ఆర్జే సూర్య నిజస్వరూపం బయటపెట్టిన రియల్ లవర్.. ఆమెపై బుజ్జమ్మ సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. అన్నింటిలోనూ చాలా అంటే చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే ప్రేక్షకుల మద్దతుతో సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. అందులో బిగ్ బాస్ ఒకటి. ఈ షో సక్సెస్ అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో లవ్ ట్రాకులు కూడా ఒకటన్న విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షో వల్ల ఎంతో మంది జంటలుగా మారిపోయారు. తద్వారా ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆరో సీజన్‌లో కూడా ఆర్జే సూర్య పలు ప్రేమకథలతో హైలైట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడి రియల్ గర్ల్‌ఫ్రెండ్ తెరపైకి వచ్చింది. ఆమె ఏం చెప్పిందో మీరే చూడండి!

స్టైల్ మార్చేసినా రిజల్ట్ లేదుగా

స్టైల్ మార్చేసినా రిజల్ట్ లేదుగా

మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడిపిస్తున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను తీసుకొస్తున్నారు. కానీ, దీనికి ఆశించిన రీతిలో రేటింగ్ మాత్రం రావట్లేదు.

లవ్ ట్రాక్‌లు.. ఫుల్‌గా పాపులర్

లవ్ ట్రాక్‌లు.. ఫుల్‌గా పాపులర్

సాధారణంగా ఈ షోలో ఎక్కువగా హైలైట్ అయ్యేది కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే లవ్ ట్రాకులే అని చెప్పుకోవచ్చు. వాళ్ల మధ్య లవ్ ఉన్న లేకున్నా.. నిర్వహకులు మాత్రం జోడీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంటనైనా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ షో వల్ల ఎంతో మంది జంటలుగా మారి ఫుల్ పాపులర్ అయిపోయారు.

వాళ్లిద్దరూ ప్రేమికుల్లా సందడి

వాళ్లిద్దరూ ప్రేమికుల్లా సందడి

బిగ్ బాస్ షో ప్రతి సీజన్‌లోనూ లవ్ ట్రాక్‌లు ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. ఆరో సీజన్‌లోనూ పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలకు రొమాంటిక్ టాస్కులు ఇచ్చి రచ్చ చేస్తున్నారు. అయితే, ఒక ఇద్దరు మాత్రం ఆరంభం నుంచే జంటగా సందడి చేశారు. వాళ్లెవరో కాదు.. ఆర్జే సూర్య, ఆరోహి రావు. బయటే క్లోజ్ ఫ్రెండ్ కావడంతో హౌస్‌లోనూ వీళ్లిద్దరూ జోడీగా రచ్చ రచ్చ చేశారు.

ఆమె వెళ్లాక... ఇనాయాతో రచ్చ

ఆమె వెళ్లాక... ఇనాయాతో రచ్చ

ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్‌లో మొదట ఆరోహితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించాడు. ఆమె బయటకు వెళ్లగానే ఈ కుర్రాడు ఇనాయా సుల్తానాతో జత కట్టాడు. ఆమె కూడా అతడికి బాగా కోపరేట్ చేస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఇద్దరూ వీలైనంత ఎక్కువగా రొమాన్స్‌ను పండిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ షోలో వీళ్లిద్దరూ జంటగా తెగ సందడి చేసేస్తూ మజా పంచుతున్నారు.

తెరపైకి వచ్చిన సూర్య లవర్

తెరపైకి వచ్చిన సూర్య లవర్

ఆర్జే సూర్యకు బయట బుజ్జమ్మ అలియాస్ మృదుల అనే గర్ల్‌ఫ్రెండ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో 'సూర్యకు, నాకు పదేళ్లుగా అనుబంధం ఉంది. మేం ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. వాడికి ఏం అవసరం ఉన్నా నేనున్నానని హెల్ప్ చేస్తున్నా' అని చెప్పింది.

ఆమెకు ఉంది.. సూర్య మాత్రం

ఆమెకు ఉంది.. సూర్య మాత్రం

ఇదే ఇంటర్వ్యూలో ఇనాయా గురించి బుజ్జమ్మ మాట్లాడుతూ.. 'ఆరోహి వెళ్లిపోయిన తరువాత డిప్రెషన్‌లోకి వెళ్తాడేమో అనుకున్నా.. కానీ ఇనయ క్రష్ ఉందని చెప్పింది. సూర్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోతుంది. ఇనయ గేమ్‌పై కాకుండా సూర్యపై ఫోకస్ పెడుతుంది. అతడికి ఫివిస్టిక్‌గా అతుక్కుపోయింది. ఆమెకు తనపై ఇంట్రెస్ట్ ఉంది.. సూర్య గురించి తెలీదు' అని పేర్కొంది.

సూర్య నిజస్వరూపం అదేనట

సూర్య నిజస్వరూపం అదేనట

బుజ్జమ్మ మాట్లాడుతూ.. 'సూర్య వేరే వాళ్ల విషయాల్లో వేలు పెట్టడు. కానీ, తన విషయంలో వేలు పెడితే ఊరుకోడు. అతనికి చాలా కోపం. చేతిలో ఏది ఉంటే అది విసిరికొడతాడు. ఆ కోపం బిగ్ బాస్ హౌస్‌లో ఇంకా బయటపెట్టలేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎమోషన్స్ కూడా తగ్గించుకుంటే మంచింది' అని అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X