ఆ ‘లేడీ’ ఆర్టిస్టుతో చమ్మక్ చంద్ర అసభ్య ప్రవర్తన.. ఆ పిసుకుడేంటి సామీ.. మరీ ఇంత దారుణమా?

టెలివిజన్ హిస్టరీలోనే ఎక్కువ కాలం ప్రసారం అయిన షోలు చాలా తక్కువ. తెలుగులో అయితే అలాంటివి చాలా అరుదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉండి.. అవకాశం లేని వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకడు. లేడీ గెటప్‌ల స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. ఆ షోలోనే నెంబర్ వన్ కమెడియన్‌గా కొనసాగాడు. ఆ తర్వాత వేరే షోలలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే చంద్ర ఓ 'లేడీ' ఆర్టిస్టుతో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలు మీకోసం!

టాప్ టీమ్ లీడర్.. జబర్ధస్త్‌గా చంద్ర కెరీర్

టాప్ టీమ్ లీడర్.. జబర్ధస్త్‌గా చంద్ర కెరీర్

జబర్ధస్త్ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చమ్మక్ చంద్ర.. తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీనికి కారణం అతడు చేసే స్కిట్లలో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఉండడమే. అలాగే, స్కిట్టు స్కిట్టుకు ప్రత్యేకమైన మేనరిజాన్ని చూపిస్తుంటాడు. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తద్వారా టాప్ ప్లేస్‌కు చేరాడు.

అక్కడ ఫుల్ బిజీ.. ఎన్నో మంచి పాత్రలు

అక్కడ ఫుల్ బిజీ.. ఎన్నో మంచి పాత్రలు

కమెడియన్‌గా బుల్లితెరపై తన మార్క్ చూపిస్తోన్న చమ్మక్ చంద్ర.. టీవీ షోలకే పరిమితం కాలేదు. సుదీర్ఘమైన కెరీర్‌లో సినీ రంగంలోనూ అతడు తన మార్క్‌ను చూపించాడు. 'అ ఆ', 'అరవింద సమేత', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'రాజా ది గ్రేట్', 'టాక్సీవాలా' సహా ఎన్నో సినిమాల్లో మంచి నటనను కనబరిచాడు. 'బాబు బంగారం' అనే సినిమాలో అతడి లేడీ గెటప్ హైలైట్ అయింది.

జబర్ధస్త్‌కు బైబై.. అక్కడకు ఎంట్రీ ఇచ్చాడు

జబర్ధస్త్‌కు బైబై.. అక్కడకు ఎంట్రీ ఇచ్చాడు

చాలా కాలం పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. దానికి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన వెళ్లిన సమయంలో షో నుంచి చమ్మక్ చంద్ర కూడా తప్పుకున్నాడు. దీనిపై మాట్లాడుతూ కొత్తదనం కోసం బ్రేక్ తీసుకున్నానని అప్పుడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జీ తెలుగులో 'అదిరింది', 'బొమ్మ అదిరింది'లో టీమ్ లీడర్‌గా చేశాడు. అక్కడా తన స్కిట్లతో మెప్పించాడు.

అక్కడ ఆగిపోయింది.. ఇక్కడ మొదలైంది

అక్కడ ఆగిపోయింది.. ఇక్కడ మొదలైంది

జీ తెలుగులో ప్రసారం అయిన 'అదిరింది' షో అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో చమ్మక్ చంద్ర స్టార్ మాలో ప్రారంభం అయిన 'కామెడీ స్టార్స్' అనే షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. చమ్మక్ చంద్ర పాటు అవినాష్ కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

ఆ ఆర్టిస్టుతో చమ్మక్ చంద్ర అసభ్య ప్రవర్తన

ఆ ఆర్టిస్టుతో చమ్మక్ చంద్ర అసభ్య ప్రవర్తన

చంద్ర స్కిట్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా ఉంటాయి. అయితే, కొద్ది రోజులుగా అతడి స్కిట్లలో మసాలా ఎక్కువ అవుతోంది. డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు వెగటు పుట్టించేలా మేనరిజం చూపించడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'కామెడీ స్టార్స్' షోలో ఓ ఆర్టిస్టుతో చమ్మక్ చంద్ర ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది.

ఆ పిసుకుడేంటి.. మరీ ఇంత దారుణమా?

వచ్చే ఆదివారం ప్రసారం కానున్న 'కామెడీ స్టార్స్' ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఇందులో చమ్మక్ చంద్ర స్కిట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనికి కారణం ఈ స్కిట్‌లో అతడు.. తోటి సభ్యుడు పవన్ (లేడీ గెటప్‌ల స్పెషలిస్టు పావని)తో కలిసి డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోవడమే. అంతేకాదు, లేడీ గెటప్‌లో ఉన్న అతడితో 'పిసికి పిసికి' అంటూ అడల్ట్ కామెడీ చేశాడు.

 మొత్తం అలాంటివే.. చివరికి వర్షిణి కూడా

మొత్తం అలాంటివే.. చివరికి వర్షిణి కూడా

ఇక, ఈ స్కిట్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులతోనే సాగింది. 'నువ్వు పిసకవు.. వేరే వాళ్లనూ పిసకనివ్వవు'.. 'ఇంట్లో మా ఆయన లేడు.. పని కానిద్దామా'.. 'ఆవు ఆంబోతుకు అలవాటు పడినట్లు.. నువ్వు వాడిని పిసుకుడికి అలవాటు పడ్డావేంటే' వంటి డైలాగులు చిరాకు తెప్పిస్తున్నాయి. వాళ్లకు తోడు శేఖర్ మాస్టర్, యాంకర్ వర్షిణి కూడా డైలాగులు చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X