Brahmamudi Weekly Roundup: తిరిగి ఎండీగా రాజ్.. అనామిక ట్రాప్‌లో కావ్య, కళావతి నిజం తెలుసుకుంటుందా?

తండ్రితో కలిసి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తుంది కావ్య. ఈసారి వినాయక చవితి పూజను రాజ్ చేతుల మీదుగా జరిపించాలని దుగ్గిరాల ఫ్యామిలీ నిర్ణయిస్తుంది. షాప్‌కి వెళ్లి కావ్య తయారు చేసిన బొమ్మనే కొంటాడు రాజ్. ఇంట్లో వాళ్ల కోసం కావ్య చీరను పక్కనపెట్టుకుని పూజ చేస్తాడు రాజ్. వియ్యపురాలిని పరామర్శించేందుకు అప్పుడే కనకం అక్కడికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. తన కూతురు తయారు చేసిన వినాయకుడే ఈ ఇంటికి వచ్చినప్పుడు కావ్య రాకుండా ఎవరూ ఆపలేరని కనకం చెబుతుంది. కావ్యకి సామంత్ కంపెనీలో ఉద్యోగం దొరికేలా అనామిక చక్రం తిప్పుతుంది. రాహుల్ ఎండీగా ఉన్నప్పుడు సీతారామయ్య మనవడిని అవమానించి పంపడంతో అతను స్వరాజ్ గ్రూప్‌తో తెగదెంపులు చేసుకుంటాడు. ఈ విషయం తెలిసి దుగ్గిరాల ఫ్యామిలీ రాహుల్‌పై మండిపడుతుంది. దీంతో రాజ్‌ని ఎండీగా నియమిస్తూ సీతారామయ్య నిర్ణయం తీసుకుంటాడు. అటు అప్పూని పోలీస్ ట్రైనింగ్‌కి పంపాలని డిసైడ్ అయిన కళ్యాణ్ ఆ ఏర్పాట్లలో ఉంటాడు. సామంత్ - రాజ్‌లు ఎదురుపడి ఈసారి ఎక్స్‌పోలో గెలుస్తామని పరస్పరం సవాళ్లు విసురుకుంటారు. రాహుల్ కంపెనీ వ్యవహారాలను చూసినప్పుడు రూ.12 కోట్ల నష్టం వచ్చిందని రాజ్ చెబుతాడు. ఎక్స్‌పోకి కావాల్సిన డిజైన్ల కోసం కావ్య ట్రై చేస్తుండగా ఆమెకు రాజ్ గుర్తొస్తాడు, రాజ్ కూడా పేపర్‌లపై కళావతి పేరే రాస్తాడు.

సెప్టెంబర్ 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు.. 522 ఎపిసోడ్ నుంచి 527 వరకు ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 23వ తేదీ 522వ ఎపిసోడ్‌లో ... వినాయక చవితి కావడంతో ఇంట్లో సమస్యలు పోవడానికి ఈసారి రాజ్ చేతుల మీదుగా పూజ చేయించాలని సీతారామయ్య - ఇందిరలు నిర్ణయిస్తారు. ఇక వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తానని కూర్చొన్న అప్పూ.. చేయలేక తంటాలు పడుతుంది. ఇంతలో బంటి వచ్చి పెదనాన్న విగ్రహం పంపాడని చెబుతాడు. తండ్రితో కలిసి చేసిన విగ్రహాలను కావ్య డెలివరీ ఇస్తుంటుంది. తాను ఎంతో ఇష్టంగా చేసిన విగ్రహాన్ని చూసుకుని బై బై చెబుతుంది. సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్న కావ్యని రాజ్ కారుతో గుద్ధగా.. ఇద్దరి మధ్యా పెద్ద గొడవ అవుతుంది. దీంతో నువ్వు మా ఇంటికి ఎప్పటికీ రావొద్దు.. మా గడప తొక్కొద్దని రాజ్ తెగేసి చెబుతాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup September 23rd to September 28th episode Story

