Brahmamudi Weekly Roundup: కోమాలోంచి బయటపడ్డ అపర్ణ .. కావ్యకి వెలకట్టిన రాజ్, అనామిక ట్రాప్‌లో కళావతి

ఆసుపత్రిలో కోమా నుంచి అపర్ణ బయటపడటంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. కానీ ఆవిడని జాగ్రత్తగా తీసుకోకుంటే మళ్లీ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ షాకింగ్ న్యూస్ చెబుతుంది. ఇంటికొచ్చిన దగ్గరి నుంచి కావ్య కనిపించకపోవడంతో అపర్ణ అందరినీ నిలదీస్తుంది. దీంతో రాజ్ వల్లే కావ్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని రుద్రాణి చెబుతుంది. మధ్యలో స్వప్న కలగజేసుకుని జరిగినదంతా చెబుతుంది. కావ్యను ఇంటికి తీసుకురావడానికి సీతారామయ్య, ఇందిరా దేవి వెళ్లినా కళావతి మెట్టుదిగదు. తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్ స్వయంగా కావ్య దగ్గరికి వెళ్లి తిరిగి ఇంటికి రమ్మని బ్రతిమలాడతాడు, ఆమె వినకపోయే సరికి బ్లాంక్ చెక్ ఇచ్చి కోడలిగా నటించమంటాడు. దీంతో కావ్య తన ఇంట్లో నగలు తీసుకొచ్చి ఇవి తీసుకుని అల్లుడిగా నటించమంటూ రివర్స్‌లో కౌంటరిస్తుంది. అనామిక కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో అప్పూ, కళ్యాణ్ ముందు ప్రత్యక్షమై.. దుగ్గిరాల కంపెనీని నాశనం చేస్తానని చెబుతుంది. పనిమనిషి శాంత వండిన వంట తిని రాజ్ షాక్ అవుతాడు. అనామికను తీసుకుని ఆఫీస్‌కు తీసుకెళ్లి తన చైర్‌లో కూర్చోబెట్టి.. దుగ్గిరాల కంపెనీని పడగొట్టే ప్లాన్స్ వేస్తోంది. కావ్య డిజైన్స్ వల్లే రాజ్ కంపెనీ టాప్ ఉందని, ఇప్పుడు ఆమెను మనవైపు తిప్పుకోవాలని సామంత్‌తో అనామిక చెబుతుంది.

సెప్టెంబర్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు.. 516 ఎపిసోడ్ నుంచి 521 వరకు ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 16వ తేదీ 516 ఎపిసోడ్‌లో కోమాలోంచి బయటికొచ్చిన అపర్ణకు కావ్య గురించి ఇంటి గుమ్మం దగ్గరే రాజ్ అబద్ధం చెబుతాడు. గుడికి వెళ్లిందని వచ్చేస్తుందని చెబుతాడు.. సాయంత్రమైనా కోడలు ఇంటికి రాకపోయేసరికి అపర్ణ ఇంట్లో వాళ్లని నిలదీస్తుంది. నీ వల్లే వెళ్లిపోయిందా అంటూ రుద్రాణిపై అపర్ణ భగ్గుమంటుంది. నీ కోడలు వెళ్లిపోవడం వెనుక నా హస్తం ఏం లేదని రాజ్ వల్లే కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని రుద్రాణి షాకింగ్ న్యూస్ చెబుతుంది. మధ్యలో స్వప్న కలగజేసుకుని జరిగినదంతా అపర్ణకి వివరిస్తుంది. మా అత్త అగ్నికి ఆజ్యం పోస్తే.. మీ అబ్బాయి కావ్య మనసుని ముక్కలు చేశాడని చెబుతుంది. తానే కావ్యని కంపెనీకి వెళ్లమన్నానని.. ఇందులో ఆమె తప్పేం లేదని అపర్ణ చెప్పడంతో రాజ్ సహా ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup September 16th to September 21st episode Story

