Brahmamudi Weekly Roundup : రాజ్- కావ్యల కోసం క్యాన్సర్ డ్రామా.. కనకం ప్లాన్ బెడిసికొడుతుందా?

ఎక్స్‌పోలో జరిగిన సంగతిని అత్తగారికి వివరిస్తుంది కావ్య. ఇంతలో ఓ అమ్మాయితో కలిసి గుడికి వచ్చిన రాహుల్‌.. అపర్ణని, కావ్యని చూసి ఆ విషయం రుద్రాణికి చెబుతాడు. ఆ విషయాన్ని వెంటనే రాజ్‌కు చెప్పడంతో అతను ఇంటికొచ్చిన తల్లిని నిలదీస్తాడు. నా సంగతి సరే కానీ రాహుల్ వేరే అమ్మాయితో కారులో షికారుకి వెళ్తున్నాడని అపర్ణ చెప్పడంతో స్వప్న రాహుల్‌ని గదిలోకి తీసుకెళ్లి కొడుతుంది. కావ్యను తిరిగి ఉద్యోగంలోకి తీసుకురావడానికి కనకం ఇంటికి అనామిక వస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం మా కంపెనీలో పనిచేయకపోతే జైలుకి పంపిస్తానని అనామిక వార్నింగ్ ఇస్తుంది. దీంతో అగ్రిమెంట్ పేపర్లు కొట్టేయడానికి సామంత్ ఆఫీస్‌కి లేబర్ ఆఫీసర్‌లా వెళ్లిన కనకం అనామికకి దొరికిపోతుంది. అప్పూని కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేస్తాడు కళ్యాణ్. రాజ్ కల్లోకి కావ్య వచ్చి నా తప్పేం లేదని చెబుతుంది.. కళావతి జ్ఞాపకాలతో నిద్రపట్టక హాల్లోకి వచ్చి పడుకుంటాడు రాజ్. తెల్లారి అతనిని ఇందిర, అపర్ణ చూసి రాజ్- కళావతిని కలపాలని అనుకుని కనకాన్ని గుడికి పిలిపిస్తారు. కనకం క్యాన్సర్ వచ్చినట్లు నాటకమాడి ఇద్దరిని కలుపుదామని చెప్పడంతో ఆ ప్లాన్ అమలు చేస్తారు అత్తాకోడళ్లు. అత్తగారికి క్యాన్సర్ వచ్చినట్లు తెలుసుకున్న రాజ్ ఆమె చివరి కోరిక తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తాడు. కృష్ణమూర్తి - కనకంల 25వ పెళ్లి రోజు వేడుకల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ కావ్య ఇంటికి వస్తుంది.

అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు.. 534 ఎపిసోడ్ నుంచి 539 వరకు ఏం జరిగిందంటే?

అక్టోబర్ 7వ తేదీ 534 ఎపిసోడ్‌లో .. రాజ్‌ ముందు ఆత్మారామ్ ప్రత్యక్షమై.. నీకు నీ భార్య అంటే ఇష్టమని.. ఆవిడ మీద నీకే సర్వ హక్కులు ఉండాలని అనుకుంటావని మండిపడతాడు. వర్షం తగ్గిపోయిందిగా వెళ్లి కావ్య జ్ఞాపకాలు తగలబెట్టేద్దామని అంటాడు. గుడిలో అపర్ణను కావ్య కలిసి ఎక్స్‌పోలో జరిగినదంతా అత్తగారికి చెబుతుంది . అనామిక మోసం చేసి తాను వేసిన డిజైన్లను మన ప్రత్యర్ధి కంపెనీకి ఇచ్చిందని వివరిస్తుంది. జరిగినదేదో జరిగింది ఇంటికి వచ్చేయమని కావ్యని అపర్ణ బ్రతిమలాడుతుంది. అయినా కావ్య తాను రానని తేల్చిచెబుతుంది. ఇంతలో గుడి దగ్గరికి ఓ అమ్మాయితో వచ్చిన రాహుల్.. కావ్యని అపర్ణని చూసి వెంటనే ఈ విషయం రుద్రాణికి చెబుతాడు. ఆమె పరుగు పరుగున కిందకి వెళ్లి కావ్యని కలుసుకోవడానికి మీ అమ్మ గుడికి వెళ్లిందని రాజ్‌తో చెప్పడంతో అతను సీరియస్ అవుతాడు. గుడి నుంచి వచ్చిన అపర్ణని నిలదీస్తాడు. నా కొడుకు యోగక్షేమాలు బాగానే తెలుసుకుంటున్నావని.. రాహుల్ ఏం చేశాడో తెలుసా అని రుద్రాణికి అపర్ణ షాకింగ్ న్యూస్ చెబుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup October 7th to October 12th episode Story

