Brahmamudi Weekly Roundup: అనామిక కుట్రకు బలైన కావ్య.. రాజ్‌ను ఓడించిన సామంత్, కళావతి స్టెప్ ఏంటీ?
ఆఫీస్‌లో స్టాఫ్ సరిగా డిజైన్లు ఇవ్వలేకపోవడంతో తానే రంగంలోకి దిగుతాడు రాజ్. కావ్యకి ఏకాగ్రత కుదరకపోవడంతో కనకం క్లాస్ పీకుతుంది. పేపర్‌పై కళాకృతి అని రాసిన మనవడికి ఇందిర మొట్టికాయలు వేస్తుంది. కావ్య డిజైన్లు తీసుకుని నేరుగా సామంత్ ఆఫీస్‌కు వస్తుంది. ఆమెను చూడగానే సామంత్- అనామికలు టేబుల్ కింద దాక్కొంటారు. అనంతరం మేనేజర్‌కి తాను గీసిన డిజైన్లను ఇస్తుంది కావ్య. ఎక్స్‌పోలో కావ్య చేతే దుగ్గిరాల ఫ్యామిలీని దెబ్బ కొడతానని రుద్రాణికి అనామిక చెబుతుంది. ఎక్స్‌పోలో కావ్యకి రాజ్ అతని ఫ్యామిలీ ఎదురుపడతారు. తనను నానా మాటలు అన్న రుద్రాణికి కౌంటర్ ఇస్తుంది కళావతి. లోపలికి వెళ్తుండగా అనామిక- సామంత్‌లు రాజ్‌కు ఎదురవుతారు. పదేళ్లుగా స్వరాజ్ కంపెనీ గెలుచుకుంటున్న అవార్డ్ ఈసారి సామంత్ కంపెనీకి వస్తుంది . దీంతో రాజ్, కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు. అవార్డ్‌ను కావ్యకే ఇప్పిస్తారు సామంత్ - అనామిక. గుమ్మం బయట ఏడుస్తున్న కావ్యని రాజ్ నానా మాటలు అంటాడు. కావ్య పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదన్న రాజ్ ఆమె వస్తువులను తగులబెట్టడానికి ప్రయత్నిస్తాడు. రాజ్ - కావ్యల మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో డ్యాన్స్ చేస్తున్న రుద్రాణిని దుప్పటి ముసుగేసి కొడుతుంది స్వప్న.
సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు.. 528 ఎపిసోడ్ నుంచి 533 వరకు ఏం జరిగిందంటే?
సెప్టెంబర్ 30వ తేదీ 528వ ఎపిసోడ్‌లో ... కావ్య తన కంపెనీ కోసం డిజైన్లు వేస్తుండగా భర్తతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి ఆమెకు ఏకాగ్రత కుదరదు. అది గమనించిన కనకం కూతురి దగ్గరికొచ్చి నువ్వు మైండ్‌లో ఏం అనుకుంటున్నావో అదే పేపర్ ఉందని చెబుతుంది. అటు రాజ్ కూడా పేపర్లపై ఏదో రాస్తుండగా ఇందిర అక్కడికొచ్చి పేపర్‌పై ఉన్నది చూసి షాక్ అవుతుంది. కళాకృతికి బదులు కళావతి అని రాశావని మొట్టికాయలు వేస్తుంది. ఉదయాన్నే కావ్య డిజైన్లు తీసుకుని తన గదిలోకి వస్తుండటం చూసిన సామంత్- అనామికలు టేబుల్ కింద దాక్కుంటారు. కంపెనీకి ఛైర్మన్ అయ్యుండి చీప్‌గా దాక్కోవాల్సి వచ్చిందని సామంత్ బాధపడుతుండగా అనామిక ఓదారుస్తుంది. తర్వాత మేనేజర్ కావ్య తీసుకొచ్చిన డిజైన్లను సామంత్‌కి తీసుకొచ్చి ఇస్తాడు.. వాటిని చూసి అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. స్టాఫ్ గీసిచ్చిన డిజైన్లు తనకు ఏమాత్రం నచ్చకపోవడంతో రాజ్ అందరిపై కేకలు వేస్తాడు. కుటుంబాన్ని పోషించడానికి, అప్పూని ఎస్ఐ కోచింగ్‌లో జాయిన్ చేయడానికి కళ్యాణ్ ఆటోడ్రైవర్‌గా మారతాడు. ఈ క్రమంలో భర్తని ఒకడు కొట్టబోతుంటే అప్పూ అతనికి బుద్ధి చెప్పి కళ్యాణ్ ఆటో నడపటంపై మండిపడుతుంది.

