Sridevi Drama Company : రష్మీ పరువు తీసిన కమెడియన్ తండ్రి.. అంతలోనే ఊహించని ప్రమాదం?

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ ని కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది మల్లెమాల సంస్థ. ఇప్పటికే ఈ షో కోసం చాలామంది యాంకర్లను మారుస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ షోకు యాంకర్గా రష్మి గౌతమ్ వ్యవహరిస్తుండగా జడ్జీ స్థానంలో మాత్రం హీరోయిన్ పూర్ణని కూర్చోబెట్టారు. ఈ ఆదివారం 26వ తేదీ ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

పెళ్ళాం చెబితే వినాలి

పెళ్ళాం చెబితే వినాలి

శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం లో ప్రతీ వారం కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఆడియన్స్ లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో పెళ్ళాం చెబితే వినాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చారు. భార్యలు అందరూ ఒక టీమ్, భర్తలంతా ఒక టీమ్ అని విడగొట్టి వారిద్దరి మధ్య రకరకాల ఆటల పోటీలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆటల పోటీలలో భాగంగా ఒక కమెడియన్ తండ్రి రష్మి గౌతమ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అవమానించాడు.

కామెడీ టైమింగ్ కాస్త బాగుండడంతో

కామెడీ టైమింగ్ కాస్త బాగుండడంతో

ఆయన సరదాగానే అన్న పాపం రష్మీ మాత్రం ఏమనాలో అర్థం కాక బిత్తరపోయింది. ఆ కమెడియన్ తండ్రి మరెవరో కాదు బుల్లెట్ భాస్కర్ తండ్రి. బుల్లెట్ భాస్కర్ తండ్రి కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఆయన కామెడీ టైమింగ్ కాస్త బాగుండడంతో బుల్లెట్ భాస్కర్ సహా మల్లెమాల వాళ్లు కూడా ఎప్పుడైనా వీలున్న ప్రతి సారి ఆయన చేత కామెడీ చేయించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

 అవమానించడంతో

అవమానించడంతో

తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ కి కూడా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ ప్రతి కాంపిటీషన్ లో లేడీస్ గెలుస్తున్నారు మగవాళ్ళు ఓడిపోతున్నారు అని అంటుంది. అప్పుడు మైక్ అందుకున్న బుల్లెట్ భాస్కర్ తండ్రి అసలు మీరు ఎవరు? మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ కామెంట్ చేస్తూ అవమానించడంతో ఒక క్షణం పాటు షాక్ తిన్న రష్మి తర్వాత దాన్ని సరదాగా తీసుకుంది.

కబడ్డీ కబడ్డీ అంటూ

కబడ్డీ కబడ్డీ అంటూ

అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య ఒక కబడ్డీ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కబడ్డీ కాంపిటీషన్లో శ్రీవాణి, నవీన యాటా వంటి వాళ్లు తమ భర్తలతో కలిసి కాసేపు కామెడీ పండించే ప్రయత్నం చేశారు. చివరిలో బుల్లెట్ భాస్కర్ తండ్రి లేడీ కంటెస్టెంట్స్ ఉన్న బరిలోకి దిగడం కనిపిస్తోంది. ఆ తర్వాత కబడ్డీ కబడ్డీ అంటూ కూత పెడుతూనే వాళ్ల మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పట్టుతప్పి స్టేజి మీద నుంచి కింద పడి పోయే విధంగా పడిపోతారు.

 ప్రమాదంతో ఒక్కసారిగా

ప్రమాదంతో ఒక్కసారిగా

ఊహించ కుండా జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా సెట్ లో ఉన్న అందరూ షాక్ అవుతారు. అసలు నీకు ఏం జరిగింది అని ఆయనను కింద నుంచి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే యాంకర్ స్థానం నుంచి సుధీర్ వెళ్లిన తర్వాత ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక టీఆర్ఫీ స్టెంట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది అయితే ఇది కూడా అందులో భాగంగానే జరిగిందా? లేక నిజంగానే ఆయనకు ప్రమాదం జరిగిందా అనే విషయం మీద పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X