Breaking త్రినయిని సీరియల్ నటుడు చంద్రకాంత్ సూసైడ్.. పవిత్ర జయరాంతో వివాహేతర బంధం.. మృతిపై అనుమానాలు?
టెలివిజన్ నటుడు చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ ఇక లేరు. ఆయన శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఆత్మహ్యత చేసుకొని మరణించారు. త్రినయిని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం మరణ వార్త ఇంకా మరిచిపోక ముందే.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
కొద్ది రోజుల క్రితం పవిత్ర జయరాం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరంగా మారింది. అయితే ఈ విషాద ఘటన నుంచి ఇంకా బయటపడక ముందే ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆయన కూడా మరణించడం టెలివిజన్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

టెలివిజన్ నటుడు చందుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. టెలివిజన్ నటుడిగా పలు సీరియల్స్‌లో నటించాడు. ప్రస్తుతం త్రినయిని సీరియల్‌లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఆయన రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నాడు అని తెలిసింది.

అయితే పవిత్ర జయరాం మరణించిన కొద్ది రోజులకే చందు మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మరణం వెనుక కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల, శ్రేయోభిలాషులను ఆరా తీస్తున్నారు.
నటుడు చందు తెలుగులో త్రినయిని సీరియల్ ద్వారా పాపులారిటిని సంపాదించుకొన్నారు. గతంలో కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. అయితే, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో చందుకు ఆరేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











