చిక్కుల్లో పడ్డ రాములమ్మ.. శ్రీముఖిపై కేసు నమోదు.. అసలు విషయం ఏంటంటే..?

నటీనటులు అన్నాక, రియాల్టీ షోలన్నాక కేసులు నమోదు కావడం కామన్ అయిపోయింది. సినిమాలు, టైటిల్స్, డైలాగ్స్, పాటలు ఇలా ఏదో వంక చూపుతూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం పరిపాటైంది. సెలెబ్రిటీలపై ఇలాంటి ఫిర్యాదులు రావడం, కేసులు నమోదు కావడం సర్వ సాధారణమే అయినా.. బుల్లితెర రాములమ్మ, లౌడ్ స్పీకర్ శ్రీముఖిపై ఓ కేసు నమోదు అయిందనే వార్త ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

Recommended Video

Case Filed Against Anchor Srimukhi | Filmibeat Telugu
బుల్లితెర రాములమ్మ..

బుల్లితెర రాములమ్మ..

బుల్లితెరపై శ్రీ ముఖి చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె వేసే పంచ్‌లు, సెటైర్స్, స్టెప్పుల గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పటాస్ షోలో ఆమె వేసిన రాములమ్మ సిగ్నేచర్ స్టెప్ రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది.

బిగ్‌బాస్‌లో ఎంటర్టైన్మెంట్..

బిగ్‌బాస్‌లో ఎంటర్టైన్మెంట్..

బిగ్‌బాస్ మూడో సీజన్‌లో శ్రీ ముఖి చేసిన అల్లరి, చేసిన రచ్చ, పంచిన ఎంటర్టైన్మెంట్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. అయితే టైటిల్ విన్నర్‌గా నిలుస్తుందని అంతా భావించినా కొన్ని స్వయంకృతాపరాధం వల్ల రన్నర్‌గానే మిగిలిపోయింది.

మందగించిన కెరీర్..

మందగించిన కెరీర్..

ఒకప్పుడు శ్రీముఖి అంటే.. ది మోస్ట బిజియెస్ట్ యాంకర్‌గా పేరు ఉండేది. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందో.. అంతగా రాణించలేకపోతోంది. మునుపటిలా ఎనర్జిటిక్ షోలు చేయడం లేదు.. అంతగా ఆకట్టుకోలేకపోతోంది. కొత్తగా ప్రారంభించిన షోల్లో కూడా శ్రీముఖి తేలిపోయింది.

శ్రీ ముఖిపై కేసు నమోదు..

శ్రీ ముఖిపై కేసు నమోదు..

ఓ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజికవర్గాన్ని కించ పరిచేలా ఉన్నాయని శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తామని తెలిపినట్టు సమాచారం. కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని యాంకర్ శ్రీముఖితో పాటు సదరు టీవీ యాజమాన్యంపైనా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X