అక్టోబర్ 8వ తేదీ 535 ఎపిసోడ్‌లో .. రాహుల్ కారులో మరో అమ్మాయితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న స్వప్న.. అతనిని నిలదీస్తుంది. రాహుల్ తప్పించుకునే ప్రయత్నం చేయగా ముసుగేసి కొడతానని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటతో రుద్రాణి షాక్ అవుతుంది. అనంతరం రాహుల్‌ని గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతుంది. ఉదయాన్నే కావ్య కూరగాయలు తీసుకురావడానికి బయల్దేరుతుండగా ఇంట్లో అనామిక ప్రత్యక్షమవుతుంది. మీ దగ్గర ఉద్యోగం చేసేది లేదని కావ్య తేల్చిచెబుతుంది. దీంతో అనామిక అగ్రిమెంట్ విషయం గుర్తుచేసి తన మాట వినకుంటే జైలుకు పంపుతానని వార్నింగ్ ఇస్తుంది. అప్పూని తీసుకుని కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన కళ్యాణ్ అడ్వాన్స్ కడతాడు. అయితే చెప్పిన అమౌంట్ కాకుండా ఐదు వేలే ఇవ్వడంతో కోచింగ్ సెంటర్ ఓనర్ కోప్పడతాడు. రెండ్రోజుల్లో మిగిలినది కట్టేస్తానని కళ్యాణ్ చెప్పి కోచింగ్ సెంటర్‌లో అప్పూని జాయిన్ చేస్తాడు. దుగ్గిరాల వారి కంపెనీకి డిజైనర్‌గా కావ్యని తిరిగి అపాయింట్ చేయాలని రాజ్‌కి సీతారామయ్య ఆర్డర్స్ వేస్తాడు. దీంతో తనపై నమ్మకం లేదా అంటూ రాజ్ హర్ట్ అవుతాడు. అనామిక దగ్గర అగ్రిమెంట్ కొట్టేయాలని ఓ ఇద్దరు కుర్రాళ్లని తీసుకుని లేబర్ ఆఫీసర్ వేషంలో సామంత్ ఆఫీసుకు వెళ్తుంది కనకం.

అక్టోబర్ 9వ తేదీ 536 ఎపిసోడ్‌లో .. దొంగచాటుగా కావ్య సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్‌లు కొట్టేయడానికి లేబర్ ఆఫీసర్‌లా వచ్చిన కనకం అనామికని చూసి షాక్ అవుతుంది. అగ్రిమెంట్ పేపర్లు ఇచ్చేసి, నీ కూతురిని ఆఫీస్‌కు పంపాలని చెబుతుంది అనామిక. అగ్రిమెంట్ పేపర్లు ఇవ్వనని కనకం చెప్పగా.. పోలీసులకు ఫోన్ చేస్తానని భయపెడుతుంది అనామిక. దొడ్డిదారిలో ఇంట్లోకి వస్తున్న తల్లిని చూసిన కావ్య నిలదీయడంతో కనకం జరిగినదంతా చెబుతుంది. ఇంతలో బెడ్‌రూమ్‌లో తన బుగ్గని గిల్లిన కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. చేసినదంతా ఏ మొహం పెట్టుకుని వచ్చావా వెళ్లిపో అంటాడు.. ఆమె రాజ్‌ను కౌగిలించుకుని నన్ను అనామిక మోసం చేసిందని చెబుతుంది. ఆ వెంటనే తాను కలగన్నట్లు తెలుసుకున్నా రాజ్ ‌హాల్‌లో సోఫాపై పడుకుంటాడు. ఉదయాన్నే అపర్ణ, ఇందిరలు వచ్చి ఇక్కడ పడుకున్నావేంటీ అంటూ రాజ్‌ను ప్రశ్నించగా ఏదేదో చెబుతాడు. ఇక లాభం లేదని కావ్యని రాజ్‌ని కలపాలని, అది కనకం వల్లే అవుతుందని వారిద్దరూ ఆమెను గుడికి పిలిపిస్తారు. కనకం, అపర్ణ, ఇందిరా దేవిలు రాజ్- కావ్యలను తిరిగి ఒక్కటి చేయడం ఎలా అన్నదానిపై చర్చించుకుంటూ ఉంటారు.

Brahmamudi Telugu Serial Weekly roundup October 7th to October 12th episode Story

