మరీ శృతిమించిన డైలాగ్స్.. హద్దులు దాటిన చమ్మక్ చంద్ర, నవదీప్‌.. నాగబాబు సైతం అలానే

బుల్లితెరపై జబర్దస్త్ షోది ఓ నవ శకం. ఘాటు సీన్స్, మసాలా కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను జనానికి బాగా అలవాటు చేసింది జబర్దస్త్ షో. ఒకానొక సమయంలో జబర్దస్త్ షోపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తడానికి కారణం కూడా అవే. అయితే జబర్దస్త్‌ షోను మించేలా అదిరింది ఆ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తోంది. షోలో లెక్కకుమించి మోతాదు ఎక్కువ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

 చమ్మక్ చంద్ర స్కిట్..

చమ్మక్ చంద్ర స్కిట్..

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర చేసిన స్కిట్స్ ఏ రకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక అదిరిందికి వెళ్లాక కొంచెం ఘాటుదనాన్ని కూడా పెంచినట్టు కనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగ్‌లో చంద్ర శృతిమించినట్టు కనిపిస్తోంది. ఎలా మరీ అంటూ ఓ రేంజ్‌లో రచ్చ చేశాడు.

ఎలా మరీ..

ఎలా మరీ..

చంద్ర స్కిట్స్ అన్నీ ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. తాజా ప్రోమోలో చంద్ర రెచ్చిపోయాడు. ఫ్లోర్ క్లీన్ చేసే ఓ మహిళను మీ ఆయన ఏం చేస్తాడు అని అడుగుతాడు చమ్మక్ చంద్ర.. మా ఆయన లేడండీ.. అని ఆమె సమాధానం ఇవ్వడంతో.. మీ ఆయన లేడా?? ‘ఎలా మరీ'.. అంటూ అదో రకంగా చూస్తూ అడుగుతాడు. మీ ఆయన పోయి ఎన్ని రోజులు అవుతుంది అని తిరిగి అడగ్గా.. నాలుగు సంవత్సరాల క్రితమే పోయాడని ఆ మహిళ అనడంతో.. అప్పటనుంచి ‘ఎలా మరీ' అంటూ మళ్లీ అదే తరహాలో రెండో అర్థం స్పురణకు వచ్చేలా ఓ సెటైర్ వేస్తాడు.

 రెచ్చిపోయిన నవదీప్..

రెచ్చిపోయిన నవదీప్..

ఇక జడ్జీగా ఉన్న నవదీప్‌ని.. ఏం అబ్బాయ్ నవదీప్ ఎంత మంది పిల్లలు అని చంద్ర అడగడంతో.. నాకు ఇంకా పెళ్లి కాలేదండీ అని అంటాడు. దానికి కూడా చంద్ర ‘ఎలా మరీ' అని సాగదీస్తాడు. దానికి పెళ్లికి సంబంధం ఏం ఉంది గురువుగారూ.. మీకు ఇది కూడా తెలియకపోతే ‘ఎలా మరీ'? అంటూ రివర్స్ పంచ్ వేస్తూ నవదీప్ రెచ్చిపోయాడు.

నాగబాబు సైతం..

నాగబాబు సైతం..

నిప్పు ఉన్నప్పుడే సుట్ట వెలిగిపోవాలి అబ్బాయ్.. నిప్పు ఆరిపోయాక సుట్ట ఏం చేసుకుంటామ్.. నా సుట్టలోది అంటూ చంద్ర మరో డబుల్ మీనింగ్ డైలాగ్ విసరగా.. ‘మనమే నిప్పు అయితేనండీ' అంటూ మరో రివర్స్ పంచ్ వేశాడ నవదీప్. ఇక పక్కనే ఉన్న నాగబాబు.. ‘నిప్పుసరే సుట్ట కావాలి కదా' అని పగలబడి నవ్వాడు. ఇక రవి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X