Bigg Boss Telugu 6: బిగ్ బాస్‌లో చలాకీ చంటికి షాక్.. నాలుగో వారమే ఎలిమినేట్.. షో చరిత్రలో తొలిసారి

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఇది దాదాపు ఆరేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతును అందుకుని, రికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా దక్కించుకుంటోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన వారిలో ఒకడైన చలాకీ చంటికి తాజాగా బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో చూడండి!

 ఎక్కువే ప్లాన్ చేసినా తక్కువగా

ఎక్కువే ప్లాన్ చేసినా తక్కువగా

బిగ్ బాస్ షోకు తెలుగులో ఆదరణ పెరుగుతూనే ఉండడంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను మొదలు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో దాన్ని తీసుకొచ్చారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపిస్తున్నారు. కానీ, దీనికి ఆశించిన రీతిలో రేటింగ్ మాత్రం దక్కట్లేదు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గానే చంటి

స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గానే చంటి

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. వారిలో చలాకీ చంటి ఒకడన్న విషయం తెలిసిందే. జబర్ధస్త్ కమెడియన్‌గా ఫుల్ ఫేమస్ అయిన అతడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడమే దీనికి కారణం.

ఆరంభంలో అలాంటి పేరుతో

ఆరంభంలో అలాంటి పేరుతో

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే చలాకీ చంటి తన మార్కు చూపించే ప్రయత్నాలు మాత్రం చేయలేకపోతోన్నాడు. ముఖ్యంగా షోలో ఇచ్చే టాస్కుల్లో అంత యాక్టివ్‌గా కూడా పాల్గొనడం లేదు. అలాగే, పెద్దగా ఎవరితోనూ గొడవలు పడడం లేదు. దీంతో చంటికి సౌమ్యుడిగా పేరు వచ్చింది. అదే కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నాడీ కమెడియన్.

సీక్రెట్ టాస్క్.. అట్టర్ ఫ్లాప్‌గా

సీక్రెట్ టాస్క్.. అట్టర్ ఫ్లాప్‌గా

బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో ఏదో ఒక కంటెస్టెంట్‌కు సీక్రెట్ టాస్కును ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. దీన్ని చాలా మంది మంచిగా వాడుకుని తమ సత్తాను నిరూపించుకుంటూ ఉంటారు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం చలాకీ చంటికి నాలుగో వారంలోనే ఈ అవకాశం వచ్చింది. కానీ, అతడు దాన్ని పూర్తి చేసేందుకు ఏమాత్రం ఆసక్తిని చూపించకుండా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు.

చంటికి క్లాస్ పీకిన నాగార్జున

చంటికి క్లాస్ పీకిన నాగార్జున

నాలుగో వారానికి సంబంధించిన జరిగిన టాస్కుల్లో చాలా మంది చక్కగా పార్టిసిపేట్ చేశారు. కానీ, కొందరు మాత్రం నిరాశ పరిచారు. దీంతో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున వాళ్లకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు. మరీ ముఖ్యంగా సీక్రెట్‌ టాస్కులో విఫలం అయిన చలాకీ చంటిపై అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు, అతడికి కోలుకోలేని షాక్‌ను ఇచ్చాడు.

కెప్టెన్సీ నుంచి తప్పించేలా

కెప్టెన్సీ నుంచి తప్పించేలా

గత వారం మొత్తంలో జరిగిన 'బీబీ హోటల్' టాస్కులో డబ్బు సంపాదించని కంటెస్టెంట్లలో ఒకరిని సీజన్ మొత్తం కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున వెల్లడించాడు. అయితే, ఆ ఒక్కరు ఎవరన్నది నిర్ణయించే బాధ్యతను మాత్రం హౌస్‌లోని కంటెస్టెంట్లకే అప్పగించాడు. వాళ్లు వేసిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లు ఈ టాస్కు నుంచి ఎలిమినేట్ అవుతారు.

ఆమె ఓటుతో చంటినే ఔట్

ఆమె ఓటుతో చంటినే ఔట్

'బీబీ హోటల్' టాస్కులో బాలాదిత్య, ఆది రెడ్డి, చలాకీ చంటి, ఇనాయా సుల్తానా మాత్రమే డబ్బు సంపాదించలేదు. ఇందులో బాలాదిత్య కెప్టెన్ అవకుండా ఉండేందుకు ఎవరూ ఓట్ వేయలేదు. అయితే, ఆది రెడ్డికి ఒక ఓటు, చంటి, ఇనాయాకు మూడు ఓట్లు వచ్చాయి. వీళ్లిద్దరికీ టై అవడంతో కెప్టెన్ కీర్తి చంటికి ఓట్ వేసింది. దీంతో అతడిని సీజన్ మొత్తానికి కెప్టెన్ కాకుండా నాగార్జున ఎలిమినేట్ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X