అక్టోబర్ 1వ తేదీ 529వ ఎపిసోడ్‌లో ... ఆటో నడుపుకుంటూ ఇంటికొచ్చిన కళ్యాణ్‌పై అప్పూ అలిగి కూర్చోవడంతో అతను ఓదారుస్తాడు. మనిద్దరి భవిష్యత్ కోసమే తాను ఆటో నడుపుతున్నానని, నువ్వు ఎస్ఐ అయిపోగానే ఆపేస్తానని అప్పూకి నచ్చచెబుతాడు కళ్యాణ్. ఇంతలో కావ్యకి సామంత్ మేనేజర్ సురేష్ ఫోన్ చేసి హైదరాబాద్‌లో జరుగుతున్న ఎక్స్‌పోకి రమ్మని ఆహ్వానిస్తాడు. అయితే తాను రానని కావ్య చెప్పడంతో కనకం కోప్పడి కూతురిని రెచ్చగొట్టి ఒప్పిస్తుంది. కావ్య సాయంతో దుగ్గిరాల ఫ్యామిలీని ఎలా దెబ్బకొట్టబోతున్నానో రుద్రాణికి అనామిక చెబుతుంది. ఇదంతా స్వప్న విని.. ఎక్స్‌పోకి తాను కూడా వెళ్లాలని డిసైడ్ అవుతుంది. రుద్రాణి ఎక్స్‌పోకి వస్తానని రాజ్‌తో చెప్పడంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. మరోవైపు.. అనామికను వెంటబెట్టుకుని సామంత్ ఎక్స్‌పోకి వస్తాడు. కావ్యతో డిజైన్లు వేయించినా పోటీలో గెలుస్తామో లేదోనని సామంత్ భయపడుతుంటే అనామిక ధైర్యం చెబుతుంది.
అక్టోబర్ 2వ తేదీ 530వ ఎపిసోడ్‌లో ... ఎక్స్‌పోలో పాల్గొనడానికి రాజ్ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో వస్తాడు. అక్కడ కావ్యని చూసిన రుద్రాణి.. మేం ఎక్కడికెళితే అక్కడకొచ్చి రాజ్ మనసు మార్చాలని అనుకుంటున్నావా అని మండిపడుతుంది. కాపురాలు కూల్చే మీలాంటివాళ్లు ఉండగా నా వల్ల ఏం అవుతుందని రుద్రాణికి కౌంటర్ వేస్తుంది కావ్య. ఇంతలో అనామిక- సామంత్ రాజ్‌కి ఎదురవుతారు. ఇకపై ప్రతి విషయంలోనూ మా కంపెనీ నుంచి నీకు పోటీ తప్పదని రాజ్‌కి వార్నింగ్ ఇస్తాడు సామంత్. ఇక్కడ కొంచెం తనకు ఇబ్బందిగా ఉందని భావించిన కావ్య ఇంటికి వెళ్లిపోతానని సురేష్‌ను అడుగుతుంది. అయితే కావ్యని సామంత్ మేనేజర్ సురేష్ బలవంతంగా ఎక్స్ పోలో ఉండే విధంగా చేస్తాడు. అక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ .. ఎక్స్ పోని లైవ్ చూస్తుంది. అయితే కావ్య ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికి స్వప్న ఆమెను పక్కకి తీసుకెళ్లి వివరాలు కనుక్కుంటుంది.
