దుమ్ములేపేస్తున్న బ్రహ్మి.. బుల్లి తెరపై హోస్ట్‌గా.. ప్రోమో అదుర్స్!
Recommended Video

వెండితెర నవ్వుల రారాజు బ్రహ్మానందం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన కామెడీ పంచ్ లు ఇక బుల్లి తెరపై కూడా పేలనున్నాయి. బ్రహ్మానందం కొత్త అవతారం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పాపులర్ ఛానల్ నిర్వహించే కామెడీ షోకు బ్రహ్మానందం హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ న్యూస్ సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

నవ్వుల రారాజు
బ్రహ్మానందం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్. స్టార్ హీరోల రేంజ్ లో బ్రహ్మి స్క్రీన్ పై కనిపిస్తే విజిల్స్ పడుతాయి. అంత పాపులారిటీని ఆయన సొంతం చేసుకున్నారు. బ్రహ్మానందం కామెడీతో సూపర్ హిట్ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి.

సినిమాల సంఖ్య
ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం నటిస్తున్న సినిమాల సంఖ్య బాగా తగ్గింది. దీనితో బ్రహ్మి బుల్లి తెరపై ద్రుష్టి పెట్టాడు. ప్రముఖ ఛానల్ నిర్వహించే కామెడీ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. చాలా మంది నటీ నటులు బుల్లి తెరపై హోస్ట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. సినీతారలు హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలు ప్రజాదరణ పొందుతున్నాయి.

ప్రోమో అదుర్స్
తాజగా బ్రహ్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కామెడీ షోకు సంబందించిన ప్రోమో వైరల్ గా మారింది. స్టాండప్ కామెడీ యార్.. కూర్చుని కూడా నవ్వుకోవచ్చు అంటూ బ్రహ్మానందం తన కామెడీ పంచ్ లు మొదలెట్టేశారు.

త్వరలోనే
ఈ షోని సదరు ఛానల్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బ్రహ్మి తొలిసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్న షో కావడం క్రేజ్ నెలకొని ఉంది. అలీ లాంటి కమెడియన్స్ ఇప్పటికే బుల్లితెరపై హోస్ట్ గా మారారు.


Click it and Unblock the Notifications