సెప్టెంబర్ 17వ తేదీ 517 ఎపిసోడ్‌లో రాజ్ వల్లే కావ్య వెళ్లిపోయినట్లు నిజం తెలుసుకున్న అపర్ణ కొడుకుపై మండిపడుతుంది. తన కోడలు నిప్పని, తప్పు చేసింది నువ్వే కాబట్టి .. నువ్వే వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకురావాలని రాజ్‌ని ఆదేశిస్తుంది.దానిని జన్మలో క్షమించనని రాజ్ తేల్చిచెబుతాడు. తానే వెళ్లి కోడల్ని తీసుకొస్తానని అపర్ణ బయల్దేరబోతుండగా సీతారామయ్య దంపతులు ఆపి.. వాళ్లే కావ్య ఇంటికి వెళ్తారు. ముసలివాళ్లిద్దరిని ఎందుకు ఆపలేదని రాహుల్ తల్లిని అడుగుతాడు. నువ్వేం టెన్షన్ పడొద్దు.. కావ్య లాంటి ఆత్మాభిమానం ఉన్న ఆడవాళ్లు అస్సలు ఇంటికి రారని కొడుక్కి చెబుతుంది రుద్రాణి. గుమ్మంలో సీతారామయ్య, ఇందిరలను చూసిన కనకం షాకై కావ్య, కృష్ణమూర్తిలను పిలుస్తుంది. నువ్వు ఇంటికి రావాలని పెద్దవాళ్లిద్దరూ కావ్యను అడగ్గా.. తాను ఇంటికొస్తే నా స్థానమేంటని పెద్దవాళ్లు ఇద్దరినీ కావ్య ప్రశ్నిస్తుంది. ఇక్కడికి రావాల్సింది మేము, మీ అత్తయ్య కాదని, తప్పు చేసిన నీ భర్త అని, అతనే ఇక్కడికొచ్చి నిన్ను తీసుకెళ్తాడని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు.

సెప్టెంబర్ 18వ తేదీ 518 ఎపిసోడ్‌లో కనకం ఇంటికెళ్లిన సీతారామయ్య దంపతులు వట్టి చేతులతో ఇంటికి తిరిగి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్య ఏదని రాజ్ అడగ్గా.. రాలేదని, ఎవ్వరూ వెళ్లినా ఆమె రాదని, నువ్వే వెళ్లాలని చెబుతారు. ముసలివాళ్లు రాజ్‌ని రెచ్చగొట్టి ఎక్కడ కావ్య దగ్గరికి పంపిస్తారోనని భయపడ్డ రుద్రాణి మధ్యలో జోక్యం చేసుకుంటుంది. అప్పుడు సుభాష్, స్వప్నలు ఆమె నోరుమూయిస్తారు. తాను వెళ్తానని కానీ ఆమె రాకపోతే మాత్రం మరోసారి అడగొద్దని చెప్పి కళావతి ఇంటికి బయల్దేరతాడు రాజ్. కావ్య ఎక్కడ వచ్చేస్తుందోనని, రుద్రాణి - రాహుల్‌లు ప్లాన్ వేయగా స్వప్న తిప్పికొడుతుంది. అక్కడ మీ అమ్మగారు చెబితే వచ్చారా, మీ తాతయ్య వాళ్లు చెబితే వచ్చారా అని కావ్య ప్రశ్నించగా.. ఎందుకో అందుకు వచ్చి చచ్చానుగా , రావొచ్చుగా అంటాడు రాజ్. చచ్చే వచ్చాను, మళ్లీ వచ్చి , మళ్లీ చచ్చేంత ఓపిక నాకు లేదని తేల్చిచెబుతుంది. నీకు నాకు ఏం సంబంధం లేదని తేల్చిచెబుతుంది. నేను జీవితంలో మీ ఇంటి గడప తొక్కనని అంటుంది.

సెప్టెంబర్ 19వ తేదీ 519 ఎపిసోడ్‌లో కావ్య అన్న మాటలకి రాజ్‌కి కోపం వచ్చి వెనక్కి వెళ్లిపోతాడు. దీంతో కావ్యపై కనకం కోప్పడి నువ్వయినా తగ్గొచ్చుగా అని చెబుతుంది. కారు దగ్గరికి వెళ్లిన రాజ్ మళ్లీ తిరిగొచ్చి.. చెక్ బుక్ బయటికి తీసి.. నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించడానికి నీకెంత కావాలని అడుగుతాడు. ఆ మాటతో కావ్య, కనకం షాక్ అవుతారు. వెంటనే కావ్య లోపలికి వెళ్లి ఓ సంచిలో బంగారు నగలు తీసుకొచ్చి వీటి విలువ రూ.5 లక్షల పైనే ఉంటుందని ఇవి తీసుకుని మా ఇంట్లో అల్లుడిగా నటించాలని రివర్స్‌లో షాకిస్తుంది. మా అమ్మ కోసం 100 మెట్లు దిగొచ్చానని, ఇక జీవితంలో ఒక్క మెట్టు కూడా దిగనని రాజ్ తేల్చిచెబుతాడు. నా ప్రయత్నం నేను చేశానని, మళ్లీ నన్ను ఇబ్బంది పెట్టొద్దని కుటుంబ సభ్యులకు తేల్చిచెబుతాడు రాజ్. కావ్య ఇంటికి రాజ్ వెళ్లిన విషయాన్ని అప్పూకి కళ్యాణ్ చెప్పగా ఆమె చాలా సంతోషపడుతుంది. ఇంతలో ఇంటి ఓనర్ వచ్చి అద్దె అడగటంతో రెండ్రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పి పంపిస్తాడు కళ్యాణ్.

