జబర్ధస్త్‌లో ఊహించని సంఘటన: వర్షకు ఆ టీమ్ లీడర్ ముద్దులు.. అందుకే తీసుకొచ్చావా అంటూ స్టేజ్‌ మీదే!

తెలుగు బుల్లితెరపై దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. వారానికి రెండు రోజులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ రోజు రోజుకూ మరింత ఆదరణను అందుకుంటోంది. అదే సమయంలో పదుల సంఖ్యలో ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇలా వచ్చిన చాలా మంది ఇప్పుడు బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో వర్ష ఒకరు. చాలా రోజులుగా షోలో భాగమైన ఈమె ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు ఓ టీమ్ లీడర్ ముద్దు పెట్టాడు. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. ఇలా పాపులర్

అలా పరిచయం.. ఇలా పాపులర్

నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న పట్టుదలతో వర్ష మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తన ప్రయాణంలో చాలా సీరియళ్లలో నటించింది. వాటిలో 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటివి వర్షకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

 జబర్ధస్త్‌లోకి ఎంట్రీ... ఫుల్ ఫేమస్

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ... ఫుల్ ఫేమస్

వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే వర్షను ఓ స్కిట్ కోసం జబర్ధస్త్‌కు తీసుకొచ్చాడు హైపర్ ఆది. అలా అందులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అందంతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో ప్రేక్షకులను మాయ చేసింది. తద్వారా ఆ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. ఆ తర్వాత మరికొందరి టీమ్‌లలో చేసింది. అలాగే, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ భాగమైంది.

కమెడియన్‌తో లవ్ ట్రాక్‌తో హైలైట్

కమెడియన్‌తో లవ్ ట్రాక్‌తో హైలైట్

జబర్ధస్త్‌లో వర్ష కేవలం స్కిట్ల ద్వారానే గుర్తింపును అందుకోలేదన్న విషయం తెలిసిందే. ఆమెకు ఇంతగా పాపులారిటీ రావడానికి యంగ్ టాలెంటెడ్ కమెడియన్‌ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడపడం ప్రధాన కారణం. స్కిట్ల కోసం లవర్లుగా నటించిన వీళ్లిద్దరూ.. తమ వ్యవహార శైలితో కొంత కాలానికి నిజంగానే ప్రేమించుకుంటున్నారా? అన్న అనుమానాలను అందరిలోనూ కలిగించారు.

ముద్దులు.. హగ్గులతో రెచ్చిపోతూ

ముద్దులు.. హగ్గులతో రెచ్చిపోతూ

వర్ష.. ఇమాన్యూయేల్ జోడీ జబర్ధస్త్‌లోనే కాదు.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలోనూ రచ్చ చేస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే వీళ్లిద్దరికీ మంచి పేరు రావడంతో నిర్వహకులు ఈ జంటనే బాగా హైలైట్ చేస్తున్నారు. దీంతో రొమాంటిక్ సీన్స్ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. తద్వారా ఈ జంట విపరీతంగా హాట్ టాపిక్ అయింది.

వర్షకు ముద్దులు పెట్టిన భాస్కర్

వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఒక్కొక్కరూ గతంలో చేసిన టీమ్‌లలో కాకుండా వేరే వాళ్లతో కలిసి కనిపించారు. ఇందులో భాగంగానే వర్ష.. ఇమాన్యూయేల్ కలిసి కెవ్వు కార్తీక్ టీమ్‌లో కాకుండా.. బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో కనిపించారు. స్కిట్‌లో భాగంగా భాస్కర్.. వర్షకు ముద్దులు పెట్టడం హైలైట్ అయింది.

Recommended Video

Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
అందుకే మార్చేశావ్ అంటూ పంచ్

అందుకే మార్చేశావ్ అంటూ పంచ్


స్కిట్‌లో భాగంగా.. బుల్లెట్ భాస్కర్.. వర్షను పెళ్లి చేసుకుంటాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా సంభాషణ జరుగుతుంది. అప్పుడు అతడు ఆమె చేతిపై ముద్దులు పెడతాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇమాన్యూయేల్.. 'నువ్వు టీమ్‌ను ఎందుకు మార్చావో ఇప్పుడు అర్థమైంది' అంటూ పంచ్ వేశాడు. దీంతో ఈ ప్రోమో వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X