సుడిగాలి సుధీర్‌కు చలాకీ చంటి వార్నింగ్.. ఆ తప్పు చేయొద్దంటూ హెచ్చరిక..

టాలీవుడ్ కమెడియన్ చలాకీ చంటి (Chalaki Chanti)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చంటి, తరువాత సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కామెడీ పాత్రలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన నటనను నిరూపించుకున్న ఆయన, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలు వివరించారు. అలాగే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)కు ఇచ్చిన వ్యక్తిగత సలహాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
Raaka: 'రాకా' కోసం అట్లీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. వామ్మో ఇన్ని కోట్లా?
Raaka: 'రాకా' కోసం అట్లీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. వామ్మో ఇన్ని కోట్లా?

జబర్దస్త్ వేదికగా కెరీర్ ప్రారంభించిన చంటి, తన సహజమైన హావభావాలు, టైమింగ్‌తో తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించారు. తరువాత వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని వెండితెరపై కూడా సత్తా చాటారు. తన కెరీర్‌లో భీమిలి కబడ్డీ జట్టు (Bheemili Kabaddi Jattu) సినిమాలో చేసిన అమాయకమైన పాత్ర తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అదే సినిమా తనకు నటుడిగా ప్రత్యేక గుర్తింపునిచ్చిందన్నారు. అలాగే సినిమా చూపిస్తా మావా(Cinema Choopistha Mava)లో చేసిన ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా నచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఒక పాత్రలో పర్ఫెక్ట్‌గా నటించాలంటే ముందుగా కథపై పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడు మాత్రమే నటనలో క్లారిటీ వస్తుందని చంటి తన అభిప్రాయం వెల్లడించారు.

Recommended For You
స్టార్ హీరోయిన్ పై టీమిండియా క్రికెటర్ పరువు నష్టం దావా!.అవన్నీ అబద్ధాలేనా?
స్టార్ హీరోయిన్ పై టీమిండియా క్రికెటర్ పరువు నష్టం దావా!.అవన్నీ అబద్ధాలేనా?
Chalaki Chanti Warning to Sudigali Sudheer About Career Mistakes

కమెడియన్ చలాకీ చంటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలు, ఇండస్ట్రీలోని అనుభవాలు, అలాగే తోటి నటుడు సుడిగాలలి సుధీర్ కి ఇచ్చిన సలహాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇక ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరిని అడగలేదని చంటి స్పష్టం చేశారు. "కొన్ని సందర్భాల్లో నిరాశలు ఎదురయ్యాయి. కానీ ప్రతి ఒక్కరికీ ఒక సమయం వస్తుందని నమ్మాను. అదే నమ్మకంతో ముందుకు సాగాను" అని చెప్పారు. తన నటనను ఇతరులతో పోల్చి తగ్గించి చూడడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. అందుకే ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని రాజీ పడలేదని తెలిపారు. తన విలువను తానే కాపాడుకోవాలని, అది కళాకారుడికి చాలా ముఖ్యమని చంటి పేర్కొన్నారు.
You May Also Like
'వాళ్ల కోరిక తీర్చితేనే ఆఫర్లు.. లేదంటే కెరీర్ ఖతం'
'వాళ్ల కోరిక తీర్చితేనే ఆఫర్లు.. లేదంటే కెరీర్ ఖతం'

ఇదే సందర్భంగా సుధీర్ గురించి మాట్లాడుతూ చంటి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. "నా తర్వాత వచ్చిన సుధీర్ లాంటి వాళ్లు స్టార్ స్థాయికి ఎదగడం చూసి చాలా సంతోషంగా ఉంటుంది. నేను నా కెరీర్‌లో చేసిన తప్పులు వాళ్లు చేయకూడదని సుధీర్‌కు వ్యక్తిగతంగా సలహా ఇచ్చాను" అని తెలిపారు. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మరింత ఎత్తుకు వెళ్లొచ్చని సూచించినట్లు చెప్పారు. భవిష్యత్తులో సుధీర్ ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. జీవితంలో ఒడిదుడుకులు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నవారే నిలబడతారని చంటి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీకి రికార్డ్ డీల్.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీకి రికార్డ్ డీల్.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?

ఇక సోషల్ మీడియా రూమర్స్‌పై కూడా చంటి ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చిన సమయంలో యూట్యూబ్‌లో తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారని చెప్పారు. ముఖ్యంగా తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్, అసత్య ప్రచారాలు తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయని వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందన్నారు. సెలబ్రిటీల జీవితాలతో ఆటలాడుతూ వ్యూస్ కోసం ఇలా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

Allu Arjun: అల్లు అర్జున్ క్రేజీ లైనప్.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఎప్పుడంటే?
Allu Arjun: అల్లు అర్జున్ క్రేజీ లైనప్.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఎప్పుడంటే?

వ్యక్తిగత విషయాల్లో కూడా చంటి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పుట్టుకతోనే తాను పూర్తిగా శాఖాహారినని, ఇప్పటివరకు మాంసాహారం ముట్టలేదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లినప్పుడు వెజిటేరియన్ ఫుడ్ దొరకక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మళ్లీ నటనపై పూర్తి దృష్టి పెట్టి . పింక్ ఎలిఫెంట్, బరి వంటి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానన్నారు. మరోవైపు సుధీర్ కూడా టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు. త్వరలో GOAT సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X