Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ బిగ్ స్టార్.. నోరు జారడంతో మేటర్ లీక్.. రెమ్యూనరేషన్ ఎంతంటే!
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. ఇండియాలోని చాలా భాషల్లో టాప్ ప్లేస్‌లో వెలుగొందుతోంది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులోకి ఈ కార్యక్రమం వచ్చిన వెంటనే ప్రేక్షకుల మన్ననలను సొంతం చేసుకుంది. ఫలితంగా సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే బిగ్ బాస్ ఆరో సీజన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సీజన్‌లోకి జబర్ధస్త్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న కమెడియన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దానికి సంబంధించిన వివరాలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

ఆరో సీజన్ రెడీ.. అంచానాలతో
తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందుకే నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా దీన్ని ప్రతి ఏడాదీ తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా మొదలెట్టబోతున్నారు. దీన్ని సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్టుగా పని చేయబోతున్నారు.

కన్ఫార్మ్ చేసిన బిగ్ బాస్ టీమ్
ఆరో సీజన్‌కు సంబంధించి చాలా రోజులుగా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే దీని నుంచి లోగో, సీజన్ ప్రోమోలు విడుదల అయ్యాయి. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన దక్కింది. అలాగే, రెండు రోజుల క్రితమే ఈ సీజన్ ప్రారంభ తేదీని ప్రకటిస్తూ మరో ప్రోమో వదిలారు. దీంతో ఇది సెప్టెంబర్ 4 నుంచి వచ్చేది ఖరారైంది.

అవి కంప్లీట్.. దానిపైనే ఫోకస్
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి మొదలు అవుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు మొత్తం పూర్తైనట్లు బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే షో హౌస్ సెట్ వర్కును నిర్వహకులు పూర్తి చేసేశారట. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దారని సమాచారం. ఇక, ఇప్పుడు నిర్వహకులు ప్రీమియర్ ఎపిసోడ్‌ను సక్సెస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

15 మంది కంటెస్టెంట్లు ఫైనల్
ఎంతో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కామనర్స్ కూడా ఉన్నారని తెలుస్తోంది.

పేర్లు లీక్... వాళ్లు వీళ్లు కూడా
వాస్తవానికి బిగ్ బాస్ షోకు సంబంధించి.. ఇందులో జరిగే ప్రతి వ్యవహారమూ ఎంతో రహస్యంగా ఉంటుంది. కానీ, నిర్వహకులకు షాకిచ్చే విధంగా ఇందులోని అన్ని విషయాలు ముందే లీక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా త్వరలో మొదలయ్యే ఆరో సీజన్‌లో కంటెస్టెంట్ల పేర్లూ వచ్చాయి. తాజాగా వచ్చిన లిస్ట్‌లో బుల్లితెర, వెండితెరకు చెందిన ప్రముఖుల పేర్లు కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ బిగ్ స్టార్
ఎన్నో అంచనాలతో వైభవంగా ప్రారంభం కాబోతున్న ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న వాళ్లను ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం జబర్ధస్త్ కమెడియన్, నటుడు చలాకీ చంటిని కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఎక్కువ రెమ్యూనరేషన్.. లీక్
అటు జబర్ధస్త్‌లో, ఇటు సినిమాల్లో సత్తా చాటుతోన్న చంటిని అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకు వస్తున్నారని బుల్లితెర వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా దానికి యాంకర్‌గా చేసిన వ్యక్తి 'మీ తెలివితేటలు వచ్చే బిగ్ బాస్‌లో చూపించండి' అన్నాడు. దీంతో చంటి ఎంట్రీ ఇచ్చేది కన్ఫార్మ్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











