For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mouni Roy: గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న సీరియల్ బ్యూటీ.. హాట్ గా ఆ అందాలు చూపిస్తూ

  |

  నాగిని సీరియల్ తో ఎంతో పాపులారిటీ సంపాందించుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ మౌనీ రాయ్. తర్వాత పలు చిత్రాల్లో నటించిం మౌనీ రాయ్.. తాజాగా పవర్ ఫుల్ విలన్ పాత్రలో అలరించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె తాజాగా నటించిన చిత్రం బ్రహ్మాస్ర్తం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులో లేడీ విలన్ గా అద్భుతమైన నటన కనబర్చింది మౌనీ రాయ్. సినిమాల సంగతి ఒకవైపు అయితే సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ తో మరోవైపు పిచ్చెక్కిస్తుంటుంది మౌనీ రాయ్. ఇటీవలే పింక్ బికినీలో హాట్ షో చేసిన మౌనీ రాయ్ లాంగ్ బ్లూ ఫ్రాక్ లో థై అందాల ప్రదర్శన చేసింది.

  నాగినీ ద్వారా..

  నాగినీ ద్వారా..

  మౌనీ రాయ్​ అంటే కొంచెం గుర్తు పట్టడం కష్టమే గానీ, నాగిని అంటే మాత్రం అందరికి సుపరిచితమే. ఎందుకంటే మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి నాగినీ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్​ అయింది.

  స్పెషల్ సాంగ్ లో..

  స్పెషల్ సాంగ్ లో..

  మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మౌనీ బ్యూటీ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.

  సీజన్లపాటు సాగిన సీరియల్..

  సీజన్లపాటు సాగిన సీరియల్..

  వరుసగా సీరియళ్లు చేయడంతో మౌనీ రాయ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్​ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.

  అక్షయ్ కుమార్ చిత్రం గోల్డ్ లో..

  అక్షయ్ కుమార్ చిత్రం గోల్డ్ లో..

  మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్​. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో తళుక్కుమంది. అంతెందుకు యశ్​ నటించి సూపర్ హిట్​ అయిన కేజీఎఫ్​ మూవీలో హిందీలో ఐటమ్​ సాంగ్​ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

   హాలీవుడ్ పాత్రలా..

  హాలీవుడ్ పాత్రలా..

  ప్రస్తుతం బాలీవుడ్ క్యూట్ కపుల్​ రణ్​బీర్​ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో లేడీ విలన్ పాత్రను మౌనీ రాయ్​ పోషించింది. ఆమె పాత్ర హాలీవుడ్​ పాత్ర వాండాను పోలి ఉందని పలు మీమ్స్​ కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ. అప్పుడప్పుడు తన అందాలను హాట్​గా ఎక్స్​పోజ్​ చేస్తూ అట్రాక్ట్​ చేస్తుంటుంది.

   లాంగ్ ఫ్రాక్ లో అందాలు..

  లాంగ్ ఫ్రాక్ లో అందాలు..

  ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో హాట్ ఫొటోలను వదిలింది బ్యూటిఫుల్​ మౌనీ రాయ్​. బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ లో తన థై అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేసింది బ్యూటీఫుల్ మౌనీ రాయ్. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అటు విలన్ గా, ఇటు గ్లామర్ డోస్ పెంచుతూ ఎప్పుడూ తనవైపు అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది ఈ భామ.

  English summary
  Brahmastram Movie Actress Mouni Roy Showing Her Thighs In Latest Blue Colour Long Gown Photoshoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X