Bigg Boss Telugu 7 లేడి కంటెస్టెంట్స్‌కు బంపర్ ఆఫర్.. కెప్టెన్‌గా గౌతమ్ జోరు మాములుగా లేదుగా?

బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అద్భుతమైన టాస్కులతో అదరగొడుతున్న బిగ్ బాస్.. అంతకు మించిన ఎంటర్ టైన్ మెంట్ అందించడంలో ముందుంటున్నాడు. అయితే ఈ వారం వాడీవేడీగా నామినేష్లు జరగ్గా.. ఈ వారం కెప్టెన్ గౌతమ్ కృష్ణ అదిరిపోయే డిసీషన్ తీసుకున్నాడు. అందరికీ షాకిచ్చే ఓ విషయాన్ని తెలిపాడు. ముఖ్యంగా ఆడోళ్లకు ఓ వారం రోజులు పని లేదంటూ ప్రకటించి.. స్త్రీల మనసనులను గెలుచుకున్నాడు. అలాగే కష్టజీవి, పని దొంగ అంటూ రోజూ గుర్తిస్తానని చెప్పుకొచ్చాడు.

ముందుగా కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ కృష్ణ.. అందరినీ ఓ చోట కూర్చోబెట్టాడు. ఈక్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. కెప్టెన్ గా కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తున్నానని తెలిపాడు. అయితే ముందు ఆర్డర్ చెప్పేముందు కాసేపు మాట్లాడాడు. ఇక్కడ కొంత మందికి పెళ్లి అయిందని, మరికొంత మందికి కాలేదని.. వాళ్ల అమ్మలు, అక్కా చెల్లెల్లు, భార్యలు.. ముఖ్యంగా స్త్రీలు పురుషులకు చాలా సాయం చేస్తారని వివరించాడు. ఎంతో కాలంగా ఇంట్లో పనులు చేయడంలో, వంట చేయడం, పిల్లలు, ఇంటి బాధ్యతలను చూసుకోవడంలో స్త్రీలదే అప్పర్ హ్యాండ్ ఉందని పేర్కొన్నాడు.

Captain Gautam Krishna Celebrate Womens Week in Bigg Boss House And No Work to Girls For One Week

అయితే ఇదంతా నిజమేనని.. దీన్ని నో అని చెప్పడానికి అస్సలే వీలు లేదని గౌతమ్ కృష్ణ వెల్లడించాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో పాటు బయట ఉన్న, టీవీ చూస్తున్న ఎంతో మంది స్త్రీలకు ట్రిబ్యూట్ గా ఈ వారం అంతా ఉమెన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుందామని అన్నాడు. సో ఓన్లీ మెన్ విల్ వర్క్ దిస్ ఇన్ వీక్ అని వెల్లడించాడు. వారం రోజుల పాటు ఇంట్లో ఉన్న ఆడ వాళ్లకు ఎటువంటి పని ఉండదు అని.. హాలీడేస్ అని స్పష్టం చేశాడు. ఇదంతా విన్న అంబటి అర్జున్.. ఈ లెక్కన ఒక్క ప్రియాంకకు మాత్రమే సెలవు ఇవ్వాలని... ఆమె తప్ప ఇక్కడ ఎవరూ పని చేయట్లేదని కామెంట్లు చేశాడు.

ఆ తర్వాత రెండో ఆర్డర్ గురించి చెబుతూ.. ప్రతిరోజూ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడే కూర్చొని.. ఆ రోజంతా ఎక్కువగా పని చేసిన వారికి కష్టజీవి అని, లీస్ట్ వర్క్ చేసిన అతడికి పని దొంగ అని రెండు బిరుదులు ఇవ్వాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఆరోజు కష్టజీవిగా గెలిచిన వారికి నెక్స్ట్ డే ఓ స్ర్పైట్ తో పాటు.. పని దొంగకు కేటాయించిన రెండు గుడ్లు కష్టజీవికి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. దీనికి అమర్ దీప్ నేను ఒప్పుకోనని అన్నాడు. వెంటనే గౌతమ్ కృష్ణ.. నా మాటే శాసనం, ఇది అందరూ తప్పక పాటించాలని వివరించాడు.

ప్రస్తుతం గౌతమ్ కృష్ణ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఆడ వాళ్లకు వారం రోజుల పాటు ఎలాంటి పని ఇవ్వకుండా.. కెప్టెన్ గా మార్కులు కొట్టేయడమే కాకుండా బయట ఉన్న స్త్రీ అభిమానుల మనసుల్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఏది ఏమైనా గౌతమ్ కృష్ణ చేసిన ఈ పనికి అంతా ఫిదా అయిపోతున్నారు. ఇది ఆయనకు ప్లస్సుగా నిలుస్తుందా లేక మైనస్ గా మారుతుందో తెలియాలంటే ఈ వారం రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X