Sudigali Sudheer: స్టేజీమీదే సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం.. నీ సినిమాలు అలాంటివంటూ!
సుడిగాలి సుధీర్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన ప్రస్తుతం హీరోగా మారాడు. సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రాగా.. ఆయనకు ఘోర అవమానం చేశారు. ముఖ్యంగా కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఆయన సినిమాలపై మరోసారి నోరు పారేసుకున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా విడుదల అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎపిసోడ్ లో.. కమెడియన్లు అందరూ తమకు లైఫ్ ఇచ్చిన వారిని స్టేజీపైకి తీసుకు వచ్చారు. ఈక్రమంలోనే అందరూ తామీస్థాయిలో ఉండేందుకు సాయం చేసిన వారికి అందరి ఎదుట థాంక్స్ చెప్పారు. అయితే కమెడియన్ ఆటో రాం ప్రసాద్ తనకు ఎంతో సాయం చేసిన, తాను ఈ స్థాయిలో ఉండేందుకు సహకరించిన తన ఇద్దరు స్నేహితులను స్టేజీపైకి తీసుకు వచ్చాడు. వారెవరో కాదు.. కమెడియన్లు ఆటో రాం ప్రసాద్, సుడిగాలి సుధీర్ లు. అయితే వారిద్దరూ స్టేజీపైకి రాగానే రాం ప్రసాద్ వారిని పొగడ్తలతో ముంచెత్తాడు.

ముఖ్యంగా తనకు సాయం చేసిన వీరిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. అలాగే వాళ్లు కూడా నువ్వు స్క్రిప్టు బాగా రాయడం వల్లే మేము సినిమాలు చేస్తున్నామని చెప్పి ప్రశంసించారు. ఇక ఆ తర్వాత మైక్ తీసుకున్న సుడిగాలి సుధీర్.. మల్లెమాలకు, ఈటీవీకి, రాం ప్రసాద్, శ్రీనులకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. అలాగే తనతో లవ్ ట్రాక్ నడిపిన రష్మి గౌతమ్ కు కూడా సుడిగాలి సుధీర్ థాంక్స్ చెప్పాడు. అలా సుధీర్ మాట్లాడుతున్న సమయంలోనే బుల్లెట్ భాస్కర్ స్టేజీపైకి వచ్చాడు. ఈక్రమంలోనే ఆయన కొన్ని కామెంట్లు చేసి సుధీర్ హర్ట్ అయ్యేలా చేశాడు.
స్టేజీపైకి వచ్చిన వెంటనే నేను సుధీర్ కు థాంక్స్ చెప్పాలి మేడమ్.. నాకు సర్జరీ అయినప్పుడు బాగా కాలి నొప్పి వస్తే థియేటర్ కు వెళ్లి సినిమా చూసేవాడిని... అప్పుడు తలనొప్పి వచ్చి ఈ నొప్పి మర్చిపోయేవాడిని అన్నాడు. అయితే ఆ తలనొప్పి వచ్చేలా చేసింది సుడిగాలి సుధీర్ సినిమా వల్లే మేడమ్ అంటూ వివరించాడు. ఇక ఆ తర్వాత కూడా ఆపకుండా.. తన పిల్లలు సుధీర్ సినిమా వస్తే చాలు థియేటర్ కు వెళ్దామంటున్నారని.. ఎలాగూ ఆ సినిమా ఎవరు చూడరు, ఖాళీగా ఉంటే ఆడుకోవడానికి అలా వెళ్దాం అంటున్నారని తెలిపాడు.

దీంతో సుధీర్, రాం ప్రసాద్, సీనులు నవ్వగా.. ఇంద్రజ మాత్రం కర్ర తీసుకుని స్టేజీపైకి వచ్చింది. ఇక అప్పుడే పదేళ్లుగా ఇన్ని స్కిట్లు చేస్తే సుధీర్ ఒక్కసారి కూడా తనను కామెంట్ చేయలేదని, ఎందుకు నామీద ఇలా చేస్తున్నావంటూ అడగలేదని బుల్లెట్ భాస్కర్ తెలిపాడు. సుధీర్ ను ఏమైనా అనగానే.. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ తిడుతున్నారని తెలిపాడు. కానీ సుధీర్ మాత్రం చాలా కామెడీగా తీసుకుంటాడని.. అందుకే వాడి మీద కామెంట్లు చేయగల్గుతూ స్కిట్లు చేస్తున్నానని అన్నాడు. తాను సుధీర్ కు థాంక్స్ చెప్పుకోవాలని తెలిపి.. స్పెషల్ థాంక్స్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











