Chalaki Chanti Remuneration: షాకిస్తోన్న చంటి రెమ్యూనరేషన్.. 5 వారాలకే అన్ని లక్షలా!

ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైనా.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానులను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరేళ్లుగా ఇది బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను సాధిస్తూ.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన చలాకీ చంటి ఐదో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు ఈ సీజన్ కోసం తీసుకున్న రెమ్యూనరేష్ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి!

ఎలా చూపించినా రేటింగ్ లేదుగా

ఎలా చూపించినా రేటింగ్ లేదుగా

తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్ వస్తుంటుంది. అందుకే ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆరో సీజన్ కూడా మొదలై మరింత కొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. కానీ, దీనికి ఆశించిన దానికంటే చాలా తక్కువగానే రేటింగ్ వస్తోంది. దీనిపై బిగ్ బాస్ టీమ్ నిరాశగా ఉంది.

టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన చంటి

టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన చంటి

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. వారిలో జబర్ధస్త్ కమెడియన్ కమ్ యాక్టర్ చలాకీ చంటి ఒకడు. కమెడియన్‌గా ఫుల్ ఫేమస్ అయిన అతడికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండడమే కారణం.

 మంచి పేరుతో.. పెరిగిన మద్దతు

మంచి పేరుతో.. పెరిగిన మద్దతు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుంచే చలాకీ చంటి తన మార్కు చూపించే ప్రయత్నాలు మాత్రం చేయలేకపోయాడు. ముఖ్యంగా షోలో ఇచ్చే టాస్కుల్లో అంత యాక్టివ్‌గా కూడా పాల్గొనలేదు. అలాగే, పెద్దగా ఎవరితోనూ గొడవలు పడడం లేదు. దీంతో చంటికి సౌమ్యుడిగా పేరు వచ్చింది. దీంతో ఆరంభంలోనే అతడికి భారీ స్థాయిలో మద్దతు పెరిగిపోయింది.

టాస్క్‌లో ఫ్లాప్.. బిగ్ పనీష్‌మెంట్

టాస్క్‌లో ఫ్లాప్.. బిగ్ పనీష్‌మెంట్

ప్రతి సీజన్‌లో ఏదో ఒక కంటెస్టెంట్‌కు సీక్రెట్ టాస్కును ఇస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని చాలా మంది మంచిగా వాడుకుని తమ సత్తాను నిరూపించుకుంటారు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం చలాకీ చంటికి నాలుగో వారంలోనే ఈ అవకాశం వచ్చినా అతడు ఫ్లాప్ అయ్యాడు. దీంతో ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోయి ఢీలా పడ్డాడు.

త్యాగం చేసేశాడు... ఎలిమినేషన్

త్యాగం చేసేశాడు... ఎలిమినేషన్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎంతో కామ్‌గా ఉన్న చలాకీ చంటి.. ఓ సందర్భంలో గీతూ రాయల్‌తో గొడవ పడ్డాడు. దీంతో ఆమె అతడిపై నిందలు వేసింది. అలాగే, కీర్తి భట్‌తో అతడి గురించి బ్యాడ్‌గా చెప్పింది. దీంతో వాళ్లిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. దీంతో గీతూ కోసం చంటి ఐదో వారంలో నామినేట్ అయ్యాడు. ఫలితంగా ఈ కమెడియన్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

షాకిస్తోన్న చంటి రెమ్యూనరేషన్

షాకిస్తోన్న చంటి రెమ్యూనరేషన్

5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న చలాకీ చంటి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా వచ్చిన అతడికి బాగానే ముట్టజెప్పి ఉంటారని అంతా అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్ కోసం చలాకీ చంటి ఏకంగా రూ. 21 లక్షలు వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలిసింది.

ఐదు వారాలకే అన్ని లక్షల చార్జ్

ఐదు వారాలకే అన్ని లక్షల చార్జ్

బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. చలాకీ చంటి బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం రోజుకు రూ. 60 వేల చొప్పున వారానికి రూ. 4.20 లక్షలు చార్జ్ చేశాడట. అలా ఐదు వారాల పాటు ఉన్న అతడు రూ. 21 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. చాలా మంది కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని బుల్లితెర వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X