Chalaki Chanti షాకింగ్ కామెంట్స్.. సిరిని అలా అనేశాడేంటి!.. నైట్‌కు రావాలంటూ..!!
అటు స్మాల్ స్క్రీన్ పై ఇటు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్‌గా ఎదిగారు చలాకీ చంటి. 'జబర్ధస్త్' ద్వారా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న ఆయన.. తాజాగా నటి సిరిపై వల్గర్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారారు! వివరాళ్లోకి వెళితే..
గతంలో వరుస పెట్టి షోలు, సినిమాలు చేసిన చలాకీ చంటి.. మొదట రేడియో స్టేషన్ లో ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించారు. కెరీర్ ప్రారంభంలో మిమిక్రీ, ఆ తర్వాత ఓ ఎఫ్‌ఎం రేడియోలో జాకీగానూ వర్క్ చేశారు. ఆ తర్వాత ఈటీవీ 'జబర్దస్త్'తో బుల్లితెరపై మెరిశారు. ఈ షోతో ఆయన పేరు చలాకీ చంటిగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఈటీవీ ప్లస్‌లోనూ 'నా షో నా ఇష్టం' అనే కామెడీ ఎంటర్ టైనర్ షోకు హోస్ట్ గా చేశారు. 'బిగ్‌బాస్' 6లోనూ ఓ కంటెంస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అలా ఓవైపు టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో హాస్య నటుడిగా రాణించారు. 'భీమిలి కబడ్డీ జట్టు', 'సినిమా చూపిస్త మావ' లాంటి చిత్రాల్లో తనదైన శైలి కామెడీ యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్నారు.
జబర్దస్త్ నుంచి ఔట్: అయితే 'జబర్దస్త్' లోకి వచ్చి చలాకి చంటి గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఆ తర్వాత ఎందుకో కొన్ని విబేధాలు రావడం వల్ల షో లో నుంచి బయటకు వచ్చేశారు. సోషల్ మీడియా, ఇతర షోల ద్వారా కెరీర్ ను నెట్టుకొచ్చారు. అలా కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన అకస్మాతుగా బయట కనపడం మానేశారు. ఈ మధ్యనే గుండెపోటుకు కూడా గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స తీసుకుని కోలుకున్నారు. దీంతో షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంటూ లైఫ్ ను గడుపుతున్నారు.

సుమ అడ్డాలో: తాజాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చంటీ.. ఈ వారం 'సుమ అడ్డా' షోలో సందడి చేశారు. సిరి హన్‌మంత్, సన్నీ, ఆర్జే కాజల్ తో కలిసి నవ్వులు పూయించారు. సుమ కూడా తనదైన స్టైల్లో సెటైర్స్ వేస్తూ, కంటెస్టెంట్ లతో కలిసి సందడి సందడి చేసింది. చంటికి సమోసాలిస్తూ సాలిడ్ పంచ్ వేసి నవ్వులు పూయించింది. ఇంకా రకరకాల గేమ్స్, క్వశ్చన్స్‌తో మస్త్ హంగామా చేసింది. భారతదేశం యూనిఫామ్ నైటీ అంటూ ఆటపట్టించింది.

సురీడ్ స్ఫూఫ్ తో సుమ: అలానే సూరీడు స్పూఫ్‌తో సన్నీని ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంది సుమ. అలా సరాదా సరదాగా షో సాగిపోయింది. కానీ అక్కడే అసలు గేమ్ మొదలైంది. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ ఫ్యామిలీ చిత్రం 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో' ప్రియురాలు బొమ్మ తెరపై పడింది. వెంటనే చంటి అందుకని టైటిల్ పేరు చెప్పగానే.. ఇది టైటిల్‌లా లేదు, మీ రియల్ స్టోరీలా ఉందంటూ సుమ చమత్కరించింది.
చంటి సెట్టైర్: ఈ స్కిట్ లో కాజల్ మాట్లాడుతూ.. 'నేపాల్ నుంచి నాకోసం ఏం తీసుకొచ్చారు?' అని అడగగా.. 'నువ్వొక్కదానికి కష్టపడుతున్నావని పని అమ్మాయిని తీసుకొచ్చాను.. ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకో. కాకపోతే సాయంత్రం పూట మాత్రం కాస్త వదిలేయ్' అంటూ సిరిని చూపిస్తూ సరదా కామెంట్స్ చేశాడు చంటి. అవి కాస్త వల్గర్ గా ఉన్నప్పటికీ ఫన్నీగా అనడంతో.. సుమతో పాటు అక్కడ ఉన్న వాళ్లంతా అరుస్తూ తెగ నవ్వేశారు. చివరకు 'నేను నేపాల్ వెళ్లలేదు' అంటూ చంటీ అనడంతో ఆ స్కిట్ ముగిసింది. ఇక వీళ్లంతా డ్యాన్స్ లతోనూ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో పుల్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











