Brahmamudi Weekly Roundup: రాహుల్ ని అరెస్టు చేసిన పోలీసులు.. కళ్యాణ్ ని అవమానించిన ధాన్యలక్ష్మి!

దొంగ బంగారం వ్యాపారంలో రాజ్ ని ఇరికించాలనుకుంటారు తల్లీ కొడుకులు, కానీ కావ్య సాక్షాదారాలతో రాహుల్ తప్పు చేశాడని నిరూపించడంతో అతడిని అరెస్టు చేస్తారు. కొడుకుని విడిపించమని ఇంట్లో వాళ్ళందరినీ బ్రతిమాలుతుంది ఈ రుద్రాణి కానీ ఎవరు హెల్ప్ చేయకపోవడంతో ఇంట్లో వాళ్ళందరి మీద పగ పెంచుకుంటుంది. తర్వాత రాహుల్ నేరం చేయలేదని పోలీసులు అతడిని విడిచిపెడతారు. ఇదంతా ఎలా అని అడుగుతుంది రుద్రాణి. పొరపాటు జరిగితే ఏం చేయాలో ముందే ఆలోచించాను నా ప్లేస్ లో వేరే వ్యక్తిని ముందే సెట్ చేశాను అని చెప్తాడు రాహుల్. తనకి హెల్ప్ చేయలేదు అని రుద్రాణి పోలీసులకి అనవసరంగా పట్టించిందని రాహుల్ ఇంట్లో వాళ్ళందరి మీద పగ పెంచుకుంటారు తర్వాత కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాలకి అపర్ణ ఇంట్లోనే ఉంటుందని, ఆమెకి తోడుగా కావ్య ఉంటుందని తెలుసుకొని ఆ పనిని చంపటానికి కుట్ర పన్నుతారు రాహుల్ రుద్రాణి. మన వైపు గుడిలో జరిగే అన్నదానానికి రాజ్ బలవంతంగా కళ్యాణ్ వాళ్ళని తీసుకురావడంతో వాళ్లని అవమానిస్తుంది ధాన్యలక్ష్మి

సెప్టెంబర్ 2 వ తేదీ నుంచి సెప్టెంబర్ 7 తేదీ వరకు.. 504 ఎపిసోడ్ నుంచి 509 వరకు ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 2 వ తేదీ 504 ఎపిసోడ్‌లో కళ్యాణి వ్యక్తిగతంగా ప్రపంచానికి పరిచయం చేసుకొని జీవితంలో ఎదగమని అతడిని మోటివేట్ చేసి పంపిస్తుంది కావ్య. మరోవైపు అపర్ణకి చాతి నొప్పి ప్రారంభం అవుతుంది. సుభాష్ ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చిన డాక్టర్ ఆమెకి ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్లు వేసుకోవటం లేదని తెలిసి ఆమెని మందలించి, అదే విషయం ఇంట్లో వాళ్లకి కూడా చెప్పి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు ఆమెని సరిగ్గా చూసుకోవటం లేదు అని కావ్యని దెప్పుతుంది రుద్రాణి. ఇంట్లో వాళ్ళందరూ రుద్రాణిని మందలిస్తారు. మరోవైపు ఆటో డ్రైవర్ గా చేస్తున్నాను అని చెప్పకుండా ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి అప్పుకి డబ్బులు ఇస్తాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ ఇంటికి పోలీసులు ఇంటికి వచ్చి మీ కంపెనీకి సంబంధించిన దొంగ బంగారం దొరికిందని రాజుని అరెస్టు చేయాలని అంటారు. ఇంట్లో వాళ్ళందరూ రాహులే ఆ తప్పు చేశాడు అంటారు. కానీ నైతిక బాధ్యత తీసుకున్న రాజ్ అరెస్ట్ అవ్వటానికి సిద్ధమవుతాడు

Brahmamudi Telugu Serial September 2nd to September 7th weekly roundup Episode 504 to 509 Episode