అక్టోబర్ 3వ తేదీ 531వ ఎపిసోడ్‌లో ... ఎక్స్‌పోలో అవార్డ్ ఎవరికి వస్తుందోనన్న టెన్షన్‌లో రాజ్ , సామంత్‌లు ఉండగా నిర్వాహకులు సామంత్ గ్రూప్‌కి ఈసారి అవార్డ్ దక్కినట్లుగా అనౌన్స్ చేస్తారు. దీంతో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీ, కావ్య షాక్ అవుతారు. సామంత్ స్టేజ్ మీదకు వెళ్లి జీవితంలో మొదటిసారి స్వరాజ్ గ్రూప్‌ను ఓడించి అవార్డ్ సొంతం చేసుకున్నానని అంటాడు. తన విజయానికి అనామిక, కావ్యలే కారణమని చెప్పడంతో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీ మరింత షాక్ అవుతారు. అవార్డ్ కావ్య తీసుకుంటునే బాగుంటుందని చెప్పి ఆమెను స్టేజ్ మీదకి పిలుస్తారు అనామిక- సామంత్. కావ్య ఏడుస్తూ స్టేజ్ నుంచి కిందకి దిగి రాగా.. మీడియా వాళ్లు రకరకాల ప్రశ్నలు వేసి ఆమె మనసు ముక్కలు చేస్తారు.

అక్టోబర్ 4వ తేదీ 532వ ఎపిసోడ్‌లో ... గుమ్మం దగ్గర ఏడుస్తున్న కావ్యని స్వప్నని ఓదారుస్తాడు. కావ్యకు కంగ్రాట్స్ చెప్పి నీ నిజ స్వరూపం బయటపడిందని.. దుగ్గిరాల ఫ్యామిలీ మీద ఇంతగా పగ పెంచుకున్నావా అంటూ రాజ్ నానా మాటలు అంటాడు. నీపై ఏదో మూలన ఉన్న ఇవాళ్టీతో చచ్చిపోయిందని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో సుభాష్ వచ్చి మీ ఇద్దరు ఒక్కటి అవుతారని అనుకున్నామని.. మాకు ఆ ఆశ లేకుండా చేశావని కావ్యతో అంటాడు. బయటికి వెళ్లిపోతున్న కావ్యకి సామంత్ - అనామిక ఎదురవుతారు. మాతో చేతులు కలిపితే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తామని చెబుతారు. ఆ ఇల్లు, రాజ్ నీకు ఏం ఇవ్వలేదని పనిమనిషిలా పనిచేయించుకున్నారని అనామిక అంటుంది. దుగ్గిరాల వారి కంపెనీని భూస్థాపితం చేయడానికి సపోర్ట్ చేయమని అడగ్గా.. అనామిక చెంప పగలగొడుతుంది కావ్య.
అక్టోబర్ 5వ తేదీ 533వ ఎపిసోడ్‌లో ... మన ప్రత్యర్ధులతో కలిసి దుగ్గిరాల ఫ్యామిలీని దెబ్బతీయాలని అనుకునే రకం కాదని అపర్ణ, ఇందిరా దేవిలు రాజ్‌తో చెబుతారు. అసలు కావ్య పేరు ఇంట్లో వినిపించడానికి వీల్దేన్న రాజ్ లోపలికి వెళ్లి కళావతి ఫోటోలు, బట్టలు తీసుకొచ్చి రోడ్డుపై విసిరేస్తాడు. ఆ వెంటనే వాటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టబోతుండగా వర్షం కురుస్తుంది. ప్రకృతి కూడా స్త్రీకి అవమానం జరిగితే తట్టుకోలేదని అపర్ణ చెబుతుంది. ఎక్స్‌పోలో జరిగినదంతా తల్లికి చెబుతుంది కావ్య. తప్పు తన వల్లే జరిగింది కాబట్టి తానే నిజం నిరూపిస్తానని ఆమె అంటుంది. రాజ్ - కావ్య మధ్య గ్యాప్ పెరగడంతో రుద్రాణి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది . ఇంతలో అనామిక ఫోన్ చేయడంతో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది విన్న స్వప్న దుప్పటి తీసుకుని రుద్రాణికి ముసుగు వేసి చితకబాది పారిపోతుంది. ప్రస్తుతానికి ముసుగు వేసి కొట్టారని, ఈసారి కత్తితో పొడుస్తారని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











