జబర్తస్త్ లో స్కిట్లు.. నరకం చూపిస్తారు.. బుల్లెట్ భాస్కర్ ఆవేదన

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ షోలో నటిస్తున్న కమెడియన్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కామెడీని ప్రేక్షకులకు పంచాల్సి ఉంటుంది. ఇదే విషయమై తాజాగా జబర్దస్త్ స్టార్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ స్పందించారు. జబర్దస్త్ వేదికపై కామెడీ చేయడం అంటే అంత సులువైన పని కాదని చెప్పుకొచ్చారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

దశాబ్దానికి పైగా 'జబర్దస్త్'గా నవ్వులు పూయిస్తూ..
జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్లకు పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది. ఈ వేదికపై ఎంతోమంది కమెడియన్లు స్టార్లుగా ఎదిగారు. తమ ప్రతిభను చూపించి ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. తమకున్న నైపుణ్యంతో బుల్లితెరకే పరిమితం కాకుండా వెండితెర పైన వెలిగే అవకాశాలను అంది పుచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, అనసూయ భరద్వాజ్ వంటి నటీనటులు వెండితెర పైన ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జబర్దస్త్ వేదికను తమ తమ లక్ష్యాలను చేరుకునే దిశగా కమెడియన్లు వీడిన సంగతి తెలిసిందే. మరికొందరు అదే సంస్థలో విధేయతగా పనిచేస్తున్నారు.

Bullet Bhaskar Shocking Comments about Jabardasth Comedy show

కమెడియన్లకు ఎన్నో సవాళ్లు..
జబర్దస్త్ కామెడీ షో పై గతంలో ఎన్నో కాంట్రవర్సీలు జరిగాయి. ఆర్టిస్టులు జబర్దస్త్ వేదికను వీడిపోవడం, ఒకరిపై మరొకరు సంచలన వ్యాఖ్యలు చేసుకోవడం, విమర్శలు గుర్తించుకోవడం ఆ మధ్యలో చూశాం. ఇక తాజాగా కమెడియన్ బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ వేదిక పై కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదని చెప్పుకొచ్చారు. అంతర్గతంగా జరిగే కొన్ని విషయాలను బయటపెట్టారు. జబర్దస్త్ కామెడీ షోలో ఆర్టిస్టులకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఏదైనా ఒక కామెడీ స్కిట్ చేయాలంటే చాలా పర్మిషన్లు తీసుకుని చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.

వరుస ఫోన్లతో నరకంగా చూశా..
జబర్దస్త్ వేదికపై స్వామి, ప్రముఖుల పేర్లు, మతాల పేర్లు తదితర పదాలను అసలు వాడకూడదు. మరోవైపు ఎలాంటి స్కిట్లు చేస్తున్నాము అనేది ముందుగానే మేనేజ్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి కూడా ఉంటుంది. ఒకసారి మేము చేసిన కామెడీ స్కిట్ పై అభ్యంతరాలు వచ్చాయి. ఫోన్లు చేసి మరి చాలా నరకం చూపించారు. అప్పటినుంచి నా స్కిట్లలో మరింత జాగ్రత్తలు వహిస్తున్నాను. జబర్దస్త్ లో టీం లీడర్ గా చేయడం అంటే పెద్ద సవాల్ అని చెప్పుకొచ్చారు. ఇక తను మాత్రం జబర్దస్త్ను ఎప్పటికీ వీడిపోనని, జబర్దస్త్ తనకు జీవితాన్ని ఇచ్చిందని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

ఆ విషయంలో తేడా వస్తే చురకలు..
జబర్దస్త్ జడ్జీలు కూడా టీం లీడర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ ఉంటారని చెప్పారు. ఎవరైనా సరేనా రీతిలో స్కిట్లను పండించ లేకపోతే గట్టిగానే వార్నింగ్ కూడా ఇస్తుంటారు. వారికి కూడా ఒత్తిడి ఉంటుందనే కారణంగా టీం లీడర్లు, ఆర్టిస్టులను గాడిలో పెట్టేందుకు ఎప్పటికప్పుడు చురకలాంటిస్తూనే ఉంటారని చెప్పారు. మరోవైపు జబర్దస్త్ కాంట్రవర్సీ లపై తాను స్పందించలేదని, ఎవరి వ్యక్తిగత విషయాలు వారివి అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు జబర్దస్త్ వేదికను విడిపోయిన నటులు మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. షకలక శంకర్, చలాకి చంటి ఇటీవల ఈ వేదిక తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X