సెప్టెంబర్ 24వ తేదీ 523వ ఎపిసోడ్‌లో ... కావ్యతో గొడవపడిన అనంతరం రాజ్ వినాయకుడి విగ్రహాన్ని కొనడానికి వెళ్తాడు. అక్కడ చాలా బొమ్మలు కనిపిస్తాయి.. వాటిలో ఏ బొమ్మ కొనాలో తెలియక తికమక పడతాడు. ఇంతలో కావ్య తయారు చేసిన విగ్రహంపై రాజ్ చూపు పడి దానిని కొంటానని చెబుతాడు. ఇంతలో షాపువాడు వచ్చి అది వేరొకరు స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారని చెబుతాడు. రాజ్ అతనితో గొడవపడి రూ.10 వేలకు ఆ విగ్రహాన్ని కొనేస్తాడు. చవితి పూజకి అంతా సిద్ధం చేయగా.. ఇంట్లోవాళ్లు కావ్యకి ఫోన్ చేసి రాజ్‌ని పిలవమంటారు. తన వల్ల కాదని తేల్చిచెప్పగా.. రామాయణంలో శ్రీరామచంద్రుడు బంగారు సీతను పక్కనపెట్టుకున్నట్లుగా కావ్య చీరని పక్కన పెట్టుకుని పూజ చేయమని చెబుతారు. అప్పూకి పండగపూట గిఫ్ట్ ఇస్తాడు కళ్యాణ్.. అది తీసి చూడగా పోలీస్ యూనిఫాం. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్‌కి వెళ్లి, నీ ఆశయం నెరవేర్చుకోవాలని మిగతాదంతా నేను చూసుకుంటానని చెబుతాడు. పూజ ముగిసి అందరూ ప్రసాదం తీసుకుంటుండగా.. దుగ్గిరాల వారింటికి కనకం వస్తుంది.

సెప్టెంబర్ 25వ తేదీ 524వ ఎపిసోడ్‌లో ... వినాయక చవితి పూజ ముగియగానే ఇంట్లో ప్రత్యక్షమైన కనకాన్ని చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. స్వామికి దండం పెట్టుకున్న ఆమెకు రాజ్ ప్రసాదం ఇస్తాడు. అసలు నువ్వెందుకొచ్చావ్ అని ఆమెను రుద్రాణి నిలదీయగా.. ఇంట్లో వాళ్లు భగ్గుమంటారు. ఎంత సైలెంట్‌గా ఉందామన్నా రెచ్చగొట్టడంతో రుద్రాణిని కడిగి పారేస్తుంది కనకం. తన కూతుళ్ల గురించి దేవుడే చూసుకుంటాడన్న నమ్మకం బాగా వచ్చిందని కనకం చెబుతుంది. కావ్య చేసిన వినాయకుడి విగ్రహమే ఇంటికొచ్చిందని.. నా కూతురు రాదా అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అనామిక - సామంత్ వేసిన ప్లాన్ ప్రకారం మేనేజర్ .. కావ్యకి కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగం ఇస్తాడు. రాహుల్ తన మనవడిని అవమానించి పంపించాడని సీతారామయ్య ఫ్రెండ్ దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతాడు.

