Pavitranath: తెలుగు టీవీ రంగంలో పెను విషాదం.. మొగలిరేకులు దయా కన్నుమూత

కొంత కాలంగా తెలుగు బుల్లితెర, వెండితెర ఇండస్ట్రీల్లో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంత వ్యవధిలోనే చాలా మంది పరిశ్రమతో సంబంధం ఉన్న నటీనటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు చాలా మంది ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు బుల్లితెర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, 'మొగలిరేకులు' సీరియల్ ఫేం పవిత్రనాథ్ మరణించారు. ఈ విషయాన్ని కొందరు తోటి నటులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో బుల్లితెర రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే తెలుగు బుల్లితెరపై పలు సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ తాజాగా కన్నుమూశారు. అయితే, ఆయన ఎలా చనిపోయాడు? ఎక్కడ చనిపోయాడు? అనే విషయాలు మాత్రం తెలియలేదు. అతడి తోటి నటుడైన ఇంద్రనీల్ వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పవిత్రనాథ్ మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Chakravakam and Mogalirekulu Serial Fame Pavitranath Passed Away

తాజాగా ఇంద్రనీల్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'పవి (పవిత్రనాథ్) ఈ బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి. మేం ఈ వార్త విన్న తర్వాత.. ఇది నిజం కాదని, కాకూడదని అనుకున్నాము. ఇది అబద్ధం అయితే బాగుందని కోరుకున్నాము. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం. గుడ్‌ బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలి' అంటూ పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉండగా.. పవిత్రనాథ్ బుల్లితెరపై ఎన్నో సీరియళ్లలో నటించాడు. అందులో 'మొగలిరేకులు' సీరియల్‌లో దయా పాత్ర ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత కూడా అతడు 'అంతపురం', 'కృష్ణ తులసి' వంటి సీరియళ్లలో అదిరిపోయే పాత్రలు పోషించాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం పవిత్రనాథ్ యాక్టింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. దీంతో అతడికి ఏమైంది అనేది సస్పెన్స్‌గా మారిపోయింది.

గతంలో పవిత్రనాథ్ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని, తన ముందరే వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని అతడి భార్య శశిరేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. అంతేకాదు, జాతకాల పేరుతో అమ్మాయిలను వంచన చేసేవాడని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X