ఐదేళ్లుగా లివింగ్ రిలేషన్.. చనిపోయేముందు నాకది ఇచ్చింది.. పవిత్రా జయరామ్‌తో రిలేషన్‌పై చందు క్లారిటీ!

త్రినయని సీరియల్ లో తిలోత్తమగా నటించి మెప్పించిన నటి పవిత్రా జయరామ్ ఇటీవలే చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కుంది. అయితే ఈమె మృతి తర్వతా ఈమె పెళ్లి, పిల్లల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆమె భర్త అంటూ చెప్పుకొచ్చారు. అయితే తొలిసారి ఆయన పవిత్రా జయరామ్ తో తనకు ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చారు. ఆమెను తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని కానీ.. తాము లివింగ్ రిలేషన్ లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మే 12వ తేదీ రోజు రోడ్డు ప్రమాదంలో నటి పవిత్రా జయరామ్ చనిపోయింది. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాల వల్ల కాకుండా.. హార్ట్ స్ట్రోక్ వల్ల ప్రాణాలు కోల్పోయిందని నటుడు చంద్రకాంత్ చెప్పుకొచ్చారు. రోడ్డు ప్రమాదం జరుగుతున్న సమయంలో తనతో పాటు తన భార్య పవిత్రా జయరామ్, వాళ్ల అక్కకూతురు మరో అమ్మాయి కూడా కారులో ఉన్నట్లు చెప్పారు. డ్రైవర్ ఉండడంతో తాను పడుకున్నాని.. ఆ సమయంలోనే కారు ప్రమాదం జరిగిందని అన్నారు. అయితే ఈ ప్రమాదంలో తనకు మాత్రమే ఎక్కువ గాయాలు అయ్యాయని.. పడిపోయినట్లు చెప్పారు. అయితే మిగతా వారికి ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని.. ముఖ్యంగా పవిత్రా జయరామ్ కు ఏమీ కాలేదని చెప్పుకొచ్చాడు.

Challa Chandrakanth Reveal His Relation With Trinayani Serial Actress Pavithra Jayaram Check Details

కానీ ప్రమాదం జరిగిన తీరు చూసి.. ముఖ్యంగా తనకు గాయాలు కావడం చూసి తాను షాక్ అయిందని.. ఆ షాక్ వల్లే తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని... అలా చనిపోయిందని తెలిపాడు. అలాగే తనకు ముందు నుంచి ఇలా టెన్షన్ పడే సమస్య ఉందని చెప్పుకొచ్చాడు. తామిద్దరూ కలిసి నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ చేస్తుండగా.. ఓ సీన్ చేస్తున్నప్పుడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. అప్పుడు కూడా పవిత్ర కళ్లు తిరిగి పడిపోగా.. తాను చెంపపై గట్టిగా కొట్టగా ఆమెకు శ్వాస ఆడినట్లు వివరించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకు వెళ్లగా.. తాను కొట్టిన దెబ్బల వల్లే ఆమె బ్రతికిందని డాక్టర్ చెప్పినట్లు వివరించారు.

అలా ఏర్పడిన స్నేహమే తమ మధ్య ప్రేమగా మారిందని... తన ప్రాణాలు కాపాడినందుకు ఆమె తనతో ఎక్కువ క్లోజ్ గా ఉండేదని వివరించారు. అలా ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న వాళ్లు ఐదేళ్లుగా లివింగ్ రిలేషన్ లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తాము పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. బెంగళూరు వెళ్లి వచ్చాకా అఫీషియల్ గా ప్రకటించాలని అనుకోగానే.. ఆమె మధ్యలోనే ఇలా ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ముఖ్యంగా తాను చనిపోయే అరగంట ముందే తనకు ఓ మర్చిపోలేని బహుమతి ఇచ్చిందని కూడా వివరించాడు చంద్రకాంత్.

పవిత్రా జయరామ్ జిమ్ కు వెళ్తుండడంతో... చాలా సన్నబడినట్లు, దాని వల్ల ఆమె చేతికి ఉన్న ఉంగరం బాగా లూజ్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు చంద్రకాంత్. దాంతో ఆమె ఆ ఉంగరం తీసి తన చేతికి తొడిగిందని.. ఆ ఉంగరాన్ని కూడా చూపిస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X