వర్ష నువ్వు పాయింట్ 5 అంటూ కామెంట్.. వాకౌట్ చేసిన యాంకర్ రష్మి గౌతమ్
జబర్దస్త్ కామెడీ షో దశాబ్దానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. 12 ఏళ్లకు పైగా టీవీ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తున్న ఏకైక షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులకు ప్రజల్లో మంచి గుర్తింపు దక్కింది. అంతేకాదు తమ ప్రతిభను చూపించుకునేందుకు ఒక వేదికగా మారి టీవీ ప్రేక్షకులకు చేరువచేసింది. నైపుణ్యం ఉంటే చాలు బుల్లితెర పై వెలుగొందేలా అవకాశం కల్పించింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా చాలామంది ఆర్టిస్టులే ఇండస్ట్రీలో తమ కంటే స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, షకలక శంకర్, చంటి, నరేష్, ఇమాన్యుల్, వర్ష వంటి వారు కమెడియన్లుగా ఎదిగారు. తమ కామెడీ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించి ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయారు. ఇక యాంకర్ గా 10 ఏళ్లపాటు అలరించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరకు గుడ్ బై చెప్పిన అనసూయ ప్రస్తుతం విభిన్న పాత్రలు పోషిస్తూ వెండితెరపై అలరిస్తోంది. ఇలా జబర్దస్త్ చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఇక ఇప్పటికీ ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

కాగా జబర్దస్త్ కామెడీ షో మార్చి 28వ తేదీ, మార్చి 29వ తేదీలకు సంబంధించిన ఎపిసోడ్స్ టెలికాస్ట్ కు సిద్ధంగా ఉన్నాయి. కాగా తాజాగా వాటికి సంబంధించిన ప్రోమో నూ టీం విడుదల చేసింది. అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ వర్షనూ బుల్లెట్ భాస్కర్ నువ్వు పాయింట్ ఫైవ్ అంటూ కామెంట్ చేయడం ప్రోమోలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జబర్దస్త్ వర్ష ఇమ్మానుయేల్ ను అన్నా అని పిలవడం, డాన్సర్ పండు తో రొమాన్స్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.
ఇక రాకెట్ రాఘవ తన స్కిట్లో భాగంగా యంగ్ బ్యూటీ, స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ పై పంచులు పేల్చారు. రష్మి గౌతమ్ జామ్ పండులా కొనుక్కుతినేయడమే అంటూ డబల్ మీనింగ్ డైలాగులు కొట్టారు. మరోవైపు ఆటో రాంప్రసాద్ తన పంచులతో ఆకట్టుకున్నారు. కానీ జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ నటుడు శివాజీ మాత్రం రాంప్రసాద్ కి వార్నింగ్ ఇచ్చారు. తను చేసిన స్కిట్లో లాగానే మార్కులు కూడా ఉంటాయి అంటూ హెచ్చరించారు. లేటెస్ట్ ప్రోమోలో ఈ అంశాలు ఆసక్తికరంగా మారాయి.
జబర్దస్త్ వర్షపై మాత్రం బుల్లెట్ భాస్కర్ వేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో వర్షపై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు, పంచులు పేల్చుతుండడంతో ఆమె అభిమానులు కాస్త అప్సెట్ అవుతున్నారు. ఇక బుల్లితెరపై తన టాలెంట్ ని చూపిస్తున్న వర్ష స్కిట్ పరంగానే చూస్తూ సర్దుకుపోతుందని తెలుస్తోంది. ఇక మరో మూడు రోజుల్లో జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రచారం కానున్నాయి. ఇక ఎవరు ఎలా పెర్ఫార్మన్స్ చేశారనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











