సీరియల్లో అత్తా, అల్లుడు.. కట్ చేస్తే భార్యాభర్తలు.. ఆ క్రేజ్ కపుల్ ఎవరంటే?
వెండి తెర నటులే కాదు.. బుల్లి తెర నటులకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ సీరియల్స్ లో నటీనటులకు, వారి పోషించే పాత్రలను ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొందరైతే ఆ సీరియల్ లోని రోల్స్ ని కూడా అమితంగా అభిమానిస్తారు. ముఖ్యంగా సీరియల్స్ లోని హీరో, హీరోయిన్ లకు కూడా పిచ్చి ఫాలోయింగ్ ఉంటుంది. సీరియల్ లో జంటగా ఉంటే.. బయట కూడా నిజంగా భార్యభర్తలు అయితే బాగుండని కోరుకునేవారు ఉంటారు. అలాగే.. సీరియల్ విభిన్న పాత్రల్లో నటించి.. రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. అలా సీరియల్ లో అత్తా,అల్లుడు నటించి, రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారారు. ఇంతకీ ఆ క్రేజీ స్టార్ కపుల్ ఎవరో లూక్కేయండి.
ఆ కపుల్ ఎవరో కాదు. చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్, ఆయన భార్య మేఘన. వారి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఒకసారి తెలుసుకుందామా. కుటుంబ సభ్యులంతా పనులన్నీ ముగించుకుని చూసిన సీరియల్స్ లో చక్రవాకం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కు దిగ్గజ రచయిత్రి యుద్ధనపూడి సులోచనా రాణి రచనలో మంజుల నాయుడు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రీతి అమీన్, ఇంద్రనీల్, సెల్వరాజ్, కౌశల్ మందా, సాగర్, మేఘన, ప్రీతి నిగమ్, రమాప్రభ, మధుమణి, నరసింహరాజు తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ సీరియల్ 1111 ఎపిసోడ్స్ కంటిన్యూగా ప్రసారమైంది. చక్రవాకం సీరియల్ తర్వాత కన్నడ, మలయాళంలో డబ్బింగ్ అయింది. వారి కూడా ఆకట్టుకుంది.

ఈ సీరియల్‌లో హీరోగా నటించిన ఇంద్రనీల్ బుల్లితెరపై సక్సెస్ తన కెరీర్ కొనసాగించారు. ఆ క్రమంలో ఆయన అదే సీరియల్ నటించిన మేఘనను పెళ్లాడారు.దాదాపు తమ వివాహా బంధాన్ని 20 ఏండ్లు సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఇంద్రనీల్ - మేఘనలు నీలి మేఘాలలో పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఈ ఛానల్ లో తమ ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇంద్రనీల్, మేఘనలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరికి చక్రవాకం సీరియల్‌లో ఇంద్రనీల్ కు అత్తగా మేఘన నటించింది . కానీ, రియల్ లైఫ్‌లో వారు భార్యభర్తలు. అంతే కాదు.. ఇంద్రనీల్ కంటే వయసులో మేఘన పెద్దది. దాదాపు ఆరు నెలలు మేఘన పెద్దది కావడంతో మొదట్లో వీళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదంట. కానీ, ఆ తరువాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట.
చక్రవాకం సీరియల్‌కి ముందు ఇంద్రనీల్, మేఘనలు కాలచక్రం అనే సీరియల్‌లో నటించారు. ఆ సమయంలోనే మేఘన, ఇంద్రనీల్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇంద్రనీల్ ధైర్యం చేసి ప్రపోజ్ చేశాడు. అయితే తనకంటే చిన్నవాడు కావడంతో మేఘన మొదట్లో రిజెక్ట్ చేసింది. వాస్తవానికి మేఘనకు పెళ్లే చేసుకోవాలనే ఆలోచన లేదంట. దీంతో ఇంద్రనీల్ లవ్‌ని యాక్సెప్ట్ చేయలేదు మేఘన.

కానీ, ఇంద్రనీల్ మాత్రం.. కంటిన్యూగా మేఘన వెంటపడుతూ.. దాదాపు 9 సార్లు ప్రపోజ్ చేశాడు. అయితే చక్రవాకం సీరియల్‌కి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ప్రీతి, ఇంద్రలపై ఆ సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ చూసిన తరువాత ఇంద్రపై మేఘనకి ఇష్టం పెరిగిందట. తనని ప్రేమిస్తున్న అబ్బాయి వేరే అమ్మాయితో రొమాన్స్ చేయడంతో తనకు లోలోపల దాగిన ప్రేమను బయట పెట్టేసిందట మేఘన.. దీంతో వెంటనే ఇంద్రకి ప్రపోజ్ చేసింది మేఘన.
కానీ, ఇంద్రనీల్ మేఘనకి దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడట. వెంటనే ఒకే చెప్పకుండా.. మా అమ్మని అడిగి చెప్తానని మేఘన లవ్ ప్రపోజ్‌ని హోల్డ్‌లో పెట్టాడు. ఓ రెండు రోజులు టైం తీసుకుని ఇంటికి వెళ్లి మరీ మేఘనతో లవ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇంద్రనీల్. అయితే వీళ్ల పెళ్లికి వీరి వయసు ఆటంకంగా మారిందట. ఆ క్రమంలో ఇంద్రనీల్ తల్లి మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోలేదంట. అయితే ఇంద్రనీల్, మేఘనలు పట్టువదలకుండా.. తప ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలనుకున్నారు.ఫైనల్ గా పెద్దల అంగీకారం చెప్పడంతో వీళ్లద్దరూ 2004 డిసెంబర్ 12న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.


Click it and Unblock the Notifications











