అందాలతో బిజినెస్‌మెన్‌‌‌కు వలపు వల.. ఆ సుఖం కోసం మొదటి భర్త ఉండగానే

వెండితెరపై నటించే వారే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా ఇటీవల ఎఫైర్స్, బ్రేకప్స్, విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో బుల్లితెర నటులు వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా తనను మోసం చేసిందంటూ తమిళ టెలివిజన్ రంగానికి చెందిన ఓ నటిపై వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆమె ఎవరు? ఎలాంటి మోసం చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

తన ఫేస్‌బుక్ ఖాతాకు వేరే నెంబర్‌‌ పెట్టి
తమిళనాడుకు చెందిన పలువురు బుల్లితెర నటులు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం నటి నందిని మైనాపై సమత్తువ మక్కళ్‌కట్చి నేత ఫిర్యాదు చేయడం దుమారం రేపింది. తన ఫేస్‌బుక్ ఖాతాకు ఈరోడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ నెంబర్‌ను జత చేసింది. అందమైన నటి ఫోటోలు ఉండటంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రుళ్లు అతనికి ఫోన్ అసభ్యంగా మాట్లాడటం, వేధించడం మొదలు పెట్టారు. ఈ దెబ్బకు ఆ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Businessman Files Complaint Against Tamil Serial Actress Reehana begum

సంచలనంగా రాజ్ కిరణ్ కుమార్తె ప్రేమ వివాహం
గతేడాది కోలీవుడ్ నటుడు రాజ్ కిరణ్ ఆమె దత్త పుత్రిక జీనత్ ప్రియ వ్యవహారం సంచలనం సృష్టించింది. రాజ్ కిరణ్‌ దత్తపుత్రిక జీనత్ ప్రియకు మునీష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. తరచుగా ఛాటింగ్ చేసుకుంటున్న దశలో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాల్లో తమ ప్రేమ గురించి బయటపెట్టారు. వీరి పెళ్లికి మునీష్ కుటుంబం ఓకే చెప్పగా.. రాజ్ కిరణ్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మునీష్‌కు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత, స్థాయి లేదని రాజ్ కిరణ్ తేల్చిచెప్పారు.

తండ్రిపైనే ఆరోపణలు చేసిన రాజ్ కిరణ్ కుమార్తె
దీంతో తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా లేచిపోయి మరీ పెళ్లి చేసుకుంది జీనత్ ప్రియ. ఆ తర్వాత రాజ్ కిరణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే భర్త నుంచి విడిపోయినట్లు చెప్పి బాంబు పేల్చింది. మేం విడిపోయామని, మా వివాహానికి ఎలాంటి చట్టబద్ధత లేదని.. మా నాన్నను ఎంతో బాధపెట్టానని ప్రియ వ్యాఖ్యానించింది. ఇందుకు తనను క్షమించాలంటూ వీడియో రిలీజ్ చేయడంతో ఇది కాస్తా కోలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై రాజ్ కిరణ్ స్పందిస్తూ.. మునీష్ డబ్బు మనిషని, తన పేరును వాడుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడని ఆరోపించాడు.

భర్తకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి
తాజాగా తమిళ బుల్లితెర నటి రిహానా బేగంపై చెన్నైలోని పూందమల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ పారిశ్రామికవేత్త ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. పొన్ని, పాండియన్ స్టోర్స్ వంటి పలు సీరియల్స్‌లో నటించిన రిహానా బేగం మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే చెన్నైలోని కోళపాక్కంకు చెందిన రాజ్ కన్నన్ అనే వ్యాపారవేత్త.. రిహానా తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆరోపించారు. అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లల తల్లైన రిహానా బేగం .. భర్తకు విడాకులిచ్చానని చెప్పి తనను పెళ్లిచేసుకుందని రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తనను మోసం చేసి రూ.20 లక్షలు కాజేసిందని ఆరోపించాడు. అయితే రిహానా లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిందని, అందుకే వ్యాపారవేత్తను ట్రాప్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను విచారించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రిహానా వ్యవహారం తమిళ బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Read more about: kollywood Reehana Begum
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X