యాంకర్ రష్మీ పెద్ద ఫిగర్.. గంట ఉన్నా సరిపోతుంది: కమెడియన్ అసభ్య వ్యాఖ్యలు
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతున్నాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అందులో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఒకటి. ప్రతి శుక్రవారం ప్రసారం అవుతున్న ఈ షో అన్ని రకాల వినోదాలతో సందడిగా సాగిపోతుంది. దీంతో ఈ కార్యక్రమానికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇందులో ఓ కమెడియన్ ఊహించని విధంగా కామెంట్లు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
సక్సెస్‌ఫుల్.. ఆ కమెడియన్లతో:చాలా కాలంగా ప్రసారం అవుతోన్న 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో ఎప్పటికప్పుడు మరింత కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను మరింతగా అలరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ వంటి వాళ్లు ఇందులో తమదైన రీతిలో కామెడీని పంచుతున్నారు.

కొత్త ప్రయోగాలు చేస్తూ ఫన్:ఆరంభంలో మాదిరిగా ఇప్పుడు 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలో పెద్దగా కమెడియన్లు ఉండడం లేదు. దీంతో ఉన్న వారితోనే కొత్త కంటెంట్‌ను చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ ఖుష్బూను జడ్జ్‌గా తీసుకు వస్తున్నారు. అలాగే, కమెడియన్లతో సరికొత్త ప్రయోగాలు చేయిస్తున్నారు. మొత్తానికి షోను మరింత ఫన్నీగా మార్చే విధంగా ముందుకు సాగుతున్నారు.
ఖుష్బూ వస్తే బుల్లెట్ దిగేలా:'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలో ఉన్న బెస్ట్ కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్ ఒకడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కిట్ కోసం ఎంతో శ్రమించే అతడు.. ఎప్పటికప్పుడు ఫన్‌ను పంచేలా సాగుతున్నాడు. ముఖ్యంగా జడ్జ్‌గా ఖుష్బూ ఉన్నప్పుడు మరింత ఉత్సాహంతో స్కిట్లు చేస్తున్నాడు. ఆమె కూడా అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో వీళ్లు మంచి కామెడీని ఇస్తున్నారు.

అబ్బబ్బ ఏమున్నదిరా అని:ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోకు ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో షోను మరింత ఫన్నీగా మారుస్తున్నారు. ఇలా ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ను మరింత డోస్ పెంచి తీసుకు వస్తున్నారు. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో బుల్లెట్ భాస్కర్.. ఖుష్బూను చూస్తూ 'అబ్బబ్బ ఏమున్నాదిరా' అంటూ కామెంట్ చేశాడు.
ఇది కూడా బాగుంది అంటూ:ఖుష్బూను చూస్తూ 'అబ్బబ్బ ఏమున్నాదిరా' అని బుల్లెట్ భాస్కర్ అనగానే పక్కనే ఉన్న మరో కమెడియన్ 'అయ్యా' అంటూ అరిచాడు. దీంతో అతడు 'పొద్దుపొద్దునే సుట్ట తాగితే ఏమున్నాదిరా అన్నాను. అందులో తప్పేముందిరా' అని కవర్ చేశాడు. ఆ వెంటనే రష్మీ వైపు చూపిస్తూ 'ఇది కూడా బాగుంది' అంటూ డబుల్ మీనింగ్‌లో కామెంట్ చేశాడు.

పెద్ద ఫిగర్.. గంట సరిపోద్ది:ఈ స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్.. రష్మీ దగ్గరకు వెళ్లడంతో పక్కన ఉన్న కమెడియన్ 'సిగ్గు లేదా? ఇంట్లో బంగారం లాంటి పెళ్లాన్ని పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతున్నావు' అన్నాడు. దీంతో భాస్కర్ 'పెళ్లాం ఫర్నీచర్ లాంటిది. ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. ఫిగర్ అనేది పెర్ఫూమ్ లాంటిది. గంట ఉన్నా సరిపోతుంది' అని మరో అర్థం వచ్చేలా రష్మీపై కామెంట్లు చేశాడు.


Click it and Unblock the Notifications