అక్టోబర్ 10వ తేదీ 537 ఎపిసోడ్‌లో .. కావ్య- రాజ్‌లను తిరిగి ఒక్కటి చేయాలంటే.. వాళ్లిద్దరూ ఒకేచోట ఉండాలని అపర్ణ, కనకం, ఇందిరా దేవి అనుకుంటారు. వాళ్లిద్దరూ కలిస్తే చూసే భాగ్యం తనకు లేదని .. నాకు క్యాన్సర్ చివరి స్టేజ్ అని, తాను ఎక్కువ రోజులు బతకనని కనకం చెప్పడంతో అపర్ణ, కనకం షాక్ అవుతారు. నిన్ను పెద్దాసుపత్రిలో చేర్పించి, మంచి డాక్టర్లతో ట్రీట్‌మెంట్ చేయిస్తామని అపర్ణ చెప్పడంతో అంతా అయిపోయిందంటూ కనకం నవ్వుతుంది. నాకు క్యాన్సర్ లేదు, ఏం లేదు మీరే నమ్మేశారంటే అల్లుడుగారు నమ్మేస్తారని అంటుంది. రేపు మా 25వ పెళ్లిరోజని.. నా చివరి కోరిక కింద మా పెళ్లిరోజును కూతుళ్లు, అల్లుళ్ల మధ్య జరుపుకోవాలని ఉందని రాజ్‌తో చెబుతానని అంటుంది కనకం. ఇంటి దగ్గర కావ్య కూడా పెళ్లి రోజు చేస్తానని తండ్రితో అంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన కనకం .. గుడిలో జరిగిన సంగతిని కృష్ణమూర్తితో చెబుతుంది. ఇంట్లో బిజీగా ఉన్న రాజ్‌కి కనకం గురించి ఎలా చెప్పాలో తెలియక ప్రకాష్ సాయం తీసుకుంటారు అపర్ణ, ఇందిర. వాళ్లు చెప్పినట్లే రాజ్ దగ్గరికెళ్లి కావ్యకి ఎంత అన్యాయం జరిగిందోనని హింట్ ఇస్తాడు ప్రకాశ్. రాజ్ ఏం జరిగిందని అడగ్గా మరిచిపోయానని అంటాడు. దీంతో కావ్యకి ఏమైనా జరిగిందేమోనని రాజ్ టెన్షన్‌లో ఉంటాడు.

అక్టోబర్ 11వ తేదీ 538 ఎపిసోడ్‌లో .. డైనింగ్ టేబుల్ దగ్గర పాపం కావ్య అంటూ ఎత్తుకుంటాడు ప్రకాశం.. మాకు భోజనం చేయాలని లేదంటూ అపర్ణ, ఇందిరలు వెళ్లిపోవడంతో రాజ్‌ బాధపడతాడు. అసలు ఏం జరిగిందో వాళ్లనే అడుగుదామని వెళ్తాడు. మీ అత్తగారు కనకానికి క్యాన్సర్ అని ఇంకా ఎన్ని రోజులో బతకదని చెబుతుంది అపర్ణ. ఆవిడకి చివరి కోరిక ఉందని చెప్పడంతో నేనే తెలుసుకుంటానని కనకం ఇంటికి బయల్దేరతాడు. అల్లుడుగారు వస్తున్నట్లు తెలుసుకున్న కనకం మహానటిలా యాక్టింగ్ మొదలుపెడుతుంది. ఇంటి దగ్గర దగ్గుతూ, నీరసంగా కనిపించిన అత్తగారిని చూసి రాజ్ బాధపడతాడు. ఆమె ఆరోగ్యం గురించి అడగ్గా.. ఇంకా కొద్దిరోజులేనని డాక్టర్ చెప్పాడని అంటుంది కనకం. నా 25వ పెళ్లి రోజుని ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్ల మధ్య జరుపుకోవడమే నా చివరి కోరిక అని చెబుతుంది. తొలుత రాజ్ అంగీకరించకపోగా.. కనకం తన యాక్టింగ్‌తో రెచ్చగొట్టే సరికి, మీ కోరిక నేను తీరుస్తానని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. కారులో వెళ్తున్న భర్తను చూసి కావ్యకి డౌట్ వచ్చి తల్లిని అడుగుతుంది. నాకేం తెలియదని కూతురికి అబద్ధం చెబుతుంది కనకం. తర్వాత తన ప్లాన్ వర్కవుట్ అయినట్లు అపర్ణకి ఫోన్ చేసి చెబుతుంది కనకం.

Brahmamudi Telugu Serial Weekly roundup October 7th to October 12th episode Story

అక్టోబర్ 12వ తేదీ 539 ఎపిసోడ్‌లో .. అత్తగారిని పరామర్శించి వచ్చిన రాజ్.. మా అత్తమామల పెళ్లిరోజు వేడుకల్ని నా చేతితో నిర్వహించాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. ఆ మాటలతో రుద్రాణి షాకై కళ్లు తిరిగి కిందపడిపోతుంది. గతిలేని వాళ్లకు పెళ్లి రోజులు చేస్తావా అంటూ రుద్రాణి ప్రశ్నించడంతో స్వప్న మండిపడుతుంది. అపర్ణ, ఇందిర, సుభాష్, ప్రకాశం, ధాన్యలక్ష్మీలు కనకం ఇంటికి రావడానికి ఒప్పుకుంటారు. కృష్ణమూర్తి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కనకం. ఇంతలో కావ్య వచ్చి తల్లిదండ్రులకు పెళ్లి రోజు విషెస్ చెబుతుంది. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే రాజ్ - రాహుల్‌లు అక్కడికొస్తారు. రాజ్ డెకరేషన్, వంట ఏర్పాట్లు చూసుకుంటూ ఉండటంతో కావ్య షాకవుతుంది. వారిద్దరూ గొడవ పడుతున్నప్పుడే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం దిగుతుంది. కనకం, కృష్ణమూర్తిలు వారందరికీ స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకెళ్తారు. భర్త హడావుడి చూసి కళావతి ప్రశ్నించగా.. ఇప్పుడే ఏం చూశావ్.. ముందుంది అసలు పండగ అంటాడు రాజ్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X