Brahmamudi Telugu Serial Weekly roundup September 16th to September 21st episode Story

సెప్టెంబర్ 20వ తేదీ 520వ ఎపిసోడ్‌లో రాజ్ ఒంటరిగా ఆలోచిస్తుండగా ఆత్మారామ్ బయటికొచ్చి క్లాస్ పీకుతాడు. ఇంటి దగ్గర తమ పెళ్లి ఫోటోను చూసుకుని కావ్య బాధపడుతుంది, కనకం అది చూసి ఆమెను పిలుస్తుంది. పొద్దున్నే కావ్య కాఫీ కప్పుతో తన బెడ్‌రూమ్‌లో ఉండేసరికి రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో పని మనిషి వచ్చి కాఫీ అంటుంది. రాజ్ నిద్రలోంచి ఉలిక్కిపడి కలగన్నట్లుగా తెలుసుకుంటాడు. కళ్యాణ్ , అప్పూ షాపింగ్ చేసి ఇంటికి వస్తుండగా.. అనామిక తన బాయ్‌ఫ్రెండ్‌ సామంత్‌తో వాళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఇతను తన ఫియాన్సే అని, పెద్ద జ్యువెలరీ సంస్థ యజమాని అని చెబుతుంది. త్వరలోనే దుగ్గిరాల వారి కంపెనీని పడగొట్టి ఎదురులేని సంస్థగా సామంత్ కంపెనీ ఎదుగుతుందని అంటుంది అనామిక. ఆ మాటతో అప్పూ, కళ్యాణ్ పడిపడి నవ్వుతారు. దుగ్గిరాల వారిపై పగ తీర్చుకోవడానికి నిన్ను పట్టిందని సామంత్‌కి అప్పూ చెబుతుంది.

సెప్టెంబర్ 21వ తేదీ 521వ ఎపిసోడ్‌లో అనామిక గురించి సామంత్‌కి వార్నింగ్ ఇస్తుంది అప్పూ . ఇంతలో కావ్య తప్ప ఎవరూ బాగా వంట చేయలేరా , పనిమనిషి శాంతతో వంట చేయిస్తానని చెప్పగా ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. కృష్ణమూర్తికి విగ్రహాలు తయారు చేయడంలో సాయం చేస్తుంది కావ్య. అది చూసి కనకం కోప్పడుతుంది. కూతురు ఏం చేసినా గంగిరెద్దులా తలూపుతావ్ అంటూ కృష్ణమూర్తిని తిడుతుంది. శాంత వంట చేసి అన్ని సిద్ధం చేసి వడ్డించబోగా.. మాకు వద్దంటే వద్దంటారు కుటుంబ సభ్యులు. ముద్ద నోట్లో పెట్టగానే రాజ్ ఓ గ్లాస్ నీళ్లు గటగటా తాగేస్తాడు. ఆ రోజు అద్భుతంగా వంట చేశావ్, ఈరోజేంటీ ఇలా చేశావ్ అని శాంతను ప్రశ్నిస్తాడు. ఆ రోజు వంట చేసింది శాంత కాదు, కావ్య చేసిందని అపర్ణ అసలు నిజం చెబుతుంది. అనామికను తీసుకుని సామంత్ కంపెనీకి వచ్చి, ఛైర్మన్ సీట్లో కూర్చోబెడతాడు. రాజ్‌ కంపెనీని ఎలా పడగొట్టాలని ఆలోచిస్తూ.. కావ్యని డిజైనర్‌గా చేర్చుకోవాలని చెప్పి సందీప్‌కు ఎర వేయాలని మేనేజర్‌కు చెబుతుంది అనామిక. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X