twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్ధస్త్‌ నుంచి రోజా ఔట్: ఆ ఇద్దరు టీమ్ లీడర్లు చేసిన పనే కారణం.. అసలెందుకిలా చేశారు.?

    By Manoj
    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్లలో రోజా ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె.. ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినిమాల్లో చాలా కాలం పాటు సత్తా చాటిన ఆమె.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తోంది. అంతేకాదు, బుల్లితెరపైకి అడుగు పెట్టింది. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ షోను ఒంటి చేత్తో నిలబెడుతోంది. అయితే, తాజాగా రోజా ఆ షో నుంచి తప్పుకున్నారు. దీనికి కారణం ఓ గొడవ అని సమాచారం. వివరాల్లోకి వెళితే...

    పదమూడేళ్లుగా అదే పని.. కలిసొచ్చింది

    పదమూడేళ్లుగా అదే పని.. కలిసొచ్చింది

    ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ప్రారంభమై దాదాపు పదమూడేళ్లు అవుతోంది. అప్పటి నుంచీ దీనికి రోజా ఓ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతి వారం ప్రసారం అయ్యే ఈ షో ఆమెకు ఎంతో కలిసొచ్చింది. తాను ఎమ్మెల్యేగా ఎన్నికవడం వెనుక జబర్ధస్త్ పాత్ర కూడా ఉందని ఆమె వెల్లడించారు కూడా.

     అప్పటి నుంచి ఒంటి చేత్తో నడిపిస్తోంది

    అప్పటి నుంచి ఒంటి చేత్తో నడిపిస్తోంది

    ఈ షో ప్రారంభం నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన జబర్ధస్త్‌ను వీడి.. మరో చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘అదిరింది'లోకి ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్ధస్త్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ రోజా ఒంటి చేత్తో ఈ షోను నడిపిస్తూ మంచి రేటింగ్ వచ్చేలా చేస్తున్నారు.

    నాగబాబు చేసిన పని వల్ల భారీ లాభం

    నాగబాబు చేసిన పని వల్ల భారీ లాభం

    చాలా కాలం పాటు తనతో కలిసి పని చేసిన నాగబాబు జబర్ధస్త్‌ను వీడడంతో రోజాకు బాగా ప్లస్ అయింది. ఆయన గైర్హాజరు అవడం ఆమెకు లాభాన్ని తెచ్చిపెట్టింది. బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం... అప్పటి వరకు నెలకు రూ. 20 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న రోజా.. నాగబాబు వెళ్లిపోయినప్పటి నుంచి రూ. 30 లక్షలు తీసుకుంటున్నారట.

     జబర్ధస్త్‌ నుంచి రోజా ఔట్.. ఇదే సాక్ష్యం

    జబర్ధస్త్‌ నుంచి రోజా ఔట్.. ఇదే సాక్ష్యం

    హై రేటింగ్‌తో దూసుకుపోతోన్న జబర్ధస్త్‌కు షాక్ తగిలినట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ కామెడీ షో నుంచి రోజా తప్పుకున్నారట. ఇటీవల విడుదలైన వచ్చే వారం ప్రోమోలో ఆమె కనబడకపోవడంతో ఈ వార్తకు బలం చేకూరినట్లైంది. అయితే, ఆమె శాశ్వతంగా తప్పుకున్నారా..? లే బ్రేక్ ఇచ్చారా..? అనేది తెలియాల్సి ఉంది.

    ఆ ఇద్దరు టీమ్ లీడర్లు చేసిన పనే కారణం

    ఆ ఇద్దరు టీమ్ లీడర్లు చేసిన పనే కారణం

    రోజా జబర్ధస్త్‌ను వీడారు అన్న వార్త వస్తున్న నేపథ్యంలోనే దానికి గల కారణం ఇదేనంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదే ప్రోమోలో ఇద్దరు టీమ్ లీడర్లు బుల్లెట్ భాస్కర్, ఆసమ్ అప్పీ కొట్టుకుంటున్నట్లు చూపించారు. షో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం నచ్చని రోజా.. జబర్ధస్త్ నిర్వహకులపై అలిగారని ప్రచారం జరుగుతోంది.

    Recommended Video

    Senior Hero Challenges MLA Roja Husband || Filmibeat Telugu
     మళ్లీ అదే చూపిస్తారా.? అసలెందుకిలా చేశారు.?

    మళ్లీ అదే చూపిస్తారా.? అసలెందుకిలా చేశారు.?

    బుల్లెట్ భాస్కర్, అప్పారావు కొట్టుకున్నట్లు చూపించడంతో ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. దీంతో వచ్చే వారం ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇలా కొట్టుకోవడం ప్లాన్‌లో భాగమే అని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం నిజమే అనుకుంటున్నారు. అయితే, గతంలోనూ వీళ్లిద్దరూ రేటింగ్ కోసం ఇలాగే కొట్టుకున్నట్లు నటించారు.

    English summary
    Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X