బాయ్‌ఫ్రెండ్‌ను మార్చేసిన జబర్ధస్త్ ఫైమా.. బండారం బయటపెట్టిన కమెడియన్

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ఫేమస్ కమెడియన్ ఫైమా ఒకరు. అసాధారణ టాలెంట్‌తో తక్కువ సమయంలోనే సెన్సేషన్‌గా మారిన ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పుడు చేతి నిండా షోలతో బిజీగా గడుపుతోంది. ఇక, చాలా కాలంగా ఫైమా.. ప్రవీణ్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలిసింది. ఆ వివరాలను మీరే చూడండి!

స్టార్‌ను చేసిన జబర్ధస్త్:'పటాస్' అనే షో ద్వారా ఫైమా సుపరిచితురాలు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ పిల్ల జబర్ధస్త్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమెకు అవకాశాలు భారీగా లభించాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమైంది. తద్వారా బుల్లితెర స్టార్‌గా మారింది.

Bullet Bhaskar Reveals Jabardasth Faima and Praveen Love Breakup

బిగ్ బాస్‌తో మరింతగా:జబర్ధస్త్ ద్వారా సెన్సేషన్ అయిన ఫైమాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఇలా ఆ మధ్య ప్రసారం అయిన బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఫైమా ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుని సత్తా చాటింది. ఇలా ఫినాలే ముందు వరకూ వచ్చి 13వ వారంలో బయటకు వెళ్లిపోయింది.

జోడీగా గెలిచిన ఫైమా:బిగ్ బాస్ ఆరో సీజన్‌తో క్రేజ్ రెట్టింపు చేసుకున్న ఫైమాకు బుల్లితెరపై మరిన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ డ్యాన్స్' షోలో పాల్గొంది. ఇందులో సూర్యతో కలిసి జట్టుగా వచ్చిన ఫైమా.. అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఫలితంగా వీళ్లిద్దరూ ఏకంగా టైటిల్‌ను గెలిచారు. తద్వారా ఆమె రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

Bullet Bhaskar Reveals Jabardasth Faima and Praveen Love Breakup

చేతి నిండా షోలతోనే:బిగ్ బాస్ షో తర్వాత అగ్రిమెంట్ వల్ల ఫైమా స్టార్ మాలోనే చాలా కాలం చేయాల్సి వచ్చింది. ఇలా 'స్టార్ మా పరివారం' షోలో చేసింది. దీనితో పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో కూడా పాల్గొంటోంది. అయితే, ఇటీవలే ఫైమా తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అందులో బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో సందడి చేస్తూ దూసుకుపోతోంది.

Bullet Bhaskar Reveals Jabardasth Faima and Praveen Love Breakup

ప్రవీణ్‌తో లవ్ ట్రాకు:జబర్ధస్త్ ఫైమా కెరీర్ ఎంత సక్సెస్ చేసుకుందో.. పర్సనల్ లైఫ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ సాగుతోంది. ఆమె 'పటాస్' షోలో పాల్గొన్నప్పటి నుంచే ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అలాగే, జంటగా యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తూ క్రేజ్ పెంచుకున్నారు.

ప్రవీణ్‌కు బ్రేకప్ చెప్పి:జబర్ధస్త్ ఫైమా చాలా కాలంగా ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగిస్తోందని తెలిసిందే. బిగ్ బాస్ షోలోనూ ఆమె ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించి కన్ఫార్మ్ చేసేసింది. అయితే, ఇప్పుడు అతడికి ఫైమా బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే వీళ్లిద్దరూ ఈ మధ్య కాలంలో జంటగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో వీళ్ల మధ్య ఏమైందన్న అనుమానాలు వస్తున్నాయి.

Bullet Bhaskar Reveals Jabardasth Faima and Praveen Love Breakup

కన్ఫార్మ్ చేసిన భాస్కర్:జబర్ధస్త్ ఫైమా తన ప్రియుడు ప్రవీణ్‌కు బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా బుల్లెట్ భాస్కర్ చేసిన కామెంట్లు దానికి బలం చేకూర్చుతున్నాయి. గత వారం ప్రసారం అయిన 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్'లో భాస్కర్ 'వెంట వెంటనే మార్చేయడానికి వాడు బాయ్‌ఫ్రెండ్ కాదు' అంటూ ఫైమాకు పంచ్ వేశాడు. దీంతో ఆమె బ్రేకప్ నిజమే అని అంతా అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X