Bigg Boss 7: బిగ్ బాస్‌లోకి RRR హీరోలకు ఇష్టమైన సింగర్.. ఆ ఒక్క పాటతో బంపర్ ఆఫర్
తెలుగు బుల్లితెరపైకి ఎన్నో అనుమానాల నడుమ వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న షో బిగ్ బాస్. ఇండియాలోనే ఏ షోకూ రాని విధంగా రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న ఇది.. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఏడో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసమే!
అప్పటి నుంచే ఏడో సీజన్:తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇది ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుని రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని కూడా మొదలు పెట్టేందుకు నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్‌ను సెప్టెంబర్ నెలలో ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రోమోలతో క్లారిటీ ఇచ్చేసి:బిగ్ బాస్ షో ఆరు సీజన్లను ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా రెస్పాన్స్‌ను అందుకున్నాయి. దీంతో ఏడో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో వీటికి ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది. ఈ సీజన్‌పై అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయి.
ఆ పనులన్నీ మొదలుపెట్టి:అతి త్వరలోనే మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఏరో సీజన్ పనులు మొత్తం ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితమే హౌస్ సెట్ వర్కును నిర్వహకులు ప్రారంభించారు. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా ఈ సీజన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకూ పూర్తైంది. ఇప్పుడు నిర్వహకులు మిగిలిన కార్యక్రమాలతో ఫోకస్ చేస్తున్నారు.

కంటెస్టెంట్ల ఎంపిక కూడా:ఎంతో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఏరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం ఇప్పటికే కొందరిని ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కామన్ పీపుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

లీక్ అవుతున్న వివరాలు:బిగ్ బాస్ షో అంటేనే ప్రతీది సీక్రెట్‌గానే ఉంటుంది. కానీ, కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకూ అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏరో సీజన్‌లో అలా జరగకూడదని నిర్వహకులు భావించారు. ఇందులో భాగంగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికే ఏరో సీజన్‌లో పాల్గొనే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి.

బిగ్ బాస్ షోలోకి ఆ సింగర్:ఎన్నో అంచనాలతో రాబోతున్న బిగ్ బాస్ ఏరో సీజన్‌లో ఫేమస్ కంటెస్టెంట్లను ఎక్కువగా తీసుకు రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఏరో సీజన్‌లోకి 'బుల్లెట్ బండి' పాటను ఆలపించి ఫేమస్ అయిన ప్రముఖ గాయని మోహన భోగరాజును తీసుకున్నారని తెలుస్తోంది.

RRR హీరోల ఫేవరెట్ లేడీ:'బుల్లెట్ బండి' సాంగ్‌తో యమ పాపులర్ అయిన మోహన భోగరాజు.. తెలుగులో చాలా చిత్రాలకు పాటలను ఆలపించింది. ఒక సందర్భంలో RRR హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తన ఫేవరెట్ సింగర్ ఈమెనని చెప్పారు. దీంతో మోహన మరింత పాపులర్ అయింది. ఇక, ఈ అమ్మడికి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఏడో సీజన్‌లోకి తీసుకుంటున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











