షోను నిలబెట్టుకునేందుకే వెనక్కి తగ్గారా.? జబర్ధస్త్ నుంచి ఆ ఇద్దరు లీడర్లకే ఎందుకిలా.!

By Manoj Kumar P

దాదాపు ఏడేళ్లుగా తెలుగు బుల్లితెర చరిత్రలోనే సక్సెస్‌ఫుల్ కామెడీ షోగా వెలుగొందుతోంది ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్'. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ప్రభావం చూపించిందీ కామెడీ షో. భారీ స్థాయిలో టీఆర్పీలు సాధిస్తూ దూసుకుపోతున్న 'జబర్ధస్త్' వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు టాలీవుడ్‌కు సైతం పరిచయం అయ్యారు. వారంతా ఇప్పుడు సెలెబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు.

ఇంతటి విజయవంతమైన షోలో ఈ మధ్య ఊహించని పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా జబర్ధస్త్ నిర్వహకులు చేసిన ఓ పని బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ వాళ్లు ఏం పని చేశారు..? వివరాల్లోకి వెళితే...

వాళ్లతో పాటు ఈ నలుగురికి ప్లస్ అయింది

వాళ్లతో పాటు ఈ నలుగురికి ప్లస్ అయింది

జబర్ధస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేసింది. వీరిలో చాలా మంది సక్సెస్‌ఫుల్ కమెడియన్స్‌గా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఈ షోకు మొదటి నుంచీ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్న రోజా, నాగబాబుకు కూడా ఎంతో ఉపయోగపడింది. వీళ్లతో పాటు యాంకర్లుగా పని చేస్తున్న అనసూయ, రష్మీ గౌతమ్ కూడా జబర్ధస్త్ వల్ల ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

ఆయన వల్ల షోలో ఊహించని పరిణామాలు

ఆయన వల్ల షోలో ఊహించని పరిణామాలు

ఈ మధ్య జబర్ధస్త్ షోలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ షో జడ్జ్ నాగబాబు.. నిర్వహకుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఆయన బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటే కొందరు టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు, యాంకర్ అనసూయ కూడా వేరే చానెల్‌కు వెళ్లిపోయారు. అయితే, ఇందులో నాగబాబు మినహా అందరూ వెనక్కి వచ్చేశారు.

వాళ్లు కూడా వెళ్లి తిరిగొచ్చాడు

వాళ్లు కూడా వెళ్లి తిరిగొచ్చాడు

ఇక, జబర్ధస్త్ షో ద్వారా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో చమ్మక్ చంద్ర ఒకరు. అయితే, నాగబాబు వెళ్లిన సమయంలో షో నుంచి తప్పుకున్న చంద్ర.. తర్వాత రెండు వారాలకే జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కొత్తదనం కోసం బ్రేక్ తీసుకున్నానని అప్పుడు చెప్పుకొచ్చాడు. అతడితో పాటు కిర్రాక్ ఆర్పీ కూడా ఇదే పని చేశాడు.

ఇప్పుడు మళ్లీ నాగబాబుతో కనిపించారు

ఇప్పుడు మళ్లీ నాగబాబుతో కనిపించారు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య మరో చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని షోలలో కనిపించిన ఆయన.. తాజాగా మరో సరికొత్త ప్రొగ్రాంతో వస్తున్నారు. ‘అదిరింది' అనే టైటిల్‌తో వస్తున్న ఈ షోకు సంబంధించిన ఫొటో ఒకటి విడుదలైంది. అందులో లీడర్లుగా ధన్‌రాజు, వేణు, ఆర్పీ, చంద్రలు వ్యవహరించనున్నారు. ఈ ఫొటోలో చంద్ర, ఆర్పీని చూసిన వారు షాక్ అవుతున్నారు.

వాళ్లిద్దరికే ఆ ఛాన్స్ ఎందుకిచ్చారు

వాళ్లిద్దరికే ఆ ఛాన్స్ ఎందుకిచ్చారు

జబర్ధస్త్‌లో చేయాలంటే మరే షోలోనూ పని చేయకూడదని కొందరితో అగ్రిమెంట్ రాయించుకున్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈ రూల్‌ను సడలించినట్లు తెలుస్తోంది. షోను కాపాడుకునే భాగంలోనే ఇలా నిర్ణయించుకున్నారని, అందుకే చంద్ర, ఆర్పీ వేరే చానెల్‌లో పని చేసేందుకు ఒప్పుకున్నారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X