అందుకే జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చా.. సుధీర్, రష్మి లవ్ ట్రాక్ పై చమ్మక్ చంద్ర క్లారిటీ..

Chammak Chandra: బుల్లితెరపై గుర్తుండిపోయే హాస్య నటులలో చమ్మక్ చంద్ర ఒకరు. తన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ డ్రామాలతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన చమ్మక్ చంద్ర, స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. ముఖ్యంగా 'జబర్దస్త్' కామెడీ షోలో చమ్మక్ చంద్ర అంటేనే ఓ బ్రాండ్ అనే స్థాయికి ఎదిగాడు. అయితే ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టిన జబర్దస్త్‌ను చమ్మక్ చంద్ర ఒక్కసారిగా వదిలేయడంతో అప్పట్లో అనేక రకాల పుకార్లు షికార్లు చేశాయి. రెమ్యునరేషన్ విషయంలో విభేదాలా? మేకర్స్‌తో గొడవలా? లేక కొత్త షో కోసం బయటికి వచ్చారా? అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న చమ్మక్ చంద్ర 'జబర్దస్త్'ను ఎందుకు వదిలేశాడన్న ప్రశ్నకు తాజాగా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా జబర్దస్త్‌తో తన అనుబంధం, ఆ షో వదిలిన కారణం, మల్లెమాల సంస్థతో ఉన్న బంధం గురించి చమ్మక్ చంద్ర చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు.

Chammak Chandra Clarifies Exit Jabardasth and Opens Up on Sudheer-Rashmi Love Track Rumours

ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చమ్మక్ చంద్ర 'ఈ ప్రపంచానికి చమ్మక్ చంద్ర అని ఎవరికైనా తెలిసిందంటే దానికి కారణం జబర్దస్త్. జబర్దస్త్ లేకపోతే చమ్మక్ చంద్ర లేడు. అలాంటి టీమ్ ఇచ్చిన షోను వదిలేసి వేరే షోకి ఎందుకు వెళ్లారు అని చాలామంది అడుగుతుంటారు' అని చెప్పారు. జబర్దస్త్ షోకు నితిన్, భరత్ అనే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారని, వారితో తాను ఏడు సంవత్సరాల పాటు కలిసి పనిచేశానని చమ్మక్ చంద్ర గుర్తు చేసుకున్నారు. 'ఆ తర్వాత నితిన్, భరత్ ఇద్దరూ ఈనాడు ఛానల్‌ను విడిచి జీ తెలుగుకు వెళ్లారు. వాళ్లు నాకు సపోర్ట్ కోరారు. వాళ్ల కోసం నేను జబర్దస్త్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది" అని స్పష్టంగా చెప్పారు.

అంటే వ్యక్తిగత కారణాలు గానీ, గొడవలు గానీ కాకుండా, తనతో కలిసి పనిచేసిన డైరెక్టర్లకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే షో నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మల్లెమాల సంస్థపై తనకున్న గౌరవం, కృతజ్ఞతను కూడా ఆయన వ్యక్తం చేశారు. 'జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినా.. మేనేజ్‌మెంట్‌తో గానీ, ఛానల్‌తో గానీ నాకు ఎలాంటి గొడవలు లేవు. మల్లెమాల సంస్థతో నేను ఇప్పటికీ టచ్‌లోనే ఉంటాను. ఆ సంస్థ నాకు జీవితం ఇచ్చింది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వాళ్లే. వేరే అవకాశాలు వచ్చాయి కాబట్టి బయటకు వచ్చాం. కానీ ఆ సంస్థపై నా ప్రేమ, ఆప్యాయత చచ్చేంత వరకు తగ్గదు'అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు చమ్మక్ చంద్ర.

చంద్ర ఇంకా మాట్లాడుతూ 'జబర్దస్త్‌తో మా అనుబంధం వేరు. ఈరోజు ఎక్కడికి వెళ్లినా అభిమానులు మమ్మల్ని గుర్తుపడతారు అంటే అది జబర్దస్త్ వల్లే. మేము ఏ షో చేసినా ఇప్పటికీ 'జబర్దస్త్ చమ్మక్ చంద్ర' అనే పిలుస్తారు. అది నాకు గర్వకారణం'అని అన్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు గురించి మాట్లాడుతూ 'నాగబాబుగారికి జబర్దస్త్ అంటే చాలా ఇష్టం'అని చెప్పారు.

జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లే ముందు మల్లెమాల సంస్థకు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు కూడా తెలిపారు. 'బయట వేరే ఆఫర్లు ఉన్నాయి, వెళ్లాలనుకుంటున్నాం అని ముందే చెప్పాం. అప్పుడు మల్లెమాల వాళ్లు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. 'మీ కంఫర్ట్ జోన్ మీరు చూసుకోండి' అని చాలా హుందాగా పంపించారు. ఎలాంటి గొడవలు, కాంట్రవర్సీలు లేవు'అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇంటర్వ్యూలో యాంకర్ రష్మీ, సుధీర్ గురించి కూడా ప్రశ్నించగా చమ్మక్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రష్మీతో పరిచయం చాలా ఎక్కువ. నేను 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కూడా చేశాను. లేడీ గెటప్‌లో ఉన్నప్పుడు రష్మీని తిట్టడం, ఆటపట్టించడం వంటివి చేసేవాడిని. వాటన్నిటినీ రష్మీ చాలా స్పోర్టివ్‌గా తీసుకునేది' అని చెప్పారు.

ఇక సుధీర్-రష్మీ లవ్ ట్రాక్‌పై వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ..' వాళ్లిద్దరి మధ్య ఏదేదో ఉందని ఊహించుకుంటూ రాస్తున్నారు. అది షో కోసం మాత్రమే. సుధీర్ లైఫ్ సుధీర్‌ది, రష్మీ లైఫ్ రష్మీదే. ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే వాళ్ల మధ్య ఓ బాండ్ క్రియేట్ చేశారు. బయట వినిపించే రూమర్స్‌కు, తెరపై కనిపించేదానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని వాళ్లే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు'అంటూ స్పష్టత ఇచ్చారు చమ్మక్ చంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X