వివాదంలో చిక్కుకున్న సరయూ, మందేస్తూ తలకు ఆ టోపీలా, పోలీసులకు ఫిర్యాదు!
యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయి ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ తెచ్చుకున్న మీద పోలీస్ కేసు నమోదైంది. అయితే ఆమె మీద పోలీస్ కేసు నమోదు కావడానికి కారణం ఏమిటి? ఏ విషయంలో ఆమె మీద కేసు నమోదయింది. అనే వివరాల్లోకి వెళితే

వీడియోలు చేస్తూ
ఆమె పూర్తి పేరు సరయు రాయ్ కాగా సరయు తండ్రి బెంగాలీ కాగా, తల్లి తెలుగు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. సైన్స్ స్టూడెంట్ అయిన సరయు నిన్నే పెళ్లాడతా సీరియల్‌లో నెగిటివ్ రోల్ పోషించింది. అలాగే తెలుగు తెర మీద వెలిగిపోవాలని కలలు కనే సరయూ రాయ్ 7 ఆర్ట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో వరుస వీడియోలు చేస్తూ వెలుగులోకి వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు బూతులతో రెచ్చిపోయిన ఆమె అనతికాలంలోనే ఆమె చాలా ఫేమస్ అయింది.

వీడియోలు చేస్తూ
7 ఆర్ట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ తో సరయు క్లినిక్', 'డాక్టర్ సరయు', 'ఎస్ ఐ సరయు', 'పతివ్రత', 'సరయు పెళ్లమైతే', 'ఆకలి రాజ్యం', 'చూడాలని ఉంది', లాంటి వీడియోలలో సరయు తన విశ్వరూపం చూపించి ఓర్నాయనో ఇవేం వీడియోలు, ఇవేం బూతులురా దేవుడా అనేట్టు చేసింది. బోల్డ్ కామెంట్స్‌తో ఆమె చాలా ఫేమస్ కావడంతో బిగ్ బాస్ అవకాశం వచ్చింది.

హోటల్ గురించి ప్రచారం
అయితే బిగ్ బాస్ లోకి వచ్చి వారంలో ఆమె ఎలిమినేట్ అయింది. అయినా ఆమెకు మంచి క్రేజ్ అయితే లభించిది. అయితే తాజాగా సరయు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హోటల్ గురించి ప్రచారం చేసే పాటకు సంబంధించిన హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్న అభియోగం మీద ఆమె మీద కేసు నమోదయింది.

పోలీసులకు కంప్లైంట్
ఈ మేరకు రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు కంప్లైంట్ చేశారని మీడియాకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు, ఆపై కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక హోటల్ ప్రమోషన్ సాంగ్‌లో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మనోభావాలను కించపరిచి
హిందువులు దేవుడి బొమ్మలు ధరించి, లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని జనాల్లోకి ఆ ప్రమోషన్ సాంగ్ తో పంపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధంగా ప్రవర్తించి హిందువుల మనోభావాలను కించపరిచినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు.
Recommended Video

సకల గుణాభి రామ
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ హీరోగా నటించిన 'సకల గుణాభి రామ' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నిజానికి బిగ్ బాస్ లోకి ఎంటర్ కాక ముందే ఆయన చేసినప్పటికి కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సరయు కూడా కీలక పాత్రలో నటించింది. ఆమె కూడా బిగ్ బాస్ కంటే ముందే ఈ సినిమాలో నటించింది. ఈ విషయాన్ని హౌస్ లో కూడా కొన్ని సార్లు ప్రస్తావించింది.


Click it and Unblock the Notifications











