twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు గోగినేనిపై కేసు.... బిగ్ బాస్ షో నుండి బయటకు వస్తారా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Complaint Filed Against Babu Gogineni

    బిగ్ బాస్ 2 కంటెస్టెంట్, హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా ఆయన యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడారనే అంశంతో పాటు వారు చేపట్టే ప్రైవేటు కార్యక్రమం కోసం ఆధార్‌ నంబర్లను తీసుకోవడంపై కేవీ నారాయణ అనే వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం బిగ్ బాస్ 2 రియాల్టీ షోలో ఉన్న బాబు గోగినేని ఈ కేసు నేపథ్యంలో బయటకు వస్తారా? నెక్ట్స్ ఏం జరుగబోతోంది? అనేది హాట్ చర్చనీయాంశం అయింది.

    న్యాయపరమైన చిక్కులు

    న్యాయపరమైన చిక్కులు

    మాదాపూర్‌ పోలీసులు బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న ఆయన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ అయింది.

    ఎలిమినేషన్ లిస్టులో కూడా లేని బాబు

    ఎలిమినేషన్ లిస్టులో కూడా లేని బాబు

    బిగ్ బాస్ 2 రియాల్టీ షో ప్రస్తుతం మూడో వారంలోకి ప్రవేశించింది. సోమవారం ఎలిమినేషన్ నామినేషన్లు జరిగాయి. అయితే ఈ వారం ఈ లిస్టులో బాబు గోగినేని లేక పోవడం గమనార్హం. ఒక వేళ ఆయన ఎలిమినేషన్ జాబితాలో ఉండి ఉంటే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉండేదేమో?

     గత సీజన్లో ముమైత్ ఖాన్‌కు ఇలానే...

    గత సీజన్లో ముమైత్ ఖాన్‌కు ఇలానే...

    గత సీజన్లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ ఇంట్లో ఉండగా.... ఆమె టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. దీంతో ఆమెను ఇంటి నుండి ఎలిమినేట్ చేసి మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

    అంతా బిగ్ బాస్ చేతిలోనే...

    అంతా బిగ్ బాస్ చేతిలోనే...

    తాజాగా బాబు గోగినేని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది బిగ్ బాస్ చేతిలోనే ఉంది. కేసు తీవ్రతను బట్టి, ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా? లేక లాయర్ వచ్చి ఆయన సంతకాలు తీసుకుని వెళితే సరిపోతుందా? అనే అంశంపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

    English summary
    Human Rights activist and Bigg Boss season 2 contestant Babu Gogineni has been booked for 'sedition' and 'treason' charges. According to the reports, Babu Gogineni has been booked under 13 sections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X