యాంకర్ రష్మిని టార్గెట్ చేసిన చమ్మక్ చంద్ర.. పరువు తీశాడు!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులరిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మి పెళ్లి అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే. సుడిగాలి సుధీర్‌తో రష్మి ప్రేమాయణం సాగిస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇదంతా జబర్దస్త్ స్కిట్లలో ప్రేక్షకులను నవ్వించడానికి క్రియేట్ చేసిన ఒక హైడ్రామా.

అయితే రష్మి పెళ్లి విషయంలో తరచూ ఏదో ఒక టాపిక్ రన్ అవుతూనే ఉంటుంది. వయసు ముదిరిపోతున్నా ఆమె పెళ్లి దూరంగా ఉండటంపై సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర రష్మిని టార్గెట్ చేస్తూ డైలాగులు పేల్చాడు.

ఫన్నీగా రష్మి పరువు తీసిన చమ్మక చంద్ర

ఫన్నీగా రష్మి పరువు తీసిన చమ్మక చంద్ర

మొగుడితో ఇంటి పనులు చేయించడం ఎలా? అనే కాన్సెప్టుతో చమ్మక్ చంద్ర ఓ స్కిట్ చేశాడు. ఇందులో పక్కింటికి కొత్తగా పెళ్లైన అమ్మాయి రావడంతో... రష్మిని ఉద్దేశించి ‘‘నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? భూమి పుట్టినపుడు పుట్టావు.. అకౌంట్లో డబ్బులు వేసినట్లు ఏజ్ నీ వెనకాల వేసుకుంటున్నావ్.. దీని వల్ల వచ్చేది ఏజ్ బార్, ముసలితనం తప్ప ఏమీ లేదు'' అంటూ ఫన్నీగా రష్మి పరువు తీసే ప్రయత్నం చేశాడు.

ముగ్గు వేసే మొగుడు కావాలంటున్న రష్మి

ముగ్గు వేసే మొగుడు కావాలంటున్న రష్మి

పక్కింటి అమ్మాయికి మొగుడిని కంట్రోల్ చేయడం ఎలా? వారితో ముగ్గులు సైతం వేయించడం ఎలానో నేర్పించడంతో..... ఆశ్చర్యపోయిన రష్మి, ఇలా ముగ్గులు వేసి ఇంటి పనులు చేసే అబ్బాయి దొరికితే నేను కూడా పెళ్లి చేసుకుంటాను అంటూ సమాధానం ఇస్తుంది. ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. జూన్ 21న పూర్తి షో ప్రసారం కాబోతోంది.

కష్టాల కడలి నుంచి యాంకర్‌గా

కష్టాల కడలి నుంచి యాంకర్‌గా


అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యాంకర్ రష్మి కెరీర్ తొలి నాళ్లలో చాలా కష్టాలు పడింది. అయితే జబర్దస్త్ షో చేసే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. ఈ క్రమంలోనే ఆమెకు క్రేజ్ పెరగడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

రష్మి సినిమాలు

రష్మి సినిమాలు

గుంటూరు టాకీస్ మూవీలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్న రష్మి... ఇందులో ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత ఆమెకు వసరగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. రష్మి చివరగా గతేడాది వచ్చిన ‘అంతకు మించి' చితరంలో నటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X