సెప్టెంబర్ 26వ తేదీ 525వ ఎపిసోడ్‌లో ... సీతారామయ్య ఫ్రెండ్ మనవడిని రాహుల్ అవమానించడం వల్ల అతను స్వరాజ్ కంపెనీతో తెగదెంపులు చేసుకుంటాడు. అంతేకాదు పెద్ద కాంట్రాక్ట్ ఆ సామంత్ కంపెనీ దక్కించుకుందని దుగ్గిరాల ఫ్యామిలీకి తెలుస్తుంది. కావ్య ఎంతగా చెబుతున్నా వినకుండ తాను తప్పు చేశానని, ఇకపై స్వరాజ్ గ్రూప్‌కి రాజ్ ఎండీగా ఉంటాడని సీతారామయ్య తన నిర్ణయాన్ని చెబుతాడు. ఇంట్లోవాళ్లంతా ఆయన నిర్ణయానికి సంతోషిస్తారు. అయితే రాజ్ మాత్రం ధాన్యలక్ష్మీ అంగీకారిస్తేనే బాధ్యతలు తీసుకుంటానని చెబుతాడు. ఎక్కడ అంతా కలిసి కొడుక్కి చీవాట్లు పెడతారోనని రుద్రాణి ముందుగానే రాహుల్‌ని తిడుతుంది. నేను రూ.10 లక్షల లంచం అడిగితే ఇవ్వలేదని రుద్రాణితో రాహుల్ చెబుతుండగా స్వప్న విని కడిగిపారేస్తుంది. రాజ్ తిరిగి ఎండీగా బాధ్యతలు స్వీకరించిబోతున్నట్లు కృష్ణమూర్తికి, కావ్యకి కనకం చెబుతుంది. అప్పూ పోలీస్ ట్రైనింగ్ కోసం సరిగా ప్రిపేర్ అవ్వడం లేదని తెలుసుకున్న కళ్యాణ్.. ఆమెను కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయాలనుకుంటాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup September 23rd to September 28th episode Story

సెప్టెంబర్ 27వ తేదీ 526వ ఎపిసోడ్‌లో ... స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి తిరిగి ఎండీగా రాజ్, సామంత్ కంపెనీలో డిజైనర్‌గా కావ్య ఒకేరోజు తమ కొత్త ప్రయాణం మొదలుపెడతారు. ఇద్దరూ భగవంతుడి ఆశీస్సుల కోసం గుడికి వచ్చి గంట కొట్టడానికి గొడవపడతారు. తన భర్త గురించి కావ్య చెప్పినదంతా నిజం అనుకుని పూజారి రాజ్‌ని తిడతాడు. దర్శనం అనంతరం రాజ్ అరటి తొక్కపై కాలు వేసి పడిపోతుండగా కావ్య పట్టుకుంటుంది. ఇదంతా నీ స్కెచ్ కదా అని రాజ్ అనడంతో కళావతి కోపమొచ్చి అతనిని కింద పడేస్తుంది. మరోవైపు ఆఫీస్‌లో బాస్ లేకపోవడంతో స్వరాజ్ కంపెనీలో స్టాఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడి వాతావరణం చూసి రాజ్ షాక్ అవుతాడు. అందరిని కాన్ఫరెన్స్ రూమ్‌కి పిలిపించి ఉద్యోగంలో నుంచి పీకేస్తానని వార్నింగ్ ఇస్తాడు.

సెప్టెంబర్ 28వ తేదీ 527వ ఎపిసోడ్‌లో ... ఆఫీస్‌లో స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇచ్చిన రాజ్ త్వరలో జరగనున్న ఎక్స్‌పో కోసం డిజైన్లు రెడీ చేయాల్సిందిగా డెడ్‌లైన్ పెడతాడు. ఇంతలో రాజ్- సామంత్‌లు ఎదురుపడతారు. ఈసారి ఎక్స్‌పోలో తానే గెలుస్తానని రాజ్‌కి సామంత్ సవాల్ విసురుతాడు. కంపెనీని పట్టించుకోకపోవడంతో ఈసారి ఏకంగా రూ.12 కోట్ల నష్టం వచ్చిందని రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతాడు. తన కొడుకుని మళ్లీ తిడతారేమోనని భయపడ్డ రుద్రాణి ముందే రంకెలు వేస్తుంది. కావ్య డిజైన్లు వేస్తేనే ఎక్స్‌పోలో కంపెనీకి అవార్డ్ వస్తుందని సుభాష్ చెప్పగా రాజ్ ఫైర్ అవుతాడు. మరోవైపు కావ్య తన కంపెనీ కోసం డిజైన్లు వేస్తుండగా భర్త జ్ఞాపకాలు ఆమెను వెంటాడతాయి. రాజ్ కూడా పేపర్లపై ఏదో రాస్తుండగా ఇందిర అక్కడికొచ్చి పేపర్‌పై ఉన్నది చూసి షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X