యాంకర్ రష్మీ అసలు ఆడదే కాదు.. అలా తిరుగుతుంది: జబర్ధస్త్ టీమ్ లీడర్ సంచలన వ్యాఖ్యలు
బుల్లితెరపై డిఫరెంట్ కాన్సెప్టులతో షోలు వస్తున్నాయి. కానీ, కామెడీ ప్రధానంగా వచ్చే వాటికి మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. అలాంటి వాటిలో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి పేరు జబర్ధస్త్ షోదే. అంతలా ఇది దాదాపు పదేళ్లుగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో అయితే ఈ కార్యక్రమం కొత్త పుంతలు తొక్కుతూ సత్తా చాటుతోంది. దీంతో ఇది మరింతగా ఆదరణను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కమెడియన్ ఊహించని విధంగా కామెంట్లు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసమే!
సక్సెస్‌ఫుల్.. ఆ కమెడియన్లు
సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' షో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో ఎప్పటికప్పుడు మరింత కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను మరింతగా అలరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ వంటి వాళ్లు ఇందులో తమదైన రీతిలో కామెడీని పంచుతూ మరింత రేటింగ్ తెస్తున్నారు.

ప్రయోగాలు.. చాలా కొత్తగానే
జబర్ధస్త్ షో ప్రారంభం అయిన కొత్తలో గురువారం మాత్రమే వచ్చేది. తర్వాత 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' పేరుతో దీన్ని శుక్రవారం కూడా ప్రసారం చేసేవారు. ఇలా చాలా కాలం పాటు ఈ రెండు ఎపిసోడ్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేసి 'జబర్ధస్త్' షోను శుక్రవారం, శనివారం ప్రసారం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో కంటే కొత్త కంటెంట్ చూపిస్తున్నారు.
అందరూ వెళ్లినా ఆమెతోనే
జబర్దస్త్ షో మొదలైన తర్వాత ఇందులో ఎంతో మంది యాంకర్లుగా చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే అసాధారణమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. చాలా కాలంగా ఈ షోలో కంటిన్యూ అవుతోన్న ఈ భామ.. ఇప్పుడు సరికొత్తగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్‌ను సైతం నడిపిస్తోంది. ఇందులో మరింత గ్లామర్‌గా కనిపిస్తోంది.

ఈ ఎపిసోడ్ మరింత ఫన్‌తో
ఇప్పుడు కొత్తగా వస్తున్న జబర్ధస్త్ షోలో శుక్రవారం ఒక టీమ్, శనివారం ఒక టీమ్‌లా ఏర్పడి స్కిట్లు చేస్తున్నారు. ఇందులో ముందుగా టీమ్ లీడర్లు కొంత డబ్బును బెట్టింగ్‌లా పెట్టుకుని స్కిట్లు చేస్తున్నారు. ఇందులో తరచూ బుల్లెట్ భాస్కర్‌తో రాకెట్ రాఘవ గొడవ పడుతూ కామెడీని పంచుతున్నాడు. ఈ వారం వీళ్ల రచ్చ మరింత అయింది. దీంతో ఈ ఎపిసోడ్ ఫన్నీగా సాగబోతుంది.

ఆడ మంద పోవడం హ్యాపీ
ఈ వారంలో ప్రసారం అయ్యే ఎపిసోడ్ ప్రోమోను జబర్ధస్త్ టీమ్ వదిలింది. ఇందులో అందరు టీమ్ లీడర్లు తమదైన స్కిట్లతో అలరించారు. ఈ క్రమంలోనే బుల్లెట్ భాస్కర్ ఇద్దరు మగ జడ్జ్‌లను చూస్తూ.. 'ఆహా.. ఆడ మంద పోయి మీరు ఇద్దరూ కనిపించే సరికి ఎంత ఆనందం వేస్తుందో సార్' అని అన్నాడు. దీంతో జడ్జ్‌లు నవ్వుకోగా.. లేడీస్ మాత్రం షాక్ అయిపోయారు.
రష్మీపై సంచలన వ్యాఖ్యలు
బుల్లెట్ భాస్కర్ ఆడవాళ్లు లేరు అని చేసిన కామెంట్లతో అక్కడే ఉన్న యాంకర్ రష్మీ గౌతమ్ 'హలో.. ఇక్కడ నేను ఉన్నాను' అంటూ గుర్తు చేసింది. దీనికతడు 'మీరు లేడీ గెటప్ కాదా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తద్వారా రష్మీ అసలు ఆడదే కాదు అన్నట్లుగా అతడు చెప్పినట్లు అయింది. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