సెప్టెంబర్ 3 తేదీ 505 ఎపిసోడ్‌లో పోలీసులు రాజ్ ని అరెస్టు చేసి తీసుకు వెళ్తుంటే అప్పుడే ఇంటికి వచ్చిన కావ్య సాక్ష్యాధారాలు చూపించి రాహుల్ ని అరెస్టు చేయిస్తుంది. నా కొడుకు మీద నిందలు వేస్తుంది అని రుద్రాణి కోప్పడుతుంది కానీ అపర్ణ రుద్రాణి కి చివాట్లు పెడుతుంది. సాక్షాధారాలు ఎలా సంపాదించావు అని రాజ్ అడిగితే శ్రుతి విషయం చెప్తుంది కావ్య. మరోవైపు వంట రాక ఏదో చేయాలనుకుని ఏదో చేసిన కళ్యాణ్ నాకన్నా ఘోరంగా వంట చేస్తున్నావు అని నవ్వుతుంది అప్పు. రాహుల్ ని అరెస్టు చేయించినందుకు కావ్య పై కోప్పడతాడు రాజ్. కొడుకుని విడిపించమని అడగడానికి తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది రుద్రాణి.

సెప్టెంబర్ 4 వ తేదీ 506 ఎపిసోడ్ లో తన కొడుకుని విడిపించమని తల్లిదండ్రులని అడుగుతుంది రుద్రాణి అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో రాజ్ దగ్గరికి వెళ్లి బ్రతిమాలుతుంది. అపర్ణ వచ్చి రుద్రా ణికి చివాట్లు పెట్టి రాజ్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పోలీసులు ఇంటికి వచ్చి రాహుల్ ఏ తప్పు చేయలేదు అని అతడిని ఇంట్లో వదిలి వెళ్ళిపోతారు. చూశారా నా కొడుకు ఏ తప్పు చేయలేదు, మీరందరూ నా కొడుకుని ఎన్ని మాటలు అన్నారు అంటూ ఇంట్లో వాళ్ళందరి మీద విరుచుకుపడుతుంది రుద్రాణి.

Brahmamudi Telugu Serial September 2nd to September 7th weekly roundup Episode 504 to 509 Episode

సెప్టెంబర్ 5 వ తేదీ 507 ఎపిసోడ్ లో తనపై కూడా విరుచుకుపడుతున్న రుద్రాణి పై కావ్య కేకలు వేస్తుంది అయితే రాజ్ ఆమెని మందలించే మా అత్త స్థాయిని దిగజార్చే అర్హత నీకు లేదు అంటూ రుద్రాణి కి రాహుల్ కి క్షమాపణ చెప్తాడు. కానీ రాహుల్ మాత్రం జరిగింది మరిచిపోలేను కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇల్లు ముక్కలైపోకుండా ఉమ్మడిగా ఉంచేలా రాజ్ దగ్గర మాట తీసుకుంటాడు సీతారామయ్య. మరోవైపు తను జైలు నుంచి ఎలా బయటపడింది తల్లికి వివరంగా చెప్తాడు రాహుల్. తనకోసం పాలు తెచ్చిన కావ్యతో ఇంటి వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు ఇల్లు ముక్కలైపోతే తాతయ్య భరించలేడు అంటాడు రాజ్. అయినా కావ్య వినిపించుకోకపోవడంతో అయితే ఏం చేసినా చెప్పి చెయ్యు అది నీ బాధ్యత అంటాడు. మరోవైపు అర్ధరాత్రి అప్పు కనిపించకపోవడంతో కంగారుపడతాడు కళ్యాణ్ అంతలోనే డ్యూటీ నుంచి వచ్చిన అప్పుని ఎందుకు డ్యూటీ కి వెళ్లావు అంటూ మందలిస్తాడు అయితే అప్పు కళ్యాణుని తీసుకొని డాబా మీదకి వెళ్లి ఈరోజు నీ బర్త్డే అని చెప్పి కేకు కోయిస్తుంది, కవితలు రాసుకోమని చెప్పి కళ్యాణ్ కి పేపర్ బండిల్స్ పెన్స్ గిఫ్ట్ గా ఇస్తుంది.

