట్లకు అరవింద్ కంపెనీని పాడినట్లు చెప్పడంతో.. నన్ను నిలువునా ముంచేశావని అనామికపై మండిపడతాడు సామంత్. కాసేపటికీ అరవింద్ వచ్చి రూ. 5 కోట్లు కూడా పలకని నా కంపెనీకి రూ. 30 కోట్ల లాభం తీసుకొచ్చారని మీ తెలివికి సెల్యూట్ అంటాడు అరవింద్. ఈ మాటలతో అనామిక, రాజ్, రుద్రాణి, సామంత్, కనకం షాక్ అవుతారు. నన్ను మోసం చేసి మా కంపెనీకి అవార్డ్ దక్కకుండా చేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నానని అనామికతో కావ్య అంటుంది. మోసం చేసి గెలవడం గెలుపు కాదని భార్యపై కోప్పడి రాజ్ వెళ్లిపోతాడు. ఇంతలో కావ్యకి ఇందిర ఫోన్ చేసి మీ అత్తమామల తీరు బాలేదని, వారి మధ్య దూరం నానాటికీ పెరిగిపోతుందని చెప్పి బాధపడుతుంది. వెంటనే అపర్ణని కలిసిన కావ్య.. మీరు మావయ్యని క్షమిస్తేనే మీ అబ్బాయిలో మార్పు వస్తుందని చెబుతుంది. ఆ మాటలతో మెత్తబడ్డ అపర్ణ.. ఇంటికొచ్చి సుభాష్‌ని ప్రేమగా పలకరిస్తుంది. భార్యాభర్తలు కలిసిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది.

నవంబర్ 2వ తేదీ 557వ ఎపిసోడ్‌లో మీరు చేసిన దానికి కావ్య దెబ్బకు దెబ్బ తీసిందని రుద్రాణికి చెబుతుంది స్వప్న. అత్తమామలు కలిసిపోయినట్లుగా కావ్యకి ఇందిర ఫోన్ చేసి చెబుతుంది ఇందిర. ఆ మాటలతో కళావతి , కనకం, కృష్ణమూర్తి చాలా సంతోషిస్తారు. ఆ వెంటనే కావ్యకి రాజ్ ఫోన్ చేసి.. మీ మాయలు మా అమ్మానాన్నలపై ప్రయోగిస్తే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తాడు. భర్త మాటలతో మండిపడిన కావ్య.. మిస్టర్ మేనేజర్ నీ లిమిట్స్‌లో ఉండమని హెచ్చరిస్తుంది. వేలంలో జరిగిన అవమానంతో కావ్యపై అనామిక రగిలిపోతుంది. అయినప్పటికీ కావ్యను సామంత్ ఆకాశానికెత్తేస్తాడు. కావ్యని అంత తేలిగ్గా వదలనని దెబ్బకు దెబ్బ తీస్తానని అనామిక అంటుంది. రాజ్ ఆఫీస్‌కి వెళ్తుండగా ఇందిర - సీతారామయ్య మాట్లాడుకుంటూ మనవరాలిని పొగుడుతారు. ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. కారులో వెళ్తుండగా రాజ్‌కు పాత క్లయింగ్స్ ఫోన్ చేసి మీ కంపెనీతో తిరిగి వ్యాపారం చేస్తామని , కావ్య అపాయింట్‌మెంట్ కావాలని అడుగుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











