Bigg Boss Telugu 5: కెప్టెన్సీ టాస్క్‌లో పడిపోయిన లోబో.. మెడికల్ రూమ్‌లో చికిత్స
బిగ్‌బాస్ తెలుగు 5 షోలో మళ్లీ రణరంగం చోటు చేసుకొన్నది. ఇంటి వ్యవహారాలను చూసే కెప్టెన్సీ పదవికి జరిగే ఎంపిక కోసం టాస్క్‌లో ఇంటి సభ్యులు హోరా హోరీగా తలపడ్డారు. విచక్షణ కోల్పోయి భౌతిక దాడులకు కూడా వెనుకాడలదే. ఇక మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య పంతం నీదా నాదా టాస్క్ ఎలా కొనసాగిందంటే..

ఇంటి సభ్యులను విడదీసి..
నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఇంటి సభ్యుల్లో ఏర్పడిన విభేదాలు ఇంకా సమసి పోకముందే బిగ్‌బాస్ ఇంటి సభ్యుల మధ్య మరో రణరంగానికి తెర లేపారు. కెప్టెన్సీ కోసం జరిగే ఎంపి కోసం ఇంటి సభ్యులను రెండుగా విడదీశారు. గతంలో నామినేషన్ టాస్క్ కోసం విభజించినట్టుగానే ఈగిల్, వూల్ఫ్ జట్లకు పోటీ పెట్టారు. ఈ టాస్క్ కోసం పంతం నీదా? నాదా అని పేరు పెట్టారు.

లోబోపై శారీరకంగా
టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు అత్యధికంగా బేటేన్స్‌ను సంపాదించుకోవాలి. ఇతరుల వద్ద ఉంటే ఎలాగైనా వాటిని బలవంతంగానైనా లాగేసుకోవచ్చు. ఈ సందర్భంగా లోబోపై కొందరు భౌతికంగా, శారీరకంగా ఒత్తిడికి గురిచేశారు. దాంతో లోబో తల్లడిల్లిపోయాడు. ఓ దశలో నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత లేచి పక్కన కూర్చోవడంతో బిగ్‌బాస్ పిలిచారు.

మెడికల్ రూమ్‌కు లోబో
పతం నీదా నాదా? టాస్క్‌లో అనారోగ్యానికి గురైన లోబోను బిగ్‌బాస్ మెడికల్ రూమ్‌కు రమ్మని పిలిచారు. దాంతో లోబోకు చికిత్స అందించడానికి మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. సిరి హన్మంతుపై పడి కొందరు బలవంతంగా బేటేన్స్ లాగేసుకొన్నారు.

తనను గాయపరిచారని సిరి
పంతం నీదా నాదా? టాస్క్ సందర్బంగా తమను బలంగా కొట్టారని ఆరోపించారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొంటూ ఇంటి సభ్యులు కనిపించారు. ఇలాంటి పరిస్థితులు మధ్య చాలా మందికి స్వల్పగాయాలు అయ్యాయి. సిరి తనను గాయపరిచారని చెప్పుకోవడం కనిపించింది.
Recommended Video

శ్రీ రామచంద్ర ఫైర్
అయితే టాస్క్‌లో రెండో భాగంగా సాగరా సోదరా గేమ్‌ను ఆడించారు. ఈ ఆట సందర్భంగా నటరాజ్ మాస్టర్, సింగర్ శ్రీ రామచంద్రకు, ఇతరులకు భారీగా వాగ్వాదం జరిగింది. అలాగే ఈ గేమ్‌లో సిరి హన్మంతుకు గాయమైంది. ఇలా అనేక మంది గొడవలు పడుతూ ఈ గేమ్‌ను కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