సెప్టెంబర్ 6 వ తేదీ 508 ఎపిసోడ్‌లో తన పుట్టినరోజుకి ఇంట్లో వాళ్ళందరూ ప్రతి సంవత్సరం గుడిలో అన్నదానం చేసేవారు అంటాడు కళ్యాణ్ దాందేముంది మనం కూడా వెళదాము అంటుంది అప్పు. మరోవైపు తన కొడుకు పుట్టినరోజుని అందరూ మరిచిపోయారు అని నిష్టూరంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి కానీ అందరూ కళ్యాణ్ పుట్టినరోజు ఏర్పాట్లు చేసేసి రెడీగా ఉంటారు. ధాన్యలక్ష్మికి అదే విషయం చెప్పి అందరం కలిసి గుడికి వెళ్దాం అంటుంది ఇందిరా దేవి. నాకు ఒంట్లో బాగోలేదు నేను ఇంట్లోనే ఉంటాను అంటుంది అపర్ణ ఆమెకి తోడుగా కావ్య ఉంటాను అంటుంది. అదే సమయంలో రాహుల్ తల్లితో మాట్లాడుతూ కావ్యని ఇంటి నుంచి తరిమియటానికి ఇదే సమయం అని చెప్పి అపర్ణని చంపటానికి టాబ్లెట్లు మార్చేయమని తల్లితో చెప్తాడు రుద్రాణి అలాగే చేస్తుంది. మరోవైపు గుడిలో పూజ చేయించుకున్న తర్వాత నా పుట్టినరోజుని అందరూ మర్చిపోయారు అని బాధపడుతున్న కళ్యాణ్తో అప్పుడే గుడ్ లోకి వస్తున్న వాళ్ళ కుటుంబాన్ని చూపించి నిన్ను ఎవరు మర్చిపోలేదు అంటుంది అప్పు. రాహుల్ తన మనిషితో మాట్లాడుతూ కావ్య తో ఏం మాట్లాడాలో వివరిస్తాడు. మరోవైపు కావ్య వద్దంటున్నా వినకుండా వంటలో సాయం చేస్తుంది అపర్ణ.

Brahmamudi Telugu Serial September 2nd to September 7th weekly roundup Episode 504 to 509 Episode

సెప్టెంబర్ 7 th వ తేదీ 509 ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యులందరూ గుడిలో పూజలు చేస్తుంటే దొంగ చాటుగా చూస్తూ ఉంటారు కళ్యాణ్ దంపతులు వాళ్ళని చూసిన రాజ్ కళ్యాణ్ దంపతులు గొడవలు అవుతాయి వద్దు అని చెప్తున్నా వినకుండా కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మరోవైపు ఆఫీస్ నుంచి ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అని కావ్యకి ఫోన్ వస్తుంది అదే విషయం అపర్ణకి చెప్తే నేను రాజ్ కి ఫోన్ చేస్తాను నువ్వు ఆఫీస్ కి వెళ్ళు అని చెప్పటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు కళ్యాణ్ దంపతులను చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు ధాన్యలక్ష్మి మాత్రం వస్తే కొడుకు ఒక్కడే రావాలి లేదంటే వద్దు, పిలవకుండానే భోజనానికి వచ్చాడు అని అనటంతో ఆమెని అందరూ మందలిస్తారు. అప్పుడు రాజ్ నేను ఈ అన్నదానానికి నా మరదలిని ఆమె భర్తని భోజనానికి పిలిచాను మా అందరికీ నువ్వే వడ్డించు పిన్ని అనటంతో ఇష్టం లేకపోయినా వాళ్ళకి వడ్డానం చేస్తుంది దాని లక్ష